షియోమి 11T ప్రో 5G vs వన్‌ప్లస్ 9RT: కొత్త స్మార్ట్‌ఫోన్ల మధ్య గల తేడాలు ఇవే...

|

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు షియోమి యొక్క అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న షియోమి 11T ప్రో 5Gని జనవరి 19న ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో విడుదల చేసింది. ఇదే ధర విభాగంలోని ఇతర స్మార్ట్‌ఫోన్‌లతో ఇది పోటీపడుతుంది. OnePlus సంస్థ కూడా గత వారం OnePlus 9RT హ్యాండ్‌సెట్ ని కూడా ప్రారంభించింది. ఇది కొత్తగా ప్రారంభించిన షియోమి 11T ప్రోకి పోటీగా ఉంటుంది. తయారీదారులు ఇద్దరూ ఒకే విధమైన ధర పరిధిలో తమ కొత్త పరికరాలను విడుదల చేశారు కావున ఎంపిక చేసుకునేటప్పుడు కస్టమర్‌లకు అయోమయం కలిగించవచ్చు. కొత్త ఫోన్లను కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులకు ఎటువంటి కష్టం లేకుండా వారి ఎంపికను సులభతరం చేయడానికి కొత్తగా ప్రారంభించబడిన రెండు హ్యాండ్‌సెట్‌ల మధ్య గల పోలికల వివరాలు కింద వివరణాత్మక పేర్కొనబడింది. వాటి వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Xiaomi 11T Pro vs OnePlus 9RT - డిస్ప్లే

Xiaomi 11T Pro vs OnePlus 9RT - డిస్ప్లే

షియోమి 11T ప్రో 5G ఫోన్ భారతీయ మార్కెట్‌లో 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్‌కు మద్దతుతో 6.67-అంగుళాల ఫుల్-HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉన్న డిస్‌ప్లేతో ప్రారంభించబడింది. దీని యొక్క డిస్ప్లే డాల్బీ విజన్, 1000నిట్స్ గరిష్ట ప్రకాశం మరియు 480Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు కూడా మద్దతు ఇస్తుంది. అలాగే అదనపు రక్షణ పొర కోసం గొరిల్లా గ్లాస్ విక్టస్‌ని కూడా కలిగి ఉంది. మరోవైపు OnePlus 9RT 6.62-అంగుళాల FHD+ డిస్‌ప్లేతో ప్రారంభించబడింది. ఇది 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 600Hz టచ్ శాంప్లింగ్ రేట్ మరియు 1300nits గరిష్ట ప్రకాశాన్ని సపోర్ట్ చేయగలదు.

పనితీరు
 

పనితీరు

కొత్తగా ప్రారంభించబడిన షియోమి 11T ప్రో క్వాల్కమ్ యొక్క స్నాప్‌డ్రాగన్ 888 SoCతో వస్తుంది. ఇది గరిష్టంగా 12GB వరకు LPDDR5 RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జత చేయబడి వస్తుంది. ఇది 3GB వరకు అదనపు వర్చువల్ RAM విస్తరణకు కూడా మద్దతు ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 11 పై MIUI 12.5తో రన్ అవుతుంది. ఈ డివైస్ యొక్క ముఖ్య ఆకర్షణ దాని 120W హైపర్‌ఛార్జ్ సపోర్ట్‌ను ఉపయోగించి పరికరాన్ని కేవలం 17 నిమిషాల్లో 0 నుండి 100 వరకు ఛార్జ్ చేయవచ్చు. హ్యాండ్‌సెట్ 5000mAh బ్యాటరీతో మద్దతు ఇస్తుంది.

OnePlus 9RT స్మార్ట్‌ఫోన్ పనితీరు విషయానికి వస్తే ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 SoCతో పాటు 12GB వరకు LPDDR5 RAM మరియు 256GB UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అలాగే ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది కేవలం 29 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్‌ని పూర్తి చేయగలదు. OnePlus నుండి వచ్చిన తాజా పరికరం ఆండ్రాయిడ్ 11 ఆధారంగా ఆక్సిజన్‌OS 11లో రన్ అవుతుంది.

 

కెమెరా సెటప్‌

కెమెరా సెటప్‌

షియోమి 11T ప్రో స్మార్ట్‌ఫోన్ యొక్క కెమెరా సెటప్‌ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 108MP లెన్స్‌తో ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్ మరియు 5MP టెలిమాక్రో షూటర్ ఆటోఫోకస్ సపోర్ట్‌తో జతచేయబడి ఉంటుంది. ఫోన్ ముందు భాగంలో 16MP సెల్ఫీ షూటర్ కెమెరాను కలిగి ఉంది.

వన్‌ప్లస్ 9RT స్మార్ట్‌ఫోన్ యొక్క కెమెరా సెటప్‌ విషయానికి వస్తే వెనుక భాగంలో 6MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ మరియు 2MP మాక్రో సెన్సార్‌తో పాటు 50MP సోనీ IMX766 ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉన్న ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. OnePlus 9RT ముందు భాగంలో సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం 16MP Sony IMX471 సెన్సార్ ఉంది.

 

ధరల తేడాలు

ధరల తేడాలు

షియోమి 11T ప్రో స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్‌లతో భారతదేశంలో ప్రారంభించబడింది. 8GB+128GB కలిగిన బేస్ వేరియంట్ ధర రూ.39,999, మరియు 8GB+256GB మరియు 12GB+256GB వేరియంట్‌ల ధరలు వరుసగా రూ.41,999 మరియు రూ.43,999. అలాగే వన్‌ప్లస్ 9RT రెండు విభిన్న స్టోరేజ్ వేరియంట్‌లతో వస్తుంది. 8GB+128GB కలిగిన బేస్ వేరియంట్ ధర రూ.42,999 కాగా మరియు 12GB+256GBతో కూడిన సుపీరియర్ మెమరీ వేరియంట్ ధర రూ.46,999కి అందుబాటులో ఉంది.

Xiaomi 11T Pro vs OnePlus 9RT-తుది తీర్పు

Xiaomi 11T Pro vs OnePlus 9RT-తుది తీర్పు

తుది తీర్పు విషయానికి వస్తే రెండు స్మార్ట్‌ఫోన్ల పనితీరు పరంగా Xiaomi 11T ప్రో మరియు OnePlus 9RT రెండూ ఒకే విధమైన ప్రాసెసర్‌లను కలిగి ఉంటాయి మరియు ఒకే విధమైన స్టోరేజ్ ఎంపికలను కలిగి ఉంటాయి. అయితే బ్యాటరీ లైఫ్ మరియు ఛార్జింగ్ సపోర్ట్ విషయానికి వస్తే Xiaomi 11T ప్రో ఖచ్చితంగా దాని 120W హైపర్‌ఛార్జ్ మద్దతుతో ఒక పాయింట్‌ను పొందుతుంది. Xiaomi 11T ప్రో దాని 108MP ప్రైమరీ కెమెరాతో కెమెరా డిపార్ట్‌మెంట్‌లో ముందంజలో ఉన్నట్లు అనిపిస్తుంది అలాగే పరికరం యొక్క ధర OnePlus 9RTతో పోల్చితే కొంచెం సరసమైనది. కాబట్టి రెండు పరికరాలు చాలా సారూప్యమైన కార్యాచరణ మరియు స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్నప్పటికీ Xiaomi 11T Pro OnePlus 9RT కంటే మెరుగ్గా ఉంది అని చెప్పడం తప్పు కాదు.

 

Best Mobiles in India

English summary
Xiaomi 11T Pro 5G vs OnePlus 9RT: Which One is The Best For Buying

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X