Home
News

ఈ షియోమీ ఫోన్లకు ఆండ్రాయిడ్ 13 MIUI అప్డేట్ వచ్చింది! డౌన్లోడ్ చేసుకోండి! 

By Maheswara

షియోమీ 11i మరియు షియోమీ 11i హైపర్‌ఛార్జ్ ఫోన్లకు భారతదేశంలో సరికొత్త ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేసే MIUI 14 OS అప్‌డేట్‌ ను అందిస్తున్నామని షియోమీ సంస్థ తెలిపింది. ఈ అప్‌డేట్‌ లో కొత్త చేంజ్‌లాగ్‌లు, తాజా ఫర్మ్‌వేర్ వెర్షన్, సెక్యూరిటీ ప్యాచ్‌లు మరియు మరిన్ని కొత్త ఫీచరులను తీసుకువస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14 అప్‌డేట్ 3.6GB పరిమాణంతో వస్తుంది, దీనిని MIUI డౌన్‌లోడ్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే షియోమీ 11i సిరీస్ గత ఏడాది జనవరిలో ఆండ్రాయిడ్ 11-ఆధారిత MIUI 12.5 ని లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ అప్‌డేట్‌ జనవరి 2023 సెక్యూరిటీ ప్యాచ్‌తో పాటు వస్తుంది.

Xiaomi 11i And Xiaomi 11i Hypercharge Smartphones Are Getting Android 13 Based MIUI 14 Update.

షియోమీ షేర్ చేసిన వివరాల ప్రకారం, భారతదేశంలో షియోమీ 11i మరియు Xiaomi 11i హైపర్‌ఛార్జ్‌పై MIUI 14 అప్‌డేట్ కొత్త యూజర్ ఇంటర్‌ఫేస్, హోమ్ స్క్రీన్‌కి సూపర్ ఐకాన్‌లు, త్వరిత యాప్ లాంచ్ స్పీడ్, మెరుగైన సిస్టమ్ పనితీరు ఫీచర్లతో పాటు మెరుగైన బ్యాటరీ లైఫ్‌ను పరిచయం చేసింది. అప్‌డేట్ తాజా ఫర్మ్‌వేర్ వెర్షన్ MIUI 14.0.1.0.TKTINXM మరియు జనవరి 2023 సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది.

షియోమీ 11i మరియు షియోమీ 11i హైపర్‌ఛార్జ్ MIUI 14 అప్‌డేట్ యొక్క చేంజ్‌లాగ్ ప్రస్తుతం భారతదేశంలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ తాజా అప్‌డేట్ పరిమాణం 3.6GB సైజు ఉంది. దీన్ని MIUI డౌన్‌లోడ్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా, Mi పైలట్స్ ప్రోగ్రామ్‌లో ముందుగా రిజిస్టర్ చేసుకున్న వినియోగదారులకు ఈ తాజా OS అప్‌డేట్ అందించబడుతోంది. పరీక్ష తర్వాత, ఎటువంటి బగ్‌లు,లోపాలు కనుగొనబడకపోతే, ఇది సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది అని షియోమీ తెలిపింది.

Xiaomi 11i And Xiaomi 11i Hypercharge Smartphones Are Getting Android 13 Based MIUI 14 Update.

షియోమీ 11i హైపర్‌ఛార్జ్ స్పెసిఫికేషన్ల వివరాలు

దీనికి అదనంగా, ఈ కొత్త అప్‌డేట్ లో కొత్త సెర్చ్ హిస్టరీ మరియు కేటగిరీ ఫీచర్‌లతో సెట్టింగ్‌లను కూడా కలిగి ఉంది. షియోమీ 11i మరియు షియోమీ 11i హైపర్‌ఛార్జ్ ఫోన్లకు జనవరి 2022లో ఆండ్రాయిడ్ 11 మరియు MIUI 12.5 మెరుగుపరచబడిన ఎడిషన్‌తో లాంచ్ చేయబడ్డాయి. ఈ రెండు ఫోన్‌లు 6.67-అంగుళాల పూర్తి-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) సూపర్ AMOLED డిస్‌ప్లేను 20:9 యాస్పెక్ట్ రేషియో, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో కలిగి ఉంటాయి. అవి MediaTek డైమెన్సిటీ 920 SoC ద్వారా అందించబడతాయి, గరిష్టంగా 8GB వరకు LPDDR4x RAMతో వస్తాయి.

కెమెరా ఆప్టిక్స్ విషయానికి వస్తే షియోమీ 11i సిరీస్ ఫోన్లు 108-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్ మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉన్నాయి. Xiaomi 11i సిరీస్ రెండూ కూడా 128GB UFS 2.2 స్టోరేజ్‌ను కలిగి ఉన్నాయి. వీటిలో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించడానికి కూడా అనుమతిస్తుంది.

Xiaomi 11i And Xiaomi 11i Hypercharge Smartphones Are Getting Android 13 Based MIUI 14 Update.

షియోమీ 11i 5G స్పెసిఫికేషన్ల వివరాలు

షియోమీ 11i సిరీస్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS, USB టైప్-C పోర్ట్ మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ మరియు ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి. ఈ సిరీస్ ఫోన్లు డాల్బీ అట్మోస్ మరియు హై-రెస్ ఆడియో సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్ సెటప్‌ను కలిగి ఉంటాయి. షియోమి 11i హైపర్‌ఛార్జ్ 5G ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీని ప్యాక్ ఉంటే షియోమి 11i 5G ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,160mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ధూళి మరియు నీటి-నిరోధకత కోసం IP53 ధృవీకరణను కలిగి ఉన్నాయి. అలాగే ఇవి 163.65x76.19x8.34mm కొలతలతో లభిస్తాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Xiaomi 11i And Xiaomi 11i Hypercharge Smartphones Are Getting Android 13 Based MIUI 14 Update.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X