Home
News

పార్ట్‌టైం ఉద్యోగం పేరిట మీకూ ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా.. ఇటీవల ఏం జరిగిందో తెలుసా..?

సైబర్‌ నేరాలు ఇటీవల కాలంలో రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. పార్ట్‌ టైం ఉద్యోగాలు, తక్కువ సమయంలో ఎక్కువ లభాలు వచ్చే వ్యాపారాలు అంటూ అమాయకులకు వల వేసి అందినకాడికి దోచుకుంటున్నారు. ఇలాంటి మోసాల పట్ల (Cyber Crime) అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నా రోజూ ఎక్కడో చోట మోసపోతూనే ఉన్నారు.

తాజాగా కోయంబత్తూర్‌కు మహిళను పార్ట్‌ టైం ఉద్యోగం పేరిట (Part Time Job Scam) వల వేశారు. ఈమె నుంచి సుమారు రూ.4.63 లక్షల నగదును పెట్టుబడి పేరిట కాజేశారు. మెసేజింగ్‌ ప్లాట్‌ఫాం ద్వారా మహిళకు పార్ట్‌టైం ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి పరిచయం పెంచుకున్నారు. అనంతరం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి మోసం చేశారు.

Woman lost RS 4 63 lakh in part time job offer scam in coimbatore news

తొలుత రివ్యూలు రాయాలని చెప్పి.. తర్వాత మాత్రం..!
టెలిగ్రాం ద్వారా గుర్తుతెలియని వ్యక్తుల నుంచి సదరు మహిళకు ఓ మెసేజ్ వచ్చింది. అందులో తమ వద్ద మంచి ఉద్యోగం ఉందని చెప్పి నమ్మించారు. ఆ పార్ట్ టైం ఉద్యోగంలో చేరిన తొలి కొన్ని రోజులు గూగుల్‌లో వివిధ సంస్థలకు రివ్యూలు రాయాలని చెప్పారు. అయితే అనంతరం పెట్టుబడులు పెట్టాలని, తక్కువ సమయంలోనే లాభాలు వస్తాయని తెలిపారు.

మోసగాళ్ల మాటలు నిజమని నమ్మిన సదరు మహిళ అనేక విడతల్లో సుమారు రూ.4.63 లక్షలను వారి బ్యాంకు ఖాతాలకు పంపింది. అయితే ఆ నగదును వెనక్కి తీసుకొనేందుకు ప్రయత్నం చేసింది. దీంతో మోసగాళ్లు ఆమె ముందు పలు డిమాండ్లు పెట్టారు.

Woman lost RS 4 63 lakh in part time job offer scam in coimbatore news

దీంతో మోసపోయానని గుర్తించిన మహిళ కోయంబత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదులో IPC 420 మరియు 66D ఆఫ్‌ ఐటీ యాక్ట్‌ ప్రకారం కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్‌ చేసినట్లు సమాచారం లేదు.

ఇలాంటి సమయాల్లో ఏం చేయాలి :
ఇలాంటి ఘటనల్లో బాధితులుగా మారకుండా అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగాలు, పెట్టుబడులు పెట్టాలని ఎవరు సంప్రదించినా అప్రమత్తంగా వ్యవహరించాలి. సదరు ఉద్యోగ ప్రకటన గురించి పూర్తి వివరాలు తెలుసుకొనే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా వ్యక్తిగత సమాచారం కావాలని కోరిన సందర్భాల్లో మరింత చాకచక్యంగా వ్యవహరించాలి.

మరింత జాగ్రత్త అవసరం :
దీంతోపాటు వ్యక్తిగత భద్రత విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఫోన్‌ కాల్‌ లేదా చాట్‌లో సున్నితమైన లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని షేర్‌ చేయవచ్చు. దీంతోపాటు సురక్షితం కాని ప్లాట్‌ఫాంల నుంచి వచ్చే మెసేజ్‌ల పైన అప్రమత్తంగా ఉండాలి. దీంతోపాటు ఎటువంటి అనుమానం కలిగినా పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Woman lost RS 4.63 lakh in part time job offer scam in coimbatore
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X