Home
News

మోస్ట్ డేంజరస్ ల్యాప్‌టాప్,ధర 1 మిల్లియన్ డాలర్లకు పైమాటే

మీరు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ల్యాపీని కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. అందులో వైరస్ లు ఏంటో తెలసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారా.. అయితే మీకోసం ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ల్యాప్‌టాప్‌ ఒకటి ఆన్‌లైన్‌

మీరు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ల్యాపీని కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. అందులో వైరస్ లు ఏంటో తెలసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారా.. అయితే మీకోసం ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ల్యాప్‌టాప్‌ ఒకటి ఆన్‌లైన్‌ వేలంలో భారీ ధర పలుకుతోంది. ఆరు భయంకరమైన వైరస్‌లు ఈ ల్యాప్‌టాప్‌ తిష్టవేశాయి. ఇది 'వరల్డ్స్ మోస్ట్ డేంజరస్’ ల్యాప్‌టాప్‌గా పేరు తెచ్చుకుంది.

మోస్ట్ డేంజరస్ ల్యాప్‌టాప్,ధర 1 మిల్లియన్ డాలర్లకు పైమాటే

అత్యంత ప్రమాదకరమైన, ప్రపంచానికి భారీ నష్టాన్ని మిగిల్చిన ఆరు వైరస్‌లు ఈ ల్యాపీలో వున్నాయి. ఈ వైరస్‌ కారణంగా ప్రపంచంలో సుమారు 100 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లిందట. ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన ల్యాపీని సొంతం చేసుకునేందుకు గట్టి పోటీ నెలకొంది. చాలామంది ఈ ల్యాపీని సొంతం చేసుకునేందుకు ఎగబడుతున్నారు. ఈ న్యూస్ చూసేందుకు తెగ ఆసక్తిగా ఉంది కదూ. అయితే ఆలస్యం చేసేయకుండా చదివేయండి.

ప్రపంచానికి ఎదురవుతున్న ముప్పును

ప్రపంచానికి ఎదురవుతున్న ముప్పును

సెక్యూరిటీ సంస్థ డీప్‌ ఇన్‌స్టింక్ట్‌ ఆధ్వర్యంలోనే గ్వో ఓ డాంగ్ అనే ఇంటర్‌నెట్‌ ఆర్టిస్ట్‌ ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. ఆర్డినరీ 10.2 అంగుళాల శాంసంగ్ NC10-14GB ల్యాప్ టాప్ లో విండోస్ XP (SP3) ఆపరేటింగ్ సిస్టమ్ ను రన్ చేస్తున్నాడు. ఇందులో 6 ప్రాణాంతక వైరస్ లతో లోడ్ చేశాడు. అతి ప్రమాదకరమైన ఆరు వైరస్‌లను లైవ్లీగా ఉంచి మరీ, ఈ డివైస్‌ను వేలానికి వుంచారు. డిజిటల్‌ ప్రపంచానికి ఎదురవుతున్న ముప్పును భౌతికంగా ప్రజలకు తెలియ చెప్పేందుకే ఈ ప్రయత్నమని గ్వో చెప్పారు.

 ఆర్థికంగా ఎంత నష్టాన్ని కలుగజేస్తాయో

ఆర్థికంగా ఎంత నష్టాన్ని కలుగజేస్తాయో

కంప్యూటర్‌లోని భయంకరమైన వైరస్‌లు మనల్ని భౌతికంగా ప్రభావితం చేయలేవని చాలామంది ప్రజలు భావిస్తున్నారు. కానీ అవి ఆర్థికంగా ఎంత నష్టాన్ని కలుగజేస్తాయో గమనించలేక పోతున్నారన్నారు. అందుకే ఆర్థికంగా భారీ నష్టాన్ని కలుగ జేసిన ఈ ఆరు భయంకరమైన వైరస్‌లను ఎంచుకున్నట్టు తెలిపారు.

శాంసంగ్‌ ఎన్‌సీ10

శాంసంగ్‌ ఎన్‌సీ10

విండోస్‌ ఎక్స్‌పీ ఆధారిత శాంసంగ్‌ ఎన్‌సీ10 దీని పేరు.10.2 అంగుళాల 14జీబీ (2008) డివైస్‌ ఇది. వైఫై, ఫ్లాష్‌డ్రైవ్‌కి కనెక్ట్‌ చేయనంత వరకూ దీన్నుంచి మిగతా పీసీలకు ఈ వైరస్‌లకు వ్యాపించకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నామని నిర్వాహకులు చెప్పారు. కంప్యూటర్లలో మాత్రమే వైరస్ ఎఫెక్ట్ అవుతుంది తప్ప ఫిజికల్ గా మనపై ప్రభావితం చూపవని అనుకోవడం అర్థరహితమన్నారు. శక్తివంతమైన వైరస్ కారణంగా పవర్ గ్రిడ్స్ లేదా ప్రజా మౌలిక సదుపాయాలు నేరుగా ముప్పుకు గురయ్యే ప్రమాదం ఉందని డాంగ్ హెచ్చరించారు.

 నెట్ వర్క్ కనెక్ట్ చేసినప్పుడే

నెట్ వర్క్ కనెక్ట్ చేసినప్పుడే

మాల్ వేర్ తో నిండి ఉన్న ఆరు పీసుల బరువు 2.8lbs ఉండగా.. అందులో పవర్ కార్డ్, రిస్టార్ట్ స్ర్కిప్ట్ తో లోడ్ చేశాడు. ఈ ల్యాప్ టాప్ లోని ప్రాణాంతక వైరస్ లు.. మరో సిస్టమ్ కు ఎయిర్ స్పేస్ ద్వారా వ్యాపించవు. మరో నెట్ వర్క్ సిస్టమ్ కు కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే వైరస్ ఎఫెక్ట్ అవుతుందని గ్వివో ఓ డాంగ్ తెలిపారు.

 ఆరు వైరస్‌లు

ఆరు వైరస్‌లు

ఐ లవ్‌యూ, మైడూమ్‌, సోబిగ్‌, వాన్నా క్రై, డార్క్ టెక్విలా బ్లాక్ఎనర్జీ అనే ఆరు వైరస్‌లు ఈ ల్యాప్‌టాప్‌లో దాగి వున్నాయి. 'ది పెర్సిస్టెన్స్ ఆఫ్ ఖోస్' అనే శీర్షికతో, గ్వోఓ ఓ డోంగ్‌ దీన్ని సృష్టించారు. ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తున్న ప్రైవేట్ వేలంలో ఇది ఇప్పటికే 1.2 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.8 కోట్ల, 34 లక్షలు) ధర పలుకుతోంది. అద్భుతమైన ఈ ఆర్ట్‌పీస్‌పై ఆసక్తి వున్నవారు ఎవరైనా ఈ వేలంలో పాల్గొనవచ్చు.

Best Mobiles in India

English summary
A laptop filled with six of the world’s most dangerous viruses is on sale for more than $1 million
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X