Home
News

మరో కొత్త తరహా సైబర్‌ మోసం.. ఏకంగా రూ.80 లక్షలు కోల్పోయిన మహిళ.. ఏం జరిగింది..?

సైబర్‌ నేరగాళ్లు రోజుకో కొత్త విధానంలో మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో పోలీసుల పేరుతో చేస్తున్న మోసాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. అనేక మంది లక్షల్లో నగదును కోల్పోతున్నారు. తాజాగా మరో సైబర్‌ నేరం వెలుగులోకి వచ్చింది. క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారులుగా చెప్పిన కొంత మంది నేరగాళ్లు ఓ మహిళను మోసం చేసి ఏకంగా రూ.80 లక్షలు తమ ఖాతాలను బదిలీ చేయించుకున్నారు. ఈ ఘటన ఛండీగడ్‌ లో (Woman Loses RS80 lakh in Chandigarh) జరిగింది. ఆధార్‌ మరియు సిమ్‌ కార్డు లింక్‌ అంశం ద్వారా మోసానికి పాల్పడ్డారు.

ఛండీగడ్‌ లో నివాసం ఉన్న ఓ మహిళకు ముంబై క్రైం బ్రాంచ్‌కు చెందిన పోలీసులమని చెప్పి ఓ వ్యక్తి ఫోన్‌ కాల్‌ చేశారు. ఆమె ఆధార్ కార్డు ద్వారా తీసుకున్న సిమ్‌ కార్డు నుంచి మనీ లాండరింగ్‌ జరుగుతోందని చెప్పారు. మొత్తంగా 24 మనీ ల్యాండరింగ్‌ ఫిర్యాదులున్నట్లు తెలిపారు. ఈ కేసుల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పాడు.

woman loses RS80 lakh in chandigarh

దీంతో ఆందోళనకు గురైన సదరు మహిళ న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా చూడాలని కోరింది. దీంతో తాను చెప్పినట్లు చేయాలని నేరగాళ్లు ఆమెకు సూచించారు. దర్యాప్తులో భాగంగా తాము చెప్పిన బ్యాంకు ఖాతాలో రూ.80 లక్షల డిపాజిట్‌ చేయాలని సూచించారు. ఈ కేసుల్లో నిర్దోషిగా తేలితే ఆ నగదు వెనక్కి ఇస్తామని చెప్పి ఆమెను మోసం చేశారు. అయితే కొన్ని రోజుల తర్వాత తాను మోసపోయినట్లు గుర్తించారు. దీంతో సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు జరుగుతోంది.

ఈ తరహా కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. పోలీస్ అధికారులు ఎప్పుడూ కూడా నేరుగా ఫోన్‌ చేసి నగదు డిమాండ్‌ చేయరని గుర్తించాలని సూచిస్తున్నారు. ఇటువంటి కాల్స్‌ వచ్చినప్పుడు సదరు పోలీస్‌ స్టేషన్‌కు నేరుగా కాల్‌ చేసి వివరాలు తెలుసుకోవాలని చెబుతున్నారు.

ఆధార్‌ కార్డు వివరాలు, బ్యాంకు ఖాతా నంబర్లు, OTP లను ఎవరికీ వెల్లడించకూడదు. అధికారులు ఎప్పుడు కూడా ఈ తరహా సున్నితమైన సమాచారాన్ని కోరే అవకాశం లేదు. దీంతోపాటు నిజమైన పోలీస్‌ అధికారులు ఎప్పుడూ కూడా ఫోన్‌ కాల్‌లోనే నేరుగా అరెస్ట్‌ గురించి సమాచారం ఇవ్వడం గానీ అరెస్ట్ పేరుతో బెదిరించే అవకాశం లేదు.

అనుమానాస్పద కాల్స్, మెసెజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి మరియు పోలీసులు మరియు ఇతర విభాగాలకు వెంటనే సమాచారం అందించాలి. ఫలితంగా ఈ తరహా ఘటనల్లో వేగంగా దర్యాప్తు జరిగే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఇటువంటి ఘటనల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులను సంప్రదించిన నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
woman loses RS 80 lakh in chandigarh fraudster posing as crime branch officers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X