మహిళా దినోత్సవ స్పెషల్: టెక్నాలజీ విభాగంలో రాణిస్తున్న శక్తివంతమైన మహిళలు

Posted By:

ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళామణులు ఇప్పుడు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీపడుతున్నారు. ఐటీ విభాగంలోనూ పురుషులకు ధీటుగా రాణిస్తున్నారు. ఓ సంస్థకు సీఈవో స్థానంలో కొనసాగాలంటే సదరు రంగంలో ప్రావిణ్యాన్ని సంపాదించటంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, మేనేజ్ మెంట్ స్కిల్స్ అలానే నాయకత్వ లక్షణాలను సమృద్ధిగా అలవర్చుకోవల్సి ఉంటుంది.

మార్చి8, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకని టెక్నాలజీ విభాగంలో అంతర్జాతీయంగా రాణిస్తున్న పలువురు శక్తివంతమైన మహిళలను మీకు పరిచయం చేయబోతున్నాం.

మొబైల్, స్మార్ట్‌ఫోన్‌ ఇంకా ల్యాప్‌టాప్‌లకు సంబంధించి మరిన్నిఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టెక్నాలజీ విభాగంలో రాణిస్తున్న శక్తివంతమైన మహిళలు

షెరిల్ శాండ్‌బెర్గ్ (Sheryl Sandberg):

షెరిల్ శాండ్‌బెర్గ్ ఫేస్‌బుక్ తొలి మహిళా బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఆ సంస్థకు నాలుగు సంవత్సరాల పాటు సీవోవోగా వ్యవహరించారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పట్టాను పొందిన షెరిల్ యూఎస్ ట్రెజరీ డిపార్ట్ బెంట్ ఇంకా గూగుల్ ఆన్‌లైన్ గ్లోబల్ సేల్స్ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు.

టెక్నాలజీ విభాగంలో రాణిస్తున్న శక్తివంతమైన మహిళలు

ఉర్సులా బర్న్స్ (Ursula Burns):


జిరాక్స్ కంపెనీలో మెకానికల్ ఇంజనీర్‌గా తన కేరీర్‌ను ప్రారంభించిన ఆఫ్రో-అమెరికన్ జాతీయరాలు ఉర్సులా బర్న్స్ 2009లో ఆ కంపెనీకి సీఈవోగా ఎంపికయ్యారు. 2010లో చైర్మన్‌గా నియమతులయ్యారు. 1992 నుంచి 2000 వరకు ఈమె వివిధ బిజినెస్ బృందాలను లీడ్ చేశారు. పాలిటెక్నిక్ అలానే మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఈమె ప్రావిణ్యాన్ని సాంపాదించారు.

టెక్నాలజీ విభాగంలో రాణిస్తున్న శక్తివంతమైన మహిళలు

కిరణ్ మజుందార్ షా (Kiran Mazumdar-Shaw):

తొలి భారతీయ బయోటెక్ పారిశ్రామికవేత్తగా కిరణ్ మజుందార్ షా గుర్తింపు పొందారు. ఈమె 1978లో బయోకాన్ పేరుతో సంస్థను స్థాపించారు. ఆసియా హెల్త్ కేర్ మేగజైన్ కిరణ్ మజుందార్ షాను భారతదేశపు గ్లోబుల్ మహిళగా గుర్తించింది.

టెక్నాలజీ విభాగంలో రాణిస్తున్న శక్తివంతమైన మహిళలు

మారిస్సా మేయర్ (Marissa Mayer):

ప్రముఖ ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ యాహూకు సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మారిస్సా మేయర్ యువ సీఈవోగా రికార్డుల్లో నిలిచారు. ఈమె సింబాలిక్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో డిగ్రీలను పొందారు. గూగుల్‌లో పని చేసిన తొలి మహిళా ఇంజనీర్ గా మారిస్సా గుర్తింపుపొందింది.

టెక్నాలజీ విభాగంలో రాణిస్తున్న శక్తివంతమైన మహిళలు

జోసిలిన్ గోల్డ్‌ఫియన్(Jocelyn Goldfein):

ఫేస్‌బుక్‌లో డైరెక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్న జోసిలిన్ గోల్డ్ ఫియన్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లను వృద్ధిచేయటంలో దిట్ట. స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించిన జోసిలిన్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో మాస్టర్ డిగ్రీని పొందారు.

టెక్నాలజీ విభాగంలో రాణిస్తున్న శక్తివంతమైన మహిళలు

జూలీ లార్సన్ - గ్రీన్ (Julie Larson-Green):

విండోస్ సాఫ్ట్‌వేర్ ఇంకా హార్డ్‌వేర్ విభాగాలకు సంబంధించి ఇటీవల అధ్యక్ష హోదాను అధిరోహించిన జూలీ లార్సన్ - గ్రీన్ ఆధనిక మహిళామణులకు ఆదర్శంగా నిలిచారు. ఈమె సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ విభాగంలో మాస్టర్ డిగ్రీ, బిజినెస్ పరిపాలనా విభాగాలో బ్యాచిలర్ డిగ్రీలను పొందారు. విండోస్7, విండోస్8 ఆపరేటింగ్ సిస్టంలకు సంబంధించి ప్రోగ్రామ్ మేనేజిమెంట్, యూజర్ ఇంటర్‌ఫేస్ డిజైన్ ఇంకా రిసెర్చ్ తదితర అంశాలకు సంబంధించి లార్సన్ - గ్రీన్ పూర్తి బాధ్యత వహిస్తున్నారు.

టెక్నాలజీ విభాగంలో రాణిస్తున్న శక్తివంతమైన మహిళలు

లిండా డిమైచీల్ (Linda DeMichiel):


కంప్యూటర్ సైన్స్‌కు సంబంధించి స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పీహెచ్.డిని పొందిన లిండా టెక్నాలజీ ప్రపంచలో అంచలంచెలుగా ఎదుగుతున్న మహిళలకు స్పూర్తిగా నిలిచారు. ఈమె జావా ఈఈ ప్లాట్‌ఫామ్ గ్రూప్‌లో సీనియర్ ఆర్కిటెక్ట్‌గా కొనసాగుతున్నారు. ఓరాకిల్, జావా విభాగాల్లో లిండా డిమైచీల్ నిష్ణాతులు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot