X అవుటేజ్ సైబర్ ఎటాకా.. మస్క్ మాటల్లో నిజమెంత?
X Outage: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X సోమవారం భారీ అంతరాయాలను ఎదుర్కొంది. లక్షలాది మంది యూజర్లు ఇబ్బంది పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆన్‌లైన్ వర్క్స్ ఆగిపోయాయి. ఈ అంతరాయానికి కారణం చాలా శక్తివంతమైన సైబర్ ఎటాక్ అని ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ ఆరోపించారు. మస్క్ వాదనలపై సైబర్ సెక్యూరిటీ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. చివరికి ఈ వ్యవహారం ఎటు వెళ్లిందో తెలుసుకుందాం.
* మస్క్ వాదన.. బాగా ప్లాన్ చేసిన ఎటాక్
ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై రోజూ సైబర్ దాడులు జరుగుతాయని ఇది కొత్తేం కాదు కానీ, ఈసారి మాత్రం చాలా తేడాగా ఉందని మస్క్ అంటున్నారు. దీని వెనుక పెద్ద గ్రూప్ అయినా ఉండాలి, లేదా చాలా డబ్బున్న వాళ్లయినా, లేకపోతే ఏకంగా ఏదైనా దేశమే అయినా ఉండొచ్చు అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

అయితే 'చాలా డబ్బులు' అంటే ఏమిటో మాత్రం మస్క్ చెప్పలేదు. దీంతో ఆయన మాటలపై చాలా మంది డౌట్లు పడుతున్నారు. ఆయన చెప్పిన దాన్ని చాలామంది అనుమానించారు. ఎందుకంటే ఇలాంటి ఎటాక్‌లు అంటే DoS ఎటాక్‌లను చిన్న గ్రూపులు లేదా వ్యక్తులు కూడా చేయగలరని నిపుణులు అంటున్నారు.
* అవుటేజ్ ఎంతవరకు ఉంది..
డౌన్‌డిటెక్టర్ ప్రకారం, ఎక్స్‌కి ఉదయం 10 గంటలకు (ET) అత్యంత దారుణమైన అంతరాయం ఏర్పడింది. అప్పుడు అమెరికాలో 39,021 మంది యూజర్లు ప్లాట్‌ఫామ్‌ను యాక్సెస్ చేయలేకపోయారు. సాయంత్రం 5 గంటలకి, సమస్యలు ఉన్నాయని రిపోర్ట్ చేసిన యూజర్లు 1,500 మంది మాత్రమే.
ఇండస్ట్రీకి చెందిన ఒక ఇన్సైడర్ చెప్పిన ప్రకారం, ఎక్స్ 9:45 UTC నుంచి చాలాసార్లు DoS ఎటాక్‌లను ఎదుర్కొంది. పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ వ్యక్తి, ఎటాక్‌లో X సర్వర్లకు తప్పుడు ట్రాఫిక్‌ను పంపి వాటిని ముంచెత్తారని, దీని ద్వారా వెబ్‌సైట్‌ను సింపుల్‌గా డిస్టర్బ్ చేయొచ్చని చెప్పారు.
* ఎటాక్ ఎక్కడి నుంచి వచ్చిందో గొడవ
తర్వాత ఫాక్స్ బిజినెస్ నెట్‌వర్క్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఉక్రెయిన్‌కు సంబంధించిన IP అడ్రస్‌ల నుంచి ఎటాక్ వచ్చిందని మస్క్ అన్నారు. కానీ ఇండస్ట్రీ ఇన్సైడర్ మాత్రం ఆయన వాదనను ఖండించారు. అతని ప్రకారం, తప్పుడు ట్రాఫిక్ ఎక్కువగా అమెరికా, వియత్నాం, బ్రెజిల్, ఇంకా కొన్ని దేశాల నుంచి వచ్చింది.
ఉక్రెయిన్ నుంచి వచ్చిన ట్రాఫిక్ చాలా తక్కువ అని సదరు చెప్పారు. DoS ఎటాక్ ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కోవడం చాలా కష్టం. ఎందుకంటే ఎటాక్ చేసేవాళ్లు ఫేక్ లేదా హైజాక్ చేసిన IP అడ్రస్‌లను వాడతారు అని నిపుణులు కూడా చెప్పారు. దీంతో మస్క్ వాదనలలో అసలు నిజమే లేదని తెలుస్తోంది.
* ఉక్రెయిన్‌పై మస్క్ వైఖరి
ఉక్రెయిన్ యుద్ధ ప్రయత్నాలను మస్క్ విమర్శించడం వల్ల ఆయన కామెంట్స్ మరింత వివాదాస్పదమయ్యాయి. స్టార్‌లింక్ లేకపోతే ఉక్రెయిన్ ఫ్రంట్ లైన్ కూలిపోతుందని మస్క్ చాలాసార్లు చెప్పారు. అయినా సరే, ఉక్రెయిన్‌కు స్టార్‌లింక్ యాక్సెస్ ఆపను అని అన్నారు. ఈ మాటలు ఆయన రాజకీయ పలుకుబడి, మస్క్ స్టేట్‌మెంట్‌ల వెనుక ఉన్న కారణాల గురించి చాలా మందిలో అనుమానాలు కలిగించాయి.


Click it and Unblock the Notifications








