Q2 2022 గ్లోబల్ PC షిప్‌మెంట్ మార్కెట్‌ భారీగా క్షిణించింది!! కారణం ఏమిటో??

|

2022 సంవత్సరం Q2 లో ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ యొక్క PC షిప్‌మెంట్‌లు దారుణంగా పడిపోయాయి. Q2 2013 తరువాత అతిపెద్ద YoY క్షీణతను ఎదుర్కొన్నట్లు కౌంటర్‌పాయింట్ నివేదిక సూచిస్తోంది. ఈ త్రైమాసికంలో PC షిప్‌మెంట్లు మరింత దారుణంగా 11.1 శాతం పడిపోయి 71.2 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి. ఈ క్షీణతకు చైనాలోని షాంఘై మరియు కున్‌షాన్‌లలో లాక్‌డౌన్‌లు ఎక్కువగా కారణమని చెప్పవచ్చు. గ్లోబల్ PC షిప్‌మెంట్ మార్కెట్‌లో లెనోవో 24.4 శాతం షేర్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ త్రైమాసికంలో HP బ్రాండ్ యొక్క షిప్‌మెంట్‌లలో 27 శాతం YY పతనంతో ఎక్కువగా ప్రభావితమైనట్లు నివేదించబడింది.

 

గ్లోబల్ PC షిప్‌మెంట్‌

Q2 2022లో గ్లోబల్ PC షిప్‌మెంట్‌లలో 11.1 శాతం క్షీణత నమోదైందని ఇటీవలి కౌంటర్‌పాయింట్ పరిశోధన సంస్థ నివేదించింది. ముందుగా చెప్పినట్లు ఈ సంవత్సరం PC షిప్‌మెంట్‌లు 71.2 మిలియన్ యూనిట్‌లకు చేరుకున్నాయి. Q2 2013 తర్వాత ఇది అతిపెద్ద YYY క్షీణతగా నివేదించబడింది.

ODMలు

చైనాలోని షాంఘై మరియు కున్‌షాన్‌లలో లాక్‌డౌన్ క్షీణతకు కారణమని పరిశోధనా సంస్థ పేర్కొంది. ఈ రెండు నగరాల్లోని లాక్‌డౌన్ PC సరఫరా గొలుసును తాకింది మరియు కంపాల్, విస్ట్రాన్ మరియు క్వాంటాతో సహా ప్రైమరీ ల్యాప్‌టాప్ ఒరిజినల్ డిజైన్ తయారీదారులు (ODMలు) కూడా తయారీలో అంతరాయాలను ఎదుర్కొన్నారు. ప్రపంచ ద్రవ్యోల్బణం మరియు ప్రాంతీయ సంఘర్షణలు డిమాండ్ తగ్గడానికి కారణాలుగా పేర్కొనబడ్డాయి. ప్రధానంగా క్రోమ్ బుక్ డిమాండ్ కరెక్షన్ కారణంగా క్యూ2 2022లో US మరియు EU రెండంకెల క్షీణతను చవిచూశాయి.

లెనోవా
 

లెనోవా కంపెనీ మొత్తం మార్కెట్లో 24.4 శాతం వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఈ చైనా కంపెనీ యొక్క మొత్తం షిప్‌మెంట్ ఇప్పుడు 12.7 శాతం తగ్గి 17.4 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. అలాగే HP కంపెనీ యొక్క షిప్‌మెంట్‌లలో 27 శాతం క్షీణతతో ఎన్నడూ లేని విధంగా అధిక మొత్తంలో క్షీణతను ఎదుర్కొంది. అలాగే డెల్ కంపెనీ దాని YoY షిప్‌మెంట్ పనితీరుకు అతి చిన్న సర్దుబాటును కలిగి ఉన్నట్లు నివేదించబడింది.

క్రోమ్‌బుక్‌తో

ఏసర్ వంటి బ్రాండ్లు కూడా ఈ సంవత్సరం 14.8 శాతం క్షీణతను ఎదుర్కొన్నాయి. క్రోమ్‌బుక్‌తో ఉన్న సమస్య కారణంగా ఏసర్ బ్రాండ్ యొక్క వృద్ధి వేగాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పబడింది. అయినప్పటికీ అతిపెద్ద PC షిప్‌మెంట్ మార్కెట్ వాటాను కలిగిన బ్రాండ్‌లలో నాల్గవ స్థానాన్ని కొనసాగించడంలో కంపెనీ విజయం సాధించింది. అమెరికన్ టెక్ కంపెనీ యాపిల్ సంస్థ కూడా ఈ సారి 20 శాతం పతనాన్ని ఎదుర్కొంది. యాపిల్ షిప్‌మెంట్లు క్షీణించడానికి ముఖ్య కారణం చైనాలోని క్వాంటా తయారీ లైన్లలో సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడడం అని కొంత మంది పేర్కొన్నారు. అంతేకాకుండా వినియోగదారులు M2 చిప్‌లతో కూడిన కొత్త మ్యాక్‌బుక్ సిరీస్‌లను కొనుగోలు చేయడానికి అధికంగా ఆసక్తిని చూపుతున్నారు. ఇది భవిష్యత్తులో ఆపిల్ బ్రాండ్ మార్కెట్ వాటాను పెంచడానికి దారితీయవచ్చు. అసూస్ యొక్క PC షిప్‌మెంట్‌లు కూడా ఈ సారి 7.7 శాతానికి తగ్గాయి. క్యూ2 2022లో ఆపిల్ మరియు అసూస్ బ్రాండ్లు రెండూ కూడా ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి.

లాక్‌డౌన్

కరోనా రాకతో లాక్‌డౌన్ మొదలయిన తరువాత చాలా కాలం అన్ని రకాల సంస్థలు మూతపడ్డాయి. అంతేకాకుండా అన్ని సంస్థలు తమ యొక్క ఉద్యోగులను ఇంటి వద్ద ఉండి పనిచేయవలసిందిగా ఆంక్షలను విధించింది. ఆఫీసులకు వెళ్లే వారు ఆఫీసులోని PC ల ద్వారా తమ యొక్క పనిని చేసే వారు. కానీ లాక్‌డౌన్ రావడంతో అన్ని రకాల సంస్థలు తమ యొక్క ఉద్యోగులకు లాప్ టాప్ లను అందించడం ప్రారంభించాయి. పైగా ట్యాబ్ వంటివి కొత్త కొత్త అప్ డేట్ లతో అందుబాటులోకి రావడంతో ప్రతి ఒక్కరు కూడా వాటిని కొనుగోలు చేయడం మీద దృష్టి పెడుతున్నారు. మరొక కారణం వాటి యొక్క తయారీకి కావలసిన ముడిసరుకు కొరత. ఇదే ప్రధాన సమస్య కావడంతో PC షిప్‌మెంట్‌లు భారీగా క్షిణించాయి.

Best Mobiles in India

English summary
Worldwide PC Shipment of Q2 2022 Sees Largest Decline Since 2013: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X