X (ట్విట్టర్) వాడాలంటే డబ్బులు చెల్లించాల్సిందే..! 3 రకాలుగా ప్రీమియం ఫ్లాన్లు..!
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం X (ట్విట్టర్)లో త్వరలో కీలక మార్పులు రానున్నట్లు తెలుస్తోంది. ట్విట్టర్ వినియోగదారులందరూ కనీస నెలవారీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. గత నెలలోనే మస్క్ ఈ విధానంపై ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విధానంపై అమలుచేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు, టెస్టింగ్ చేస్తున్నట్లు X సీఈవో లిండా ధ్రువీకరించారు.
మూడురకాల ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ మోడల్‌లను పరీశీలిస్తున్నట్లు X సీఈవో వెల్లడించారు. ప్లాట్‌ఫాంలో వచ్చే యాడ్‌ల ఆధారంగా చెల్లింపులు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ప్రతి ఒక్కరూ కనీస చెల్లింపులు చేయాల్సి ఉంటుందని సమాచారం. X ప్లాట్‌ఫాంను అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై బ్యాంకర్లకు ఇచ్చిన సమాచారంలో ఈ వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది. మూడు అంచెల ప్రీమియం సర్వీసులను పరీక్షిస్తున్నట్లు పేర్కొంది.

X లేదా ట్విట్టర్ ప్రీమియం ప్లాన్లు బేసిక్, స్టాండర్డ్, ప్లస్‌లుగా విభజించారు. బేసిక్ యూజర్లు పుల్ యాడ్స్‌ను చూడాల్సి ఉంటుంది. అదే స్టాండర్డ్ యాజర్లకు సగం యాడ్స్ మాత్రమే కనిపిస్తాయి. అదే ప్లస్ యూజర్లకు ఎటువంటి యాడ్స్ కనిపించవని తెలుస్తోంది. అయితే ఈ విధానం ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో వెల్లడించలేదు.
గత నెలలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుజో జరిగిన సంభాషణ సందర్భంగా ఎలాన్ మస్క్ ఈ విధానం గురించి చర్చించారు. ఈ విధానంతో నకిలీ ఖాతాలకు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే కనీస ఛార్జి ఎంత ఉంటుందనే అంశంపై స్పష్టత రాలేదు.
నెతన్యాహుతో గతంలో జరిగిన సంభాషణలో ఈ ప్రీమియం విధానం గురించి చర్చకు వచ్చింది. ప్రస్తుతం ప్రతినెలా 550 మిలియన్ల మంది Xను వినియోగిస్తున్నారు. ఇందులో ప్రతిరోజూ 100 నుంచి 200 మిలియన్ల మంది పోస్టులు చేస్తున్నట్లు మస్క్ వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎన్ని నకిలీ ఖాతాలు ఉన్నాయో వెల్లడించలేదు.
ఎలాన్‌మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక కీలక స్థానాల్లోని వారిని తొలగించారు. దాంతోపాటు వేలాది మంది ఉద్యోగులను తొలగించారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక.. ఒకరకంగా దానిపై ఎలాన్ మస్క్ ప్రయోగాలు చేశారు. ప్రముఖుల అకౌంట్లకు ఉన్న బ్లూటిక్‌ను తొలగించారు. అనంతరం మళ్లీ పునరుద్ధరించారు. దాంతోపాటు బ్లూటిక్ కోసం ప్రత్యేక ప్లాన్‌లను తీసుకొచ్చాడు. తాజాగా కొన్నిరోజుల క్రితం ట్వీట్లకు పరిమితిని విధించాడు. దీనిపై నెటిజన్ల నుంచి భారీ అసంతృప్తి వ్యక్తం అయింది.
వెరిఫైడ్ ఖాతాల కలిగిన వ్యక్తులు రోజుకు పదివేల ట్వీట్లు, వెరిఫైడ్ ఖాతా లేకున్నా చాలా కాలం నుంచి ట్వీట్టర్ అకౌంట్ కలిగి వ్యక్తులు రోజుకు వెయ్యి ట్వీట్లు, కొత్తగా అకౌంట్ తెరిచి వెరిఫైడ్ అకౌంట్ లేకుంటే కేవలం 500 ట్వీట్లు మాత్రమే చూడగలిగేలా మార్పులు చేశారు.
దాంతోపాటు ట్విట్టర్ సంస్థను ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఎక్స్ కార్ప్‌లో విలీనం చేశారు. అనంతరం 2012 నుంచి ఉన్న ట్విట్టర్ లోగోను తొలగించి, దాని స్థానంలో Xను ఏర్పాటుచేశారు. పూర్తిగా రీబ్రాండ్ వెర్షన్‌గా మార్చేందుకు కీలక ప్రయత్నాలు చేస్తున్నారు. ట్విట్టర్ (X)ను ఎవ్రీథింగ్ యాప్‌గా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు X సీఈవో లిండా గతంలోనే వెల్లడించారు. ఈ విధంగానే తమ లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications








