డ్రైవర్ లేకుండా ప్రయాణించే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బులెట్ ట్రయిన్స్ ఎక్కడా?

|

ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఒకేచోట కలిసి చేసుకొనే అతి పెద్ద పండుగ ఒలింపిక్స్. అన్ని రకాల దేశాలకు చెందిన ప్రతిభావంతులు తమ తమ ప్రతిభలను చూపడానికి ఒలింపిక్స్ ఒక వేదికగా ఉంటుంది. 2018 లో ముగిసిన ఒలింపిక్స్ తరువాత తరువాత 2022 లో జరగబోయే వింటర్ ఒలింపిక్స్ కోసం ఈ సారి చైనా దేశం వేదికను ఇవ్వనున్నది. ఈ వేదిక కోసం చైనా ఇప్పటికే అద్భుతమైన వేదికలను నిర్మిస్తోంది.

బులెట్ ట్రయిన్స్
 

2022లో జరపబోయే ఒలింపిక్స్ ఆదిత్యం కోసం చాలా దేశాలు పోటీ పడినప్పటికీ ఈ సారి ఆదిత్యం ఇచ్చే అవకాశం చైనాకు దక్కింది. చైనా యొక్క రాజధాని బీజింగ్ నగరంలో జరగబోయే ఒలింపిక్స్ కోసం చైనా అన్ని రకాల ఏర్పాటులను చేస్తున్నది. ఇప్పుడు చైనా తన రాజధానిలో ప్రపంచములోకెల్లా అతి పెద్ద ఎయిర్ పోర్ట్ ను అధునాతన టెక్నాలిజీని ఉపయోగించి నిర్మిస్తున్నది. ఇది కాకుండా 2 సంవత్సరాలకు ముందే డ్రైవర్ లేని అతి వేగవంతమైన బులెట్ ట్రయిన్స్ ను ఇప్పుడు ప్రారంభించింది. దీని గురించి మరిన్ని వివరాల కోసం ముందుకు చదవండి.

ఫ్లిప్‌కార్ట్‌లో గొప్ప ఆఫర్లతో నోకియా 55-inch స్మార్ట్ టీవీ సేల్స్

డ్రైవర్లెస్ బుల్లెట్ రైలు

డ్రైవర్లెస్ బుల్లెట్ రైలు

2022 లో చైనాలో జరగబోయే బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ కు రెండు సంవత్సరాలకు ముందు చైనా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రపంచంలోనే అతివేగంతో నడిచే డ్రైవర్లెస్ బుల్లెట్ రైలును విడుదల చేసింది. ఈ బుల్లెట్ రైళ్లు చైనా యొక్క రాజధాని బీజింగ్‌ను మరియు జాంగ్‌జియాకౌను కలుపుతు 194కిమీ దూరం ఉంటుంది.

1 మిలియన్ వినియోగదారులను దాటిన ఎయిర్టెల్ వై-ఫై కాలింగ్ సర్వీస్

హై-స్పీడ్

CNN ట్రావెల్ నివేదిక ప్రకారం ఈ హై-స్పీడ్ డ్రైవర్లెస్ స్మార్ట్ బుల్లెట్ ట్రైన్ అధునాతనమైన టెక్నాలజీతో నిర్మించబడి ఉంది. ఈ స్మార్ట్ బుల్లెట్ ట్రైన్ 108-మైళ్ల (సుమారు 174 కిమీ) ప్రయాణ సమయాన్ని మూడు గంటల నుండి కేవలం 47 నిమిషాలకు తగ్గిస్తుంది. ఈ రైలు యొక్క మార్గంలో కేవలం 10 స్టాప్‌లు మాత్రమే ఉంటాయి. వీటిలో చాలా వరకు 2022 బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ వేదికలకు దగ్గరగా ఉంటాయి.

టిక్‌టాక్‌కు పోటీగా భారత్‌లో త్వరలో ఫేస్‌బుక్ వీడియో యాప్

స్మార్ట్ బుల్లెట్ టెక్నాలజీ
 

స్మార్ట్ బుల్లెట్ టెక్నాలజీ

ఈ హై-స్పీడ్ డ్రైవర్లెస్ స్మార్ట్ బుల్లెట్ ట్రైన్ యొక్క అన్ని బోగీల్లో 5G టెక్నాలజీ అమర్చబడి ఉంటుంది. ప్రతి సీటులో టచ్‌స్క్రీన్ కంట్రోల్ పానెల్‌తో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంటుంది. ప్రయాణ సమయంలో ఏదైనా ఇబ్బందుల కలిగితే కనుక వాటిని అధిగమించడానికి కొన్ని అదనపు సాధారణ ఫీచర్లను రియల్-టైంలో పొందడానికి 2,718 సెన్సార్లు ఉన్నాయి. అంతే కాదు ఆన్‌బోర్డ్‌లో ఇంటెలిజెంట్ లైటింగ్ కూడా ఉంటుంది.

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ బూమరాంగ్‌ల కోసం టిక్‌టాక్‌ను పోలిన కొత్త ఫీచర్‌లు

మోడల్ 3 ఆల్-ఎలక్ట్రిక్ సెడాన్‌

మోడల్ 3 ఆల్-ఎలక్ట్రిక్ సెడాన్‌

చైనా యొక్క మరొక వార్తల వివరాలలో ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీదారు టెస్లా గత నెలలో తన మొదటి ‘మేడ్ ఇన్ చైనా' మోడల్ 3 ఆల్-ఎలక్ట్రిక్ సెడాన్‌ను పంపిణీ చేయడం ప్రారంభించింది. సంస్థ యొక్క కొత్త షాంఘై ప్లాంట్‌లో తయారుచేసిన మొదటి 15 మోడల్ 3 ఎలక్ట్రిక్ కార్లను కంపెనీ ఉద్యోగులకు అందజేసింది. వినియోగదారులకు డెలివరీలు ఈ నెల నుండి కొనసాగుతున్నాయి.

తక్కువ ధరకు రోజుకు 2GB & 3GB డేటాను అందిస్తున్న రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు

సైబర్‌ట్రక్‌

సైబర్‌ట్రక్‌

ఇటీవల టెస్లా తన ఆల్-ఎలక్ట్రిక్ సైబర్‌ట్రక్‌తో చాలా సంచలనం సృష్టించింది. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో టెస్లా వ్యవస్థాపకుడు మరియు CEO ఎలోన్ మస్క్ గత నెలలో ఆ వేదికపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ ట్రక్కును ఆవిష్కరించారు. ప్రయోగంలో భాగంగా కంపెనీ వివిధ వెర్షన్లు, ధర, పరిధి, లభ్యత మరియు ఇతర సామర్థ్యాల గురించి సమాచారాన్ని అందించింది. ప్రస్తుతం సైబర్ట్రక్ యొక్క ప్రీ-ఆర్డర్లను ప్రారంభించింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
world's Fastest Without Driver Bullet Trains Launched in Chaina With Modern Technology

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X