Home
News

ప్రపంచంలోనే అత్యంత సన్నని 15 అంగుళాల ల్యాప్‌టాప్‌..!! ఇవాళ్టి నుంచి కొనుగోలు చేయవచ్చు

ఇటీవల జరిగిన ఆపిల్‌ WWDC సమావేశంలో ప్రకటించిన 15 అంగుళాల ఆపిల్‌ మ్యాక్‌బుక్‌ నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. ఆపిల్ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు. మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ శ్రేణిలో 15 అంగుళాల నోట్‌బుక్‌ మొదటిది. ఈ మ్యాక్‌బుక్‌ M2 ప్రోసెసర్‌తో వస్తుంది.

అత్యధికంగా 24GB ర్యామ్‌ మరియు 2TB అంతర్గత స్టోరేజీతో వస్తుంది. ఈ మ్యాక్‌బుక్‌ సిల్వర్‌, స్టార్‌లైట్‌, స్పేస్‌ గ్రే, మిడ్‌నైట్‌ రంగుల్లో అందుబాటులో ఉంది. 15 అంగుళాల మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ బేస్‌ మోడల్ 8GB ర్యామ్‌, 256GB అంతర్గత స్టోరేజీ ధర రూ.1,34,900 గా ఉంది.

15 inch macbook air M2

HDFC బ్యాంకు కార్డులు కలిగిన వినియోగదారులు ఈ మ్యాక్‌బుక్‌ కొనుగోలుపై 8000 రూపాయల ఫ్లాట్‌ డిస్కౌంట్‌ పొందుతారు. ఫలితంగా 1,26,900 రూపాయలకే ఈ మ్యాక్‌బుక్‌ను సొంతం చేసుకోవచ్చు. బేస్‌ మోడల్‌ 14 అంగుళాల మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ 8 కోర్‌ CPU మరియు 8 కోర్‌ GPUతో వస్తుంది.

అదే 15 అంగుళాల ఆపిల్ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌.. బేస్‌ మోడల్‌ 8 కోర్‌ CPU మరియు 10 కోర్ GPU తో వస్తుంది. హై ఎండ్‌ మోడల్‌ 24GB మరియు 2TB అంతర్గత స్టోరేజీ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ధర 2,54,900 రూపాయలుగా ఉంది.

14 అంగుళాల మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M2 ధర తగ్గి ప్రస్తుతం రూ.1,14,900 వద్ద అందుబాటులో ఉంది. మరియు 13 అంగుళాల మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M1 ధర తగ్గి ప్రస్తుతం రూ.99,900 వద్ద ఉంది. 15 అంగుళాల మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ యానిఫైడ్‌ మెమోరీని కలిగి ఉంటుంది. అతిపెద్ద బ్యాటరీని కలిగి ఉంటుంది. 18 గంటల బ్యాటరీ లైఫ్‌ వస్తుంది. ఈ మ్యాక్‌బుక్‌ MagSafe 3 కనెక్టర్‌తో ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్ట్‌ చేస్తుంది.

ఈ మ్యాక్‌బుక్‌ పాసివ్‌ కూలింగ్‌ వ్యవస్థను కలిగి ఉంటుంది. మరియు ఫేస్‌టైం కెమెరా 1080Pకు అప్‌గ్రేడ్‌ చేయబడింది. మరియు మెటర్‌ యూనిబాడీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత సన్నని 15 అంగుళాల డిస్‌ప్లే కలిగిన ల్యాప్‌టాప్‌ ఇదేనని ఆపిల్‌ తెలిపింది.

* ఆపిల్‌ తన వార్షిక సమావేశంలో మిక్సిడ్‌ రియాలిటీ హెడ్‌సెట్‌ "విజన్‌ ప్రో" ను లాంచ్‌ చేసింది. వర్చువల్‌ రియాలిటీ, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ సమ్మేళనంగా ఇది పనిచేస్తుంది. మరియు ఆపిల్‌ M2 చిప్‌ ఆధారంగా పనిచేస్తుంది. ఈ హెడ్‌సెట్‌ను కళ్లద్దాల మాదిరిగానే పెట్టుకోవచ్చు. ఐసైట్‌ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసుకుంటే ఎదుటివారికి మన కళ్లు కూడా కనిపిస్తాయి. ఈ హెడ్‌సెట్‌కు 3D కెమెరా ఉంటుంది. దీంతో వీడియోను రికార్డు చేసుకోవచ్చు.

ఈ హెడ్‌సెట్‌ 2024 ప్రారంభంలో అమెరికా మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. అనంతరం ఇతర మార్కెట్‌లోకి విస్తరించే యోచనలో ఆపిల్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హెడ్‌సెట్‌ విజన్‌ ప్రో ధర 3499 డాలర్లుగా ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే బడ్జెట్‌ ధరలోనూ మరో హెడ్‌సెట్‌ వచ్చే అవకాశం ఉందని పలువులు నిపుణులు భావిస్తున్నారు. అయితే సాధారణ వినియోగదారుల కంటే ఎంటర్‌ప్రైజ్‌ సంస్థల కోసం ఈ హెడ్‌సెట్‌ రూపొందినట్లు అనిపిస్తోంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Apple new 15 inch MacBook air M2 goes on sale
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X