ఫోన్ ఎక్కువ వాడటంతో వంగిపోయిన వేళ్ళు

ఈ స్మార్ట్‌ఫోన్ల యుగంలో ప్రతి ఒక్కరు తమ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా కాస్త ఖాళీ దొరికినా స్మార్ట్‌ఫోన్లకే సమయం కేటాయిస్తున్నారు.

|

ఈ స్మార్ట్‌ఫోన్ల యుగంలో ప్రతి ఒక్కరు తమ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా కాస్త ఖాళీ దొరికినా స్మార్ట్‌ఫోన్లకే సమయం కేటాయిస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల దుష్ప్రభావాలు కలుగుతున్నాయి.ఇలాంటి సంఘటనే ఒకటి చైనాలో చోటు చేసుకుంది. చైనా లోని ఓ మహిళా అదేపనిగా ఫోన్ వాడకంతో వేళ్ళు వంగిపోయాయి.... పూర్తి వివరాల్లోకి వెళ్తే

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్

 చైనాలోని హునాన్ ప్రావిన్స్ కు చెందిన  ఓ మహిళ....

చైనాలోని హునాన్ ప్రావిన్స్ కు చెందిన ఓ మహిళ....

చైనాలోని హునాన్ ప్రావిన్స్ కు చెందిన ఓ మహిళ ఏకంగా వారం రోజుల పాటు ఏకధాటిగా సెల్‌ఫోన్ వాడింది. ఎంతలా అంటే రాత్రి పూట నిద్రిస్తున్న కొద్ది సమయం మాత్రమే ఫోన్‌ను పక్కన పెట్టేది. మిగతా సమయం అంతా రెండు చేతులతో మొబైల్ స్క్రీన్‌పై ఏవో టచ్ చేస్తూ కాలక్షేపం చేసింది.

ఆఫీసుకు సెలవు పెట్టి.....

ఆఫీసుకు సెలవు పెట్టి.....

వారం పాటు ఆఫీసుకు సెలవు పెట్టిన సదరు మహిళ ఆ సమయం మొత్తం మొబైల్‌కే కేటాయించింది. ఫలితం ఆమె చేతి వేళ్లు బిగుసుకుపోయాయి. రెండు చేతులతో మనం ఎలా మొబైల్‌ను పట్టుకొని వాడుతుంటామో ఆమె వేళ్లు అవే పొజిషన్‌లో కదలకుండా ఉండిపోయాయి.వాటిని సాధారణ స్థితికి ఆమె తీసుకురాలేకపోయింది. ఏమాత్రం కదిలించాలని చూసిన విపరీతమైన నొప్పి వేధించింది.

డాక్టర్ దగ్గరకు చికిత్స కోసం వెళ్లింది....

డాక్టర్ దగ్గరకు చికిత్స కోసం వెళ్లింది....

దీంతో డాక్టర్ దగ్గరకు చికిత్స కోసం వెళ్లింది. టెనోసినివిటిస్‌తో ఆమె బాధపడుతున్నట్లు డాక్టర్లు తేల్చారు. అంటే ప్రతి రోజూ చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయడం వల్ల ఆమె చేతి వేళ్లలో ఒక రకమైన ఫ్లుయిడ్ నిండినట్లు డాక్టర్లు గుర్తించారు.

చికిత్స చేసి ఆమె చేతి వేళ్లను మళ్లీ.....

చికిత్స చేసి ఆమె చేతి వేళ్లను మళ్లీ.....

ఎలాగోలా చికిత్స చేసి ఆమె చేతి వేళ్లను మళ్లీ మామూలు స్థితికి తీసుకొచ్చారు .ఇక పై స్మార్ట్‌ఫోన్ వాడకం తగ్గించాలని ఆమెకు వైద్యులు సూచించారు

Best Mobiles in India

English summary
Woman Unable To Move Her Fingers After Week-Long Cell Phone Binge.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X