ప్రపంచంలోని టాప్ 5 స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఇవే !
ఇప్పుడు ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్నది ఏదైనా ఉందంటే అది స్మార్ట్‌ఫోన్ మాత్రమే. చేతిలో ఏం ఉన్నా లేకున్నా స్మార్ట్‌ఫోన్ మాత్రం ఉండాల్సిందే .
ఇప్పుడు ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్నది ఏదైనా ఉందంటే అది స్మార్ట్‌ఫోన్ మాత్రమే. చేతిలో ఏం ఉన్నా లేకున్నా స్మార్ట్‌ఫోన్ మాత్రం ఉండాల్సిందే . అదే విధంగా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో వినియోగదారుల మనుసును గెలుచుకుంటున్నాయి.అయితే ఈ నేపథ్యంలో ఈ ఏడాది వినియోగదారుల మనసును గెలుచుకున్న స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కొన్ని ఉన్నాయి. వీటిల్లో స్మార్ట్‌ఫోన్ రారాజు శాంసంగ్ దిగ్గజ స్థానాన్ని ఆక్రమించింది అయితే ఎప్పుడు మొదట రెండు స్థానాల్లో ఉండే Apple మాత్రం ఈ సారి మూడవ స్ధానానికి చేరింది.

Samsung
Samsung కంపెనీ వినియోగదారుల్లో ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని మరోసారి నిరూపించుకుంది. ఈ ఏడాది బెస్ట్ ఫోన్ కంపెనీలలో టాప్ ప్లేస్ ని సొంతం చేసుకుంది.Galaxy Note 9 భారీ సేల్స్ జరగడంతో Samsung టాప్ ప్లేస్ కి వెళ్ళిపోయింది.

Huawei
ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో Huawei రెండో స్థానంలో ఉంది. కంపెనీ నుంచి వచ్చిన మిడ్ రేంజ్ ఫోన్లు భారీ స్థాయిలో అమ్మడుపోయాయి.

Apple
Apple కంపెనీకి ఈ ఏడాది సరిగా కలిసిరాలేదు .ఎప్పుడు మొదట రెండు స్థానాల్లో ఉండే Apple కంపెనీ ఈ సారి మూడవ స్ధానానికి వెళ్ళిపోయింది.అయితే iPhone X ఫోన్ మాత్రం రికార్డు స్థాయి అమ్మకాలను జరిపింది.

Xiaomi
Xiaomi ఈ పేరు స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో తెలియని వారు ఉండరు. బడ్జెట్ ధరలో అత్యధిక ఫీచర్లున్న ఫోన్లను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తూ మొబైల్ మార్కెట్లో తన సత్తా చాటుకుంటుంది. అయితే ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోXiaomiది మాత్రం నాలుగవ స్థానం.

Oppo
ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో Oppoది ఐదవ స్థానం.కంపెనీ నుంచి వచ్చిన ఫోన్లు కెమెరాతో అదరగొట్టడం కంపెనీకి ప్లస్ పాయింట్ అయింది.ఈ మధ్య కాలంలో విడుదల అయిన Oppo FindX కు మంచి పేరొచ్చింది.


Click it and Unblock the Notifications








