వాళ్లకి ఆ ఛాన్స్!!

Posted By: Staff

వాళ్లకి ఆ ఛాన్స్!!

 

లూమియా 710, 800 హ్యాండ్‌సెట్‌ల విడుదల తరువాత నోకియా, లూమియా 610, 900 వేరియంట్‌లలో రెండు స్మార్ట్‌ఫోన్‌లను ప్రకటించింది. వీటిలో ఒకటైన లూమియా 610 వచ్చే నెలలో లాంఛ్ కాబోతుంది. అత్యాధునిక ఇంటర్నెట్ షేరింగ్ వ్యవస్థను ఈ స్మార్ట్‌ఫోన్ సపోర్ట్ చేస్తుంది. మునుపటి లూమియా ఫోన్‌లలో ఈ సరికొత్త ఫీచర్ సపోర్ట్ చెయ్యదు. ఈ అప్లికేషన్‌ను సపోర్ట్ చెయ్యని హ్యాండ్‌సెట్లలో విండోస్ ఫోన్ 7.5 రిఫ్రెష్ ఆపరేటింగ్ సిస్టంను అపడేట్ చేస్తే సరిపోతుందని నోకియా వర్గాలు వెల్లడించాయి.

మైక్రోసాఫ్ట్ ఈ కొత్త విండోస్ రీఫ్రెష్ అప్‌డేట్‌ను జూన్ నాటికి అందుబాటులోకి తేనుంది. ఈ వోఎస్‌ను ప్రత్యేకించి స్లో ప్రాసెసర్ ఫోన్ల కోసం డిజైన్ చేశారు. మ్యాంగో ఆపరేటింగ్ సిస్టంలోని పలు ఫీచర్లను హార్డువేరు పరిమితులు కారణంగా విండోస్ రిఫ్రెష్ సపోర్ట్ చెయ్యదు. అయినప్పటికి, అనుభూతులు మాత్రం సమాంతరంగా ఉంటాయి. నోకియా వెల్లడించిన తాజా ప్రకటనతో లూమియా 710,810 యూజర్లు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot