Work from Home చేస్తున్నారా!!! అయితే ఈ టిప్స్ పాటించండి...

|

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశం మొత్తాన్ని లాక్డౌన్ ప్రకటించడంతో అన్ని ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుండి పని చేయాలని మరియు ప్రభుత్వ నిర్బంధ నిబంధనలను పాటించాలని కోరుతున్నాయి. అయినప్పటికీ ఇంటి నుండి పనిచేసే వారి సంఖ్య పెరగడంతో సైబర్‌టాక్‌ల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది.

సైబర్ నేరస్థులు

హ్యాకర్లు మరియు సైబర్ నేరస్థులు ప్రజలకు మరియు ఉద్యోగులకు ఆర్థిక మరియు డేటా నష్టాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంటి నుండి పని చేయడం మరియు పనిని పూర్తి చేయడం అనేది ప్రత్యామ్నాయ మరియు ఆచరణీయమైన ఎంపిక అయినప్పటికీ ఇది కొన్ని నష్టాలను కూడా తీసుకువస్తుంది. కాబట్టి ఉద్యోగులు ఇంటి నుండి పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మరియు సంస్థ యొక్క డేటాను చాలా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. సైబర్ దాడిని నివారించడానికి తప్పనిసరిగా పరిగణించవలసిన కొన్ని చిట్కాలను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. అవి ఏమిటో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

 

 

Aarogya Setu App: PM మోడీ సూచనతో అమాంతం పెరిగిన యాప్ డౌన్‌లోడ్‌లు....Aarogya Setu App: PM మోడీ సూచనతో అమాంతం పెరిగిన యాప్ డౌన్‌లోడ్‌లు....

Work from Home టిప్స్
 

Work from Home టిప్స్

**** అన్ని డిఫాల్ట్ పాస్‌వర్డ్‌లను మార్చండి. అలాగే మీరు వాడుతున్న అన్ని డివైస్లు మరియు ఆన్‌లైన్ అకౌంటుల కోసం బలమైన పాస్‌వర్డ్‌లను సెట్ చేయండి.

**** మీ యొక్క సంస్థ అందించిన కంప్యూటర్లు / ల్యాప్‌టాప్‌లను మీ యొక్క వ్యక్తిగత ల్యాప్‌టాప్‌ల వలే కాకుండా సాధ్యమైనంత సున్నితంగా ఉపయోగించండి.

**** మీ యొక్క ఆఫీసు పని కోసం మరియు విశ్రాంతి కార్యకలాపాల కోసం ఒకే పరికరాన్ని ఉపయోగించవద్దు.

**** ఆఫీసు యొక్క మీటింగు లింక్‌లను బహిరంగంగా లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మరొకరికి షేర్ చేయకండి.

 

Airtel Home All in One Plan యొక్క ప్రయోజనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి!!!!Airtel Home All in One Plan యొక్క ప్రయోజనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి!!!!

వీడియో కాన్ఫరెన్సింగ్

**** ముఖ్యమైన వీడియో కాన్ఫరెన్సింగ్ మరియు వీడియో మీటింగుల కోసం ఆమోదించబడిన విశ్వసనీయ యాప్ లను మాత్రమే ఉపయోగించండి.

**** అన్ని ఆపరేటింగ్ సిస్టమ్ (OS), యాంటీవైరస్ మరియు అన్ని రకాల యాప్ లను అప్ డేట్ చేయండి.

**** రిమోట్ యాక్సెస్ ను సాధ్యమైనంత వరకు నిలిపివేయండి. అవసరమైతే దానిని సరైన భద్రతతో ఉపయోగించాలి.

**** కార్యాలయ వ్యవస్థలను యాక్సెస్ చేయడానికి సురక్షిత నెట్‌వర్క్‌ను ఉపయోగించండి.

 

 మెయిల్ ID

**** మీ ఉన్నతమైన మెయిల్ ID మాదిరిగానే మారువేషంలో ఉండే ఇమెయిళ్ళను ఫిషింగ్ చేయడంలో జాగ్రత్తగా ఉండండి. అన్ని లింక్‌లను ఓపెన్ చేయడానికి ముందు వాటిని సరిగ్గా తనిఖీ చేయండి.

**** ఓపెన్ మరియు ఉచిత వై-ఫై నెట్‌వర్క్‌లను సాధ్యమైనంత వరకు ఉపయోగించకపోవడం చాలా వరకు ఉత్మమం. మీ ఇంటి Wi-Fi యొక్క పాస్‌వర్డ్‌లను కూడా డిఫాల్ట్ పాస్‌వర్డ్‌ను మార్చండి.

**** మీరు ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థ జారీ చేసిన భద్రత మరియు ఇతర మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించండి.

 

Best Mobiles in India

English summary
Work from Home Tips and Tricks in Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X