బిల్‌గేట్స్‌ని మెప్పించి, 16 ఏళ్ల వయసులో మరణం

Posted By: Prashanth

బిల్‌గేట్స్‌ని మెప్పించి, 16 ఏళ్ల వయసులో మరణం

 

మైక్రోసాప్ట్ కంపెనీ నుండి 9 సంవత్సరాల వయసులో సర్టిపైడ్ ప్రోఫెషనల్‌ని పొందిన అమ్మాయిగా ప్రపంచ వ్యాప్తంగా రికార్డుని నెలకొల్పింది పాకిస్దాన్‌కు చెందిన 'ఆర్పా కరీం రంద్వా'. అతి చిన్న వయసులోనే ఆర్పా చాలా కష్టమైన సి ప్రోగ్రామ్స్‌ని రాయగలిగేటటువంటి సామర్ద్యాన్ని సొంతం చేసుకోవడంతో, అది గమనించిన ఆర్పా తల్లి దండ్రులు తనని కంప్యూటర్స్ సబ్జెక్టు చదువుకునేందుకు బాగా ప్రోత్సహించారు. ఈ ఫలితంగా, ఆమె ప్రోగ్రామింగ్ అంశాలు లో పెద్ద ఎత్తున నైపుణ్యం సాధించడమే కాకుండా, సులభంగా కార్యక్రమాలు రాయగలుగుతుంది.

అందరి చేత మన్ననలను పొందిన ఆర్పా 16 ఏళ్ల వయసులో ఒక మూర్ఛ సంభవించడం వల్ల గుండె పోటుతో డిసెంబర్ 28న కోమాలోకి వెళ్లడం ఆ తర్వాత లాహోర్ ఆస్పత్రిలో శనివారం మరణించింది. ఆర్పా అకాల మరణంతో, ఒక శూన్య సృష్టించబడింది. ఐతే ఆమె టెక్నాలజీ రంగానికి చేసిన సేవలు కొన్ని దశాబ్దాల వరకు కొనియాడుతూనే ఉంటారు.

2004వ సంవత్సరంలో మైక్రోసాప్ట్ సర్టిఫికేషన్ ఎగ్జామ్‌ని పూర్తి చేసిన ఆర్పా ఆతర్వాత ఆ సంస్ద అధినేత బిల్‌గేట్స్‌ని కూడా కలవడం జరిగింది. ఆర్పా యొక్క టాలెంట్‌ని గుర్తించిన బిల్‌గేట్స్ ఆమెని మైక్రోసాప్ట్ హెడ్ క్వార్టర్స్‌కి రావల్సిందిగా ఆహ్వానాన్ని పంపాడు. ఇది మాత్రమే కాదండోయ్ ఆర్పా తన చిన్న తనం నుండే ఇంటర్నెట్‌ని సాంకేతిక పరంగా ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకుంది. గతయేడాది ఆర్పా నాసా‌కి అనుబంధంగా పనిచేసింది. ఆర్పా వరల్డ్ కంప్యూటర్స్‌లో సాప్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేసి కాలంలో సాప్ట్ వేర్స్‌ని డెవలప్ చేసింది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting