షియోమి నుంచి 108 ఎంపీ కెమెరాతో స్మార్ట్‌ఫోన్ !

By Gizbot Bureau
|

నేడు మార్కెట్లో దిగ్గజ కంపెనీల మధ్య స్మార్ట్‌ఫోన్ వార్ నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కెమెరా విభాగంలో దిగ్గజ మొబైల్ కంపెనీలన్నీ ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు అత్యధిక ఫిక్సల్ తో కెమెరాలను విడుదల చేశాయి. ఇక షియోమి 48 ఎంపీ కెమెరాతో మార్కెట్‌లో ఇప్పటికే ట్రెండ్ సెట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

xiaomi 100 megapixel camera smartphone coming soon

ఇప్పుడు అదే ఊపులో కంపెనీ 100 లేక 108 ఎంపీతో స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి తీసుకురాబోతోంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ట్విట్టర్లో విడుదలయ్యాయి. షియోమి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్, షియోమి ఇండియా చీఫ్ మను కుమార్ జైన్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

100 ఎంపీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌

100 ఎంపీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌

ఇప్పటి వరకు స్మార్ట్‌ఫోన్లలో 48 మెగాపిక్సెల్‌ కెమెరాను చూడగా, త్వరలో 64 ఎంపీ కెమెరాతో శాంసంగ్, షియోమీతోపాటు రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లు విడుదల కానున్నాయి. ఈ న్యూస్ సంచలనం అయ్యే లోపే షియోమి కంపెనీ 100 ఎంపీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌కు చుట్టింది. శాంసంగ్‌ సెన్సార్‌తో ఇది రూపుదిద్దుకోనుందని సమాచారం. ఈ ఫోన్లో 108,000,000 పిక్సెల్స్, 12032x9024 రిజల్యూషన్‌ ఉండనుంది. అల్ట్రా క్లియర్‌ కెమెరా ఆవిష్కరించనున్నట్టు షియోమీ ఇండియా హెడ్‌ మను కుమార్‌ జైన్‌ వెల్లడించారు.

 100 ఎంపీ సెన్సర్

100 ఎంపీ సెన్సర్

మను కుమార్ జైన్ 100 ఎంపీ స్మార్ట్‌ఫోన్ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఈ ట్వీట్ తెగ వైరల్ అయ్యింది. ఇకపోతే 100 ఎంపీ కెమెరా సెన్సర్‌పై ఇప్పటికే పరిశోధనలు ప్రారంభమయ్యాయి. క్వాల్‌కామ్ కంపెనీ ఈ ఏడాది చివరకు 100 ఎంపీ సెన్సర్ అందుబాటులోకి తీసుకురావొచ్చనే అంచనాలున్నాయి.

108 ఎంపీతో షియోమి ఫోన్ వస్తుందా ?
 

108 ఎంపీతో షియోమి ఫోన్ వస్తుందా ?

షియోమి 100 ఎంపీ కెమెరాతో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తే ప్రపంచంలో తొలి 100 ఎంపీ కెమెరా ఫోన్ ఇదే కానుంది.కాగా 100 ఎంపీ కెమెరా మోడల్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు ఈ ఏడాది మార్చిలో లెనొవో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే 100కు బదులుగా 108 ఎంపీతో షియోమీ తన ఫోన్‌ ను తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

షియోమి స్మార్ట్‌టీవీల్లో జియో సినిమా

షియోమి స్మార్ట్‌టీవీల్లో జియో సినిమా

ఇదిలా ఉంటే చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ షియోమి టెలికం సంచలనం రిలయన్స్ జియోతో జతకట్టింది. తద్వారా షియోమి స్మార్ట్‌టీవీల్లో జియో సినిమా యాప్ అందుబాటులోకి రానుంది. షియోమి ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. షియోమి 2018 నుంచి భారత్ మార్కెట్‌లో స్మార్ట్ టీవీలను విక్రయిస్తూ వస్తోంది. ఇక జియో సినిమా అనేది రిలయన్స్ జియో నుంచి అందుబాటులోకి వచ్చిన వీడియో స్ట్రీమింగ్ సర్వీస్. ఎంఐ టీవీల్లో త్వరలోనే ఈ పాపులర్ ఓటీటీ యాప్ రిలయన్స్ జియో సినిమా రానుంది.

 టీసీఎల్ టీవీల్లోనూ అందుబాటులోకి

టీసీఎల్ టీవీల్లోనూ అందుబాటులోకి

రిలయన్స్ జియో సినిమా యాప్‌లో టీవీ షోలు, జియో ఎక్స్‌‌క్లూజివ్స్, సినిమాలు, డాక్యుమెంటరీస్, ట్రైలర్స్ వంటి వాటిని చూడొచ్చు. ఈ యాప్ మొబైల్‌తోపాటు వెబ్ ప్లాట్‌ఫామ్స్‌పై కూడా అందుబాటులో ఉంది. కేవలం ఎంఐ టీవీల్లో మాత్రమే కాకుండా రిలయన్స్ జియో సినిమా యాప్ టీసీఎల్ టీవీల్లోనూ అందుబాటులోకి రానుంది. టీసీఎల్ కంపెనీ కూడా జియోతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నట్లు ప్రకటించింది. .

Best Mobiles in India

English summary
xiaomi 100 megapixel camera smartphone coming soon

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X