ప్రపంచంలోని అత్యంత పొడవైన కారులో ఉపయోగించిన టెక్నాలజీ వివరాలను తెలుసుకోండి!!

|

ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారుగా 1986లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నుండి అటెన్షన్ పొందిన అమెరికన్ డ్రీమ్ కారు ఎట్టకేలకు ఇప్పుడు పునరుద్ధరించబడి అప్ గ్రేడ్ చేయబడి రోడ్డు మీదకు రావడానికి సిద్ధంగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఈ కారు లగ్జరీ వాహనాల విభాగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. ఈ పునర్నిర్మించిన కారు మీరు ఊహించని సౌకర్యాలను అన్నిటిని కలిగి ఉండి 30.54 మీటర్లు (100 అడుగుల 1.50 అంగుళాల) పొడవును కలిగి ఉంటుంది.

 

అమెరికన్ డ్రీమ్

100 అడుగుల పొడవైన 'అమెరికన్ డ్రీమ్' కారును రెండు వైపులా నడపడానికి వీలుగా ఉంది. ఇది పెద్ద వాటర్ టబ్, డైవింగ్ బోర్డు, బాత్ టబ్, మినీ-గోల్ఫ్ కోర్స్ మరియు హెలిప్యాడ్ వంటి గొప్ప ఫీచర్లను కలిగి ఉంది. అలాగే ఇందులో చిన్న స్విమింగ్ ఫూల్ తో సహా మరిన్ని లక్సరీ సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇందులో అనేక టీవీలు, రిఫ్రిజిరేటర్ మరియు టెలిఫోన్ వంటి మరిన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయి.

గిన్నిస్ రికార్డు

1986లో గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించుకున్న తర్వాత ఈ కారు గురించి అందరికి త్వరగానే తెలిసింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ యొక్క అధికారిక సైట్ ప్రకారం పొడవైన లిమోసిన్ కొన్ని సినిమాల షూటింగ్ కోసం అద్దెకు తీసుకోబడింది మరియు వివిధ చిత్రాలలో కనిపించింది. ఈ కారు దాని ప్రస్థానంలో బాగా ప్రాచుర్యం పొందింది. కానీ క్రమ క్రమంగా దాని ప్రాముఖ్యతను కోల్పోయింది. వాహనాన్ని ఎక్కువసేపు పార్క్ చేయవలసి రావడం, సినిమాల్లో సాధారణ కారుకు డిమాండ్ లేకపోవడం వంటి అడ్డంకులు చివరికి దాని ప్రతిష్టను దిగజార్చాయి.

ప్రపంచంలో 2021లో అత్యధికంగా అమ్ముడైన ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ మోడల్‌లు ఇవే...ప్రపంచంలో 2021లో అత్యధికంగా అమ్ముడైన ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ మోడల్‌లు ఇవే...

ది అమెరికన్ డ్రీమ్‌ కారు
 

ది అమెరికన్ డ్రీమ్‌ కారుపై ప్రపంచం మొత్తం మీద ఆసక్తిని కోల్పోయిన తర్వాత కారు కొన్నాళ్లపాటు నిరుపయోగంగానే ఉంది. కాలక్రమేణా అది తుప్పు పట్టడం ప్రారంభించింది. తరువాత న్యూ యార్క్‌లోని నాసావు కౌంటీలో మైఖేల్ మన్నింగ్ యాజమాన్యంలోని ఆటోసియం అనే సాంకేతిక బోధనా మ్యూజియం దానిని పునరుద్ధరించడానికి తిరిగి వచ్చింది. 1986లో కాలిఫోర్నియాలోని బర్‌బాంక్‌లో లెజెండరీ కార్ కస్టమైజర్ జే ఓర్‌బెర్గ్ చేత నిర్మించబడిన 'ది అమెరికన్ డ్రీమ్' వాస్తవానికి మొదట 18.28 మీటర్లు (60 అడుగులు) పొడవుతో 26 చక్రాలతో తయారుచేయబడింది. దీని యొక్క ముందు మరియు వెనుక భాగంలో ఒక జత V8 ఇంజిన్‌లను కలిగి ఉంది. ఒబెర్గ్ తరువాత దానిని 30.5 మీటర్లు (100 అడుగులు) వరకు పొడిగించాడు.

మన్నింగ్ మరియు అతని బృందం

మన్నింగ్ మరియు అతని బృందం అమెరికన్ డ్రీమ్ కారును దాని పూర్వ వైభవానికి పునరుద్ధరించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇది న్యూజెర్సీలోని ఒక గిడ్డంగి వెనుక కొన్ని సంవత్సరాలపాటు ఉండిపోయింది. అయితే ఈ కారు 2019లో మళ్లీ eBayలో జాబితా చేయబడే వరకు 7-8 సంవత్సరాలపాటు నిరుపయోగ స్థితిలోనే ఉంది. ఈ సమయంలోనే ఫ్లోరిడాలోని ఓర్లాండోలోని డెగర్‌ల్యాండ్ పార్క్ కార్ మ్యూజియం మరియు టూరిస్ట్ అట్రాక్షన్స్ యజమాని మైఖేల్ డెగర్ దానిని కొనుగోలు చేసి ఫ్లోరిడాలోని ఓర్లాండోకు తరలించారు.

పునరుద్ధరణ

కారు యొక్క మాజీ యజమాని మన్నింగ్ దాని పునరుద్ధరణలో సహాయం చేయడానికి అంగీకరించారు. మూడు సంవత్సరాల పని మరియు ఎక్కువ మొత్తంలో డబ్బును ఖర్చు చేసిన తర్వాత ది అమెరికన్ డ్రీమ్ కారు దాని పూర్వ వైభవాన్ని తిరిగి పొందింది. ఇది ఇప్పుడు మిమ్మల్ని జీవితకాల సవారీకి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది.

Best Mobiles in India

English summary
World's Longest 100ft Car Restored With New Technology to its Former Glory

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X