పూనమ్‌తో డేట్ చేసే లక్కీ 'లక్ష' ఫాలోవర్ ఎవరూ..?

Posted By: Staff

పూనమ్‌తో డేట్ చేసే లక్కీ 'లక్ష' ఫాలోవర్ ఎవరూ..?

 

న్యూఢిల్లీ: మోడల్, ట్విట్టర్ సెలబ్రిటీ పూనమ్ పాండే మళ్లీ మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈ సారి పూనమ్ పాండే తన ట్విట్టర్ అభిమానులకు మంచి ఆఫర్‌ని ప్రకటించారు. ఇంటర్నెట్లో ఎక్కువ మంది సెర్చింగ్ చేసే మోడల్‌గా గుర్తింపు తెచ్చుకున్న పూనమ్ పాండే తన మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో లక్ష ఫాలోవర్స్‌కి సమీపిస్తుండడంతో తనని ఫాలో అయ్యే లక్ష ఫాలోవర్‌కి డిన్నర్ డేట్ ఇస్తానని ట్విట్టర్‌లో ప్రామిస్ చేసింది. దీంతో పూనమ్ పాండే ట్విట్టర్ ఎకౌంట్‌ని ఫాలో అయ్యేవారి సంఖ్య అమాంతం పెరిగారు.

తన ట్విట్టర్ ఎకౌంట్లో పూనమ్ పాండే ఈ క్రింది విధంగా ట్వీట్ చేశారు...

“Joined Twitter 1 Feb 2011..and Reaching to 1,00,000 Followers Thanx a Million Tweethearts.. Now the One Lucky Follower #DateWithPoonamPandey(sic)”

దీనితో పాటు పూనమ్ నేను లక్ష ఫాలోవర్స్‌ని చేరే లోపు.. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కూడా తన వందో సెంచరీని సాధిస్తాడని తన నమ్మకాన్ని వ్యక్తం చేసింది. అతనికి ఇవే నా శుభాకాంక్షలు :). పూనమ్ ఇలా ట్వీట్ చేయడంతో అందరి మదిలో ఇప్పుడు ఓ పెద్ద ప్రశ్న ఏమిటంటే పూనమ్ ముందు తన లక్ష ఫాలోవర్స్‌ని సొంతం చేసుకుంటుందా.. లేక సచిన్ వందో సెంచరీని సాధిస్తాడా..అని అలోచిస్తున్నారు.

గతంలో పూనమ్‌ని ఫాలో అవుతున్న ఆమె అనుచరులు మాత్రం బాధ పడుతున్నారు. అంతేకాదండోయ్ అమెను అన్ ఫాలో అయి మళ్లీ ఫాలో కావాలని కొంత మంది యోచించడం విశేషం. టీమిండియా ప్రపంచ కప్ గెలిస్తే పూనమ్ పాండే టీమిండియా జట్టుకి నగ్న ప్రదర్శన ఇస్తానని మాట ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting