Home
News

వరల్డ్ బుక్ డే: ఉచితంగా 10 కిండ్ల్ ఇ-పుస్తకాలను అందిస్తున్న అమెజాన్...

ప్రపంచ పుస్తక దినోత్సవం ఏప్రిల్ 23 న జరుపుకోనుచున్నారు. పుస్తక ప్రియులకు ఈ విషయం తెలిసే ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది పుస్తకాలను చదవడంలో ఆశక్తి ఉన్నవారు ఇ-పుస్తకాలను ఎంచుకుంటున్నారు. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా అమెజాన్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తన యొక్క వినియోగదారులకు 10 కిండ్ల్ ఇ-పుస్తకాలను ఉచితంగా అందిస్తోంది. ఈ ఉచిత ఇ-పుస్తకాలను కిండ్ల్, అమెజాన్ ఫైర్ టాబ్లెట్ లేదా కిండ్ల్ యాప్ ఉపయోగించి యాక్సెస్ చేయవచ్చు. ఈ-పుస్తకాలను డౌన్‌లోడ్ చేయడానికి అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం కూడా అవసరం లేదు.

World Book Day: Amazon Offers 10 Kindle e-Books at Free of Cost

10 ఇ-పుస్తకాలన్నీ 10 వేర్వేరు దేశాల నుండి తీసుకోబడడమే కాకుండా వాటిని ఆంగ్లంలోకి అనువదించబడ్డాయి. ఈ ఉచిత ఆఫర్ ఏప్రిల్ 25 న 12:29 PM IST తో ముగుస్తుంది. ఆ తర్వాత ఈ ఇ-పుస్తకాలు ఏవీ ఉచితంగా లభించవు.

ఉచిత ఈ-పుస్తకాల జాబితా

** మార్క్ లెవీ రచించిన ఆలిస్ పెండెల్బరీ యొక్క స్ట్రేంజ్ జర్నీ
** సింగిల్ స్వాలో బై జహాంగ్ లింగ్
** ది బ్రోకెన్ సర్కిల్: ఎ మెమోయిర్ ఆఫ్ ఎస్కేపింగ్ ఆఫ్ఘనిస్తాన్ బై ఎంజీలా అహ్మది-మిల్లెర్
** కెయిచిరో హిరానో రచించిన అట్ ది ఎండ్ అఫ్ మ్యాటినీ
** యు, మి, అండ్ ది కలర్స్ ఆఫ్ లైఫ్ బై నోవా సి వాకర్
** ది సన్ అండ్ హీర్: ఎ మెమోయిర్ బై అలెగ్జాండర్ మున్నింగ్హాఫ్
** అమోరా: నటాలియా బోర్గెస్ పోలెసో కథలు
** సమ్ డేస్ బై మరియా వెర్నికే
** ది కింగ్ ఆఫ్ వార్సా: ఎ నవల్ బై స్జ్జెపాన్ ట్వార్డోచ్
** రిటర్న్ టూ ది ఎన్చాన్టెడ్ ఐలాండ్ : నావల్ బై జోహరీ రావలోసన్

ప్రపంచ పుస్తక దినోత్సవ ఆఫర్‌తో పాటు అమెజాన్ ఇటీవలే తన నెలవారీ కిండ్ల్ అన్‌లిమిటెడ్ సబ్‌స్క్రిప్షన్‌లో రూ.40 తగ్గింపును ప్రకటించింది. ఇది ఇప్పుడు భారతదేశంలోని అమెజాన్ వినియోగదారులందరికీ రూ.169 కు బదులుగా రూ.129 కు అందుబాటులో ఉంచబడింది. ప్రైమ్ సభ్యులకు మరింత తక్కువ డిస్కౌంట్ ధరకు నెలకు రూ.99లకే తగ్గించడం జరుగుతుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు అదనపు ఖర్చు లేకుండా బహుళ ఇ-బుక్‌లను యాక్సెస్ చేస్తుంది.

World Book Day: Amazon Offers 10 Kindle e-Books at Free of Cost

అమెజాన్ కొత్త ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారులు తమ కిండ్ల్ లాక్ స్క్రీన్‌పై తాము చదువుతున్న ఇ-బుక్ కవర్‌ను సెట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ కి ప్రస్తుతం 8 మరియు 10 వ తరం కిండ్ల్, 7 మరియు 10 వ తరం పేపర్‌వైట్, 8, 9 మరియు 10 వ తరం ఒయాసిస్ మరియు 7 వ తరం వాయేజ్‌లో మద్దతు ఉంది.

Best Mobiles in India

English summary
World Book Day: Amazon Offers 10 Kindle e-Books at Free of Cost
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X