Xiaomi 11 Lite NE 5G ఇండియా ధరలు లీక్ అయ్యాయి!! వివరాలు ఇవిగో..

|

షియోమి స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ భారతదేశంలో సెప్టెంబర్ 25 న Xiaomi 11 లైట్ NE 5G ను లాంచ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే దీని యొక్క ధరలు మరియు కలర్ ఎంపికలు సెప్టెంబర్ 25 న దేశంలో లాంచ్ కావడానికి ముందే లీక్ అయ్యాయి. ఈ ఫోన్ కొన్ని రోజుల క్రితం ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించబడింది మరియు కంపెనీ త్వరలో భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు టీజ్ చేసింది. భారతదేశంలో Xiaomi 11 Lite NE 5G ధరల సమాచారం ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీక్ చేయబడింది. ర్యామ్ + స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లతో పాటుగా ఇది భారతీయ మార్కెట్ కోసం రావచ్చు. ఫోన్ మొదట మూడు కలర్ ఆప్షన్లలో రావచ్చు మరియు ఒక అదనపు కలర్ ఆప్షన్ తరువాత తేదీలలో లాంచ్ కానున్నట్లు కూడా లీక్ నిర్ధారిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Xiaomi 11 Lite NE 5G ఇండియా లీక్ ధరలు

Xiaomi 11 Lite NE 5G ఇండియా లీక్ ధరలు

భారతీయ మార్కెట్ లో కొత్తగా రాబోయే షియోమి 11 లైట్ NE 5G యొక్క 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.21,999 ధర వద్ద లాంచ్ చేయనున్నట్లు లీక్ అయింది. అలాగే ఇది 8GB RAM + 128GB స్టోరేజ్ మరియు 8GB RAM + 256GB స్టోరేజ్ ఆప్షన్‌లతో మూడు కాన్ఫిగరేషన్‌లలో రావచ్చని టిప్‌స్టర్ @Gadgetsdata లీక్ చేసింది. అలాగే ఇది వైట్, పింక్, బ్లూ మరియు బ్లాక్ వంటి చైనా వెర్షన్‌ల మాదిరిగానే భారతదేశంలో కూడా నాలుగు కలర్ ఆప్షన్‌లలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. అయితే టిప్‌స్టర్ మూడు కలర్ ఆప్షన్‌లలో మొదట లాంచ్ చేయబడతాయని మరియు చివరి కలర్ కొన్ని రోజుల తరువాత ఇండియాలో లాంచ్ అవుతుందని తెలిపింది.

<strong>ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ రివార్డ్స్ 123 ప్లస్ అకౌంటుతో ప్రయోజనాలు ఎన్నో తెలుసా??</strong>ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ రివార్డ్స్ 123 ప్లస్ అకౌంటుతో ప్రయోజనాలు ఎన్నో తెలుసా??

Xiaomi 11 లైట్ NE 5G గ్లోబల్ ధరలు
 

Xiaomi 11 లైట్ NE 5G గ్లోబల్ ధరలు

ప్రపంచవ్యాప్తంగా Xiaomi 11 లైట్ NE 5G మూడు కాన్ఫిగరేషన్‌లలో లాంచ్ చేయబడింది. లీక్ సూచించినట్లు కంపెనీ ఇండియన్ మార్కెట్ కోసం దీనిని ప్రవేశపెట్టవచ్చు. రీకాల్ చేసుకుంటే కనుక Xiaomi 11 లైట్ 5G NE యొక్క గ్లోబల్ వేరియంట్ ధర 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ కోసం EUR 349 (సుమారు రూ. 30,300), 8GB RAM + 128GB స్టోరేజ్ ఆప్షన్ కోసం EUR 399 (సుమారు రూ. 34,600). దాని గ్లోబల్ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర ఇంకా ప్రకటించబడలేదు.

Xiaomi 11 Lite NE 5G స్పెసిఫికేషన్స్

Xiaomi 11 Lite NE 5G స్పెసిఫికేషన్స్

Xiaomi 11 Lite NE 5G ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించబడినందున వీటి యొక్క ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ ఇప్పటికే అందరికి తెలిసి ఉంటాయి. ఇది MIUI 12.5 తో ఆండ్రాయిడ్ 11 లో రన్ అవుతుంది. ఇది 6.55-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ (1,080x2,400 పిక్సెల్స్) 10-బిట్ ఫ్లాట్ AMOLED ట్రూ-కలర్ డిస్‌ప్లేను 90Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778G SoC ద్వారా శక్తిని పొందుతూ 8GB RAM తో జత చేయబడి ఉంది. Xiaomi Xiaomi 11 Lite 5G NE లో 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీని అందించింది.

ఆప్టిక్స్

Xiaomi 11 లైట్ 5G NE యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే దీని వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్ మరియు 5 మెగాపిక్సెల్ టెలిమాక్రో షూటర్ ఉన్నాయి. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS, NFC, IR బ్లాస్టర్ మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది మరియు డ్యూయల్ స్పీకర్లను కలిగి ఉంది. Xiaomi 11 లైట్ 5G NE 4,250mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది, ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

Best Mobiles in India

English summary
Xiaomi 11 Lite NE 5G India Price and Colour Options Leaked: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X