ఉత్కంఠ రేపుతున్న బ్యానర్ ‘ఇష్యూ’?

Posted By: Super

 ఉత్కంఠ రేపుతున్న బ్యానర్ ‘ఇష్యూ’?

 

శాన్‌ఫ్రాన్సిస్కోలో ప్రతిష్తాత్మకంగా ప్రారంభమైన ‘ద వరల్డ్ వైడ్ డవెలపర్స్ కాన్ఫిరెన్స్’ (డబ్ల్యూడబ్ల్యూడీసీ) 2012 కన్నులపండువుగా సాగుతోంది. అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ కార్యక్రమంలో ఆపిల్ తన సరికొత్త ఆపరేటింగ్ సిస్టం ఐవోఎస్ 6.0ను ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఆవిష్కరణకు సంబంధించి ఆపిల్, వేదిక ప్రాంగంణంలో బ్యానర్లను ఏర్పాటు చెయ్యటం చర్చనీయాంశంగా మారింది.

తమ ఉత్పత్తుల ఆవిష్కరణలు అదేవిధంగా ప్రకటనలకు సంబంధించి ఆది నుంచి గోప్యత వహించే ఆపిల్ ఈ తడువ కొత్త పంధాను అనుసరించటం సర్వత్రా ఉత్కంఠరేపుతోంది. జూన్ 2010లో నిర్వహించిన డబ్ల్యూడబ్ల్యూడీసీ సదస్సులో ఆపిల్ ‘ఐవోస్4’ను ఆవిష్కరించింది. 2011 జూన్‌లో నిర్వహించిన మరో దఫా సదస్సులో ‘ఐవోస్5’ను విడుదల చేసింది. ఈ ఏడాది నిర్వహిస్తున్న సదస్సులో ‘ఐవోస్6’ను పరిచయం చెయ్యబోతోంది.

ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టం వెలుగులోకి రావటంతో అనేకమైన అదనపు ఫీచర్లు ఆపిల్ డివైజ్‌లకు చేకూరుతాయి. ముఖ్యంగా ‘3డి మ్యాప్స్’ ఫీచర్ ఆపిల్ యూజర్లను మరింత అబ్బురపరుస్తుంది. మెమెరీ శాతం తక్కువుగా ఉన్న మొదటి జనరేషన్ ఐప్యాడ్ ఇంకా మూడవ జనరేషన్ ఐపోడ్ టచ్‌లను ఐవోఎస్ 6.0 సపోర్ట్ చెయ్యదు. ఇందుకు కారణం వాటిలో మెమెరీ శాతం తక్కువుగా ఉండటమే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot