2015: ప్రపంచం చేత జేజేలు పలికించుకున్న చిత్రాలివే

Written By:

ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వరల్డ్ ప్రెస్ ఫోటో కాంటెస్ట్ ఫలితాలు నెదర్లాండ్ రాజధాని అమ్ స్టర్ డ్యాంలో అర్థరాత్రి విడుదల చేశారు. ప్రపంచం నలుమూలల చోటు చేసుకున్న వివిధ సందర్భాలను ఫోటోల రూపంలో మలిచిన అనేకమంది ఫోటోగ్రాపర్స్ ఈ పోటీలో పాల్గొన్నారు. దాదాపు 5,775 మంది ఫోటోగ్రాపర్లు చిత్రీకరించిన 82951 చిత్రాలు ఈ పోటికి అర్హత సాధించాయి. వాటన్నింటిలో కెల్లా బెస్ట్ ఫోటోగా సిరియన్ల వలస కష్టాలపై చిత్రించిన ఛాయా చిత్రానికి 2015 ఏడాదికి గానూ మొదటి బహుమతి సాధించింది. హంగరీ సెర్బిమా సరిహద్దు వద్ద చంటిపిల్లాడితో కంచె దాటుతున్న కుటుంబం ఫోటోను ఆస్ట్రేలియాకు చెందిన వారెన్ రిచర్డ్ సన్ తీసారు. మొత్తం 128 విభాగాల్లో ఉత్తమ ఫోటోలను ఎంపిక చేశారు. వాటిలో కొన్నింటిని చూద్దాం.

Read more: ఒక ఫోటో ప్రపంచాన్ని మార్చింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సమకాళీన అంశాల మీద

జాన్ జె కిమ్ తీసిన ఈ ఫోటో మూడవ బహుమతిని గెలుచుకుంది. పోలీసులకి ఉద్యమకారులకి మధ్య చికాగోలో జరిగిన ఘర్షణ సంధర్భంగా క్లిక్ మనిపించారు.

ప్రకృతి విభాగంలో మూడవ బహుమతి

ది పవర్ ఆఫ్ నేచర్ పేరుతో మెక్సికోలో రాత్రి వేళ తీసిన చిత్రం ఇది. టపిరో దీన్ని క్లిక్ మనిపించారు.

జనరల్ న్యూ

గ్రీస్ శరణార్థులు యూరప్ లోకి వలసవెళుతూ పడుతున్న అవస్థలు. ఈ చిత్రానికి మొదటి బహుమతి వచ్చింది.

రోజువారీ జీవితం ( రెండవబహుమతి )

బ్రెజిల్ లోని తపజో నదిలో పిల్లల కేరింతలు. లిమా దీన్ని క్లిక్ మనిపించారు.

రోజువారీ వార్తలు మూడవ బహుమతి

నేపాల్ భూకంపానికి సంబంధించిన చిత్రం. పశుపతి నాద్ గుడి దగ్గర భాగమతినదిలో భూకంపంలో చనిపోయినవారికి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా తీసిన చిత్రం. డేనియల్ క్లిక్ మనిపించారు.

రోజు వారీ జీవితం ( మూడవబహుమతి )

పౌర జర్నలిజంలో భాగంగా మురికివాడలో పోలీసుల పెట్రోలింగ్. లిస్టే దీన్ని క్లిక్ మనిపించారు.

రోజువారీ జీవితం (మొదటి బహుమతి)

చైనాలోని విద్యుత్ ప్లాంట్ వద్ద ఓ చైనీయుని అవస్థలు

నేచర్ విభాగంలో ఫస్ట్ ప్రైజ్

ఆస్ట్రేలియాలోని బీచ్ దగ్గర సన్నివేశం ఇది. దీన్ని రోహన్ క్లిక్ మనిపించారు.

స్పాట్ న్యూస్ విభాగంలో ఫస్ట్ ఫ్రైజ్

కొత్త జీవితం కోసం పరుగులు పెడుతున్న హంగేరి శరనార్థి

కాన్ టెంపరరీ ఇష్యూ

చైనాలోని టాంజాన్ సీటీ మొదటి బహుమతి గెలుచుకుంది. దీన్ని జాంగ్ క్లిక్ మనిపించారు.

జనరల్ న్యూస్ లో సెకండ్ ప్రైజ్

సిరియా దళాల దాడిలో గాయపడిన బాలిక ఆసుపత్రిలో చూస్తున్న నిర్వేదపు చూపులు. డౌమని దీన్ని క్లిక్ మనిపించారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write World Press Photo 2016 winners in pictures
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot