Home
News

X (ట్విట్టర్‌) లో అదిరిపోయే ఫీచర్‌... డైరెక్ట్‌ మెసేజ్‌, కాల్స్‌, వీడియో కాల్స్, ఫైల్‌ షేరింగ్‌ సహా...!

ప్రముఖ మైక్రో బ్లాకింగ్‌ ప్లాట్‌ఫాం X (గతంలో ట్విట్టర్‌) ను ఎవ్రీథింగ్‌ యాప్‌ గా మార్పులు చేస్తామని ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ఇది వరకే ప్రకటన చేశారు. ఇందుకు అనుగుణంగా అనేక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయితే తాజాగా X యాప్‌లో చాట్‌ (Chat) ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫాంల మాదిరిగానే ఈ ఫీచర్‌ కూడా పనిచేస్తుందని తెలుస్తోంది.

చాట్‌ ఫీచర్‌ను తీసుకొచ్చిన X యాప్ :
X లో తాజాగా పరిచయం చేసిన చాట్ ఫీచర్‌ ద్వారా నేరుగా మెసేజ్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ మెసేజ్‌ లను ఎడిట్‌, డిలీట్‌ కూడా చేసుకోవచ్చు. ఆటోమేటిక్‌ గా డిలీట్‌ అయ్యే ఆప్షన్‌ ( Disappearing Messages ) కూడా ఉంది. ఫలితంగా ప్రైవసీ, భద్రతకు ప్రాధాన్యత ఇచ్చినట్లు అయింది.

X app launches Chat Feature

అనేక భద్రతా ఫీచర్లు :
దీంతోపాటు ఈ ఫీచర్‌లో వాయిస్‌, వీడియో కాల్స్ చేసేందుకు కూడా అవకాశం ఉంది. ఈ చాట్‌ ఆప్షన్‌ ద్వారా ఫైల్స్‌ ను కూడా ఇతరులతో సులభంగా షేర్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో మరిన్ని ముఖ్యమైన ప్రైవసీ, భద్రతాపరమైన ఫీచర్లను కూడా జత చేసింది. ట్రాకింగ్‌ తోపాటు యాడ్స్‌ కూడా ఉండవని తెలిపింది.

స్క్రీన్‌ షాట్‌ తీయలేరు, తీసినా తెలిసిపోతుంది :
ఈ చాట్‌ ఫీచర్‌ పూర్తిగా ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ను (E2E) కలిగి ఉంటుందని X తెలిపింది. దీంతోపాటు స్క్రీన్‌ షాట్‌ తీసేందుకు అవకాశం ఉండదని, స్క్రీన్‌ షాట్‌ తీసేందుకు ప్రయత్నం చేస్తే, అవతలి వ్యక్తికి సమాచారం చేరే విధంగా ఫీచర్‌ పనిచేస్తుందని తెలిపింది. ఈ స్క్రీన్‌షాట్ బ్లాకింగ్‌ ఫీచర్‌ ఆకట్టుకొనే అవకాశం ఉంది.

X app launches Chat Feature

ప్రస్తుతం ఈ యూజర్లకు అందుబాటులో ఉంది :
X లో ప్రస్తుతం చాట్‌ ఫీచర్‌ iOS తోపాటు వెబ్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. బీటా వెర్షన్‌ లో ఉంది. అయితే ఆండ్రాయిడ్ యూజర్లకు త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతోంది. అయితే కచ్చితంగా ఎప్పటి నుంచి లాంచ్‌ కానుందో వెల్లడి కాలేదు.

త్వరలో వాయిస్‌ మెమో ఆప్షన్ :
ఈ చాట్‌ ఫీచర్‌ లో వాయిస్‌ మెమో ఆప్షన్‌ ( Voice Memo ) కూడా త్వరలో విడుదల కానుందని తెలుస్తోంది. ఈ ఆప్షన్‌ ద్వారా ఆడియో మెసేజ్‌లు చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. X ప్లాట్‌ఫాంలో ఇది వరకు వచ్చిన అన్ని ఫీచర్లతో పోలిస్తే చాట్‌ ఫీచర్‌ యూజర్లను ఆకట్టుకొనే అవకాశం ఉంది.

యాడ్స్‌ ఉండవు, ట్రాకింగ్ కూడా :
ఈ చాట్ ఫీచర్‌ లో ఎటువంటి యాడ్స్‌ ఉండవని X ప్లాట్‌ఫాం తెలిపింది. దీంతోపాటు ఎటువంటి ట్రాకింగ్‌ సమస్యలు కూడా ఉండవని చెబుతోంది. ఇతరులకు పంపిన మెసేజ్‌ లను సులభంగా ఎడిట్‌ చేసుకోవచ్చు. అయితే ఎంత సమయం వరకు ఎడిట్‌ ఆప్షన్‌ ఉంటుందో తెలియాల్సి ఉంది. డిలీట్‌ కూడా చేసుకోవచ్చు. దీంతోపాటు ఆటోమేటిక్‌ గా మెసేజ్‌ లు డిలీట్‌ అయ్యే ఆప్షన్ వంటి మంచి ఆప్షన్‌లు ఉన్నాయి.

Best Mobiles in India

English summary
X launches Chat Feature with direct message, voice and video calling and file sharing Options
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X