ఇన్‌స్టా్గ్రామ్‌లో యాడ్ చూసి మోసపోయింది.. ఏకంగా రూ.74.1 లక్షలు కోల్పోయింది.. మీరు ఇలానే చేస్తున్నారా?
సైబర్ నేరాలు దేశవ్యాప్తంగా రోజూ ఎక్కడో చోట వెలుగులోకి వస్తున్నాయి. అనేక విధాలుగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా బాధితులు లక్షల రూపాయలను కోల్పోతున్నారు. చాలావరకు నేరాలు సామాజిక మాధ్యమాల ఆధారంగానే జరుగుతున్నాయి. అంటే సోషల్ మీడియాలో ఏర్పడిన పరిచయాలు మరియు కొన్ని ప్రకటనల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన స్టాక్ మార్కెట్ స్కాంలో ఓ మహిళ ఏకంగా రూ.74.1 లక్షలను (Mangalore Women Loses RS74 Lakh) కోల్పోయారు. ఈ ఘటన మంగుళూరులో జరిగింది.
TOI కథనం ప్రకారం మార్చి 15న ఓ మహిళ ఇన్‌స్టాగ్రామ్‌ను వినియోగిస్తున్నారు. అలా ఆమె దృష్టి ఓ ప్రకటనపై పడింది. తక్కువ సమయంలో, ఎక్కువ లాభాలను సంపాదించవచ్చనేది ఆ ప్రకటన సారాంశం. అయితే ఆ రంగంలో ఉన్న ఆసక్తితో ఆ ప్రకటన పైన క్లిక్ చేశారు. అనంతరం అందులో ఉన్న లింక్ పైన క్లిక్ చేశారు. మరిన్ని వివరాలకు అక్కడున్న నేరగాళ్ల ఫోన్ నంబర్‌కు కాల్ చేశారు.

అనంతరం కొద్ది సేపటికి సదరు మహిళకు మరో కొత్త వాట్సాప్ అకౌంట్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. దాని ఆధారంగా ఆన్‌లైన్ ట్రేండింగ్ పేరితో ఉన్న గ్రూప్‌లో జాయిన్ అయ్యారు. ఆ గ్రూప్‌లో ప్రతిరోజు ఆన్‌లైన్ ట్రేడింగ్ కోసం అనేక్ అప్‌డేట్‌లు వచ్చినట్లు తెలిసింది. అయితే ఏప్రిల్ 25 వ తేదీన ట్రేడింగ్ ఖాతాను తెరవాలని సదరు మహిళను నేరగాళ్లు కోరారు. ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి ఆమెను మభ్యపెట్టారు.
ఇందుకు అంగీకరించిన మహిళ.. తొలుత రూ.10,000 పెట్టుబడిగా పెట్టారు. ఫలితంగా తక్కువ కాలంలోనే అంతకంటే ఎక్కువ లాభాలను పొందారు. దీంతో అప్పటి నుంచి జులై 4వ తేదీ వరకు అనేక సార్లు నగదును నేరగాళ్ల ఖాతాలను బదిలీ చేశారు. అలా ఏకంగా రూ.74.1 లక్షలు పెట్టుబడి రూపంలో పెట్టారు.
అనంతరం తాను పెట్టిన నగదును విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నం చేశారు. నగదును తన ఖాతాకు బదిలీ చేసుకొనేందుకు అవకాశం కలగలేదు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన సదరు మహిళ వెంటనే సైబర్ క్రైం మరియు ఎకనామిక్ అఫెన్సెస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన అధికారులు ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిస్తోంది.
ఈ తరహా ఘటనల పట్ల అధికారులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. ప్రజల్లో ఆశించిన మార్పు రావడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు సదరు సంస్థ మరియు అందులోకి వ్యక్తుల గురించి తెలుసుకొనేందుకు ప్రయత్నాలు చేయాలని సూచిస్తున్నారు. ఎటువంటి ధ్రువీకరణ లేకుండా పెట్టుబడి పెట్టడం సురక్షితంగా కాదని సూచిస్తున్నారు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








