ప్రపంచపు మొట్టమొదటి ఫ్లెక్సిబుల్ ఫోన్
కెనడాకు చెందిన రిసెర్చర్ల బృందం ప్రపంచపు మొట్టమొదటి ఫ్లెక్సిబుల్ స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్థి చేసింది. ప్రత్యేకమైన బెండ్ సెన్సార్లతో వస్తోన్న ఈ ఫ్లెక్సిబుల్ ఫోన్ డిస్‌ప్లేను టచ్ చేయకుండానే గేమ్స్ వంటివి అడేయవచ్చు.

Read More : పాత ఫోన్ కొనేముందు..?
రిఫ్లెక్స్ పేరుతో రాబోతున్న ఈ ఫోన్‌ను క్వీన్స్ విశ్వవిద్యాలయ రిసెర్చర్లు అభివృద్థి చేయటం జరిగింది. పూర్తి కలర్ ఇంకా హై రిసల్యూషన్ డిస్‌ప్లేతో రూపకల్పన కాబడిన ఈ ఫోన్‌కు బెండ్ ఇన్‌పుట్ ఫీచర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

దీంతో యూజర్లు భౌతిక స్పర్శను ఆస్వాదించవచ్చు. ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే ఈ రిఫ్లెక్స్ ఫోన్‌లో ఎల్‌జీ రూపొందించిన ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడి టచ్ స్ర్కీన్‌ను పొందుపరిచారు. వాయిస్ కాయిల్ ఫీచర్ ఫోన్‌కు మరో ప్రధాన ఆకర్షణ.
Read More : ఐఫోన్6 vs గెలాక్సీ ఎస్5 (అగ్ని పరీక్ష)


Click it and Unblock the Notifications








