Home
News

షియోమీ కొత్త ఫోన్ లాంచ్ తో, ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది! కొత్త ధర, ఆఫర్ల వివరాలు

By Maheswara

షియోమీ యొక్క తాజా స్మార్ట్‌ఫోన్ షియోమీ 13 ప్రో, భారతదేశంలో లాంచ్ చేయబడింది. ఈ సందర్భంగా , ఒక సంవత్సరం క్రితం భారతదేశంలో లాంచ్ చేయబడిన షియోమీ 12 ప్రో స్మార్ట్ ఫోన్ పై ఇప్పుడు రూ.10,000 ధర తగ్గింపును ప్రకటించింది.ప్రస్తుతం ఈ ఫోన్ యొక్క ధరలను మరియు ఆఫర్ల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

అవును, షియోమీ కంపెనీ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు శుభవార్త అందించింది. షియోమీ 13 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ లభ్యత వివరాలను భారతదేశంలో ప్రకటించగా, షియోమీ 12 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. షియోమీ 12 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గించడం ద్వారా గొప్ప ఆఫర్‌ను అందిస్తుంది.

Xiaomi 12 Pro 5G Phone Receives Huge Price Cut Of Rs.10000. New Price And Offers Details In Telugu

షియోమీ 12 ప్రో 5G ఫోన్ పై భారీ ధర తగ్గింపు!
షియోమీ 12 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేక తగ్గింపు ఆఫర్‌లను ప్రకటించింది. దీని ద్వారా, మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, షియోమీ 12 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ. 10,000. ధర తగ్గింది. ఈ ధర తగ్గింపు తర్వాత, మీరు HDFC బ్యాంక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే, మీకు అదనంగా రూ.3,000 వరకు తగ్గింపు కూడా లభిస్తుంది. దీనితో మీరు ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క 8GB వేరియంట్‌ను కేవలం రూ.49,999 కే కొనుగోలు చేయవచ్చు.

షియోమీ స్మార్ట్‌ఫోన్‌ను మొదటి సారి కొనుగోలు చేసే వినియోగదారులకు రూ. 3,000 ఎక్స్చేంజి ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అలాగే మీ పాత షియోమీ పరికరంను ఎక్స్చేంజి చేయాలనుకుంటే రూ. 5,000 (నాణ్యతను బట్టి) వరకు అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ అందుబాటులో ఉంటుంది. దీనితో, Xiaomi 12 ప్రో స్మార్ట్‌ఫోన్ యొక్క 8GB వేరియంట్‌ను కేవలం రూ. 47,999కి మీరు కొనుగోలు చేయవచ్చు.

Xiaomi 12 Pro 5G Phone Receives Huge Price Cut Of Rs.10000. New Price And Offers Details In Telugu

షియోమీ 12 ప్రో 5G ప్రత్యేక ఫీచర్లు
షియోమీ 12 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 1,440 x 3,200 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో 6.73 అంగుళాల WQHD+ శాంసంగ్ E5 అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.ఈ డిస్ప్లే గరిష్టంగా 1,500 నిట్‌ల ప్రకాశం మరియు 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. షియోమీ 12 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది ఇది 8GB RAM + 256GB మరియు 12GB RAM + 256GB స్టోరేజీ వేరియంట్ లను కూడా కలిగి ఉంది.

షియోమీ 12 ప్రో 5G కెమెరా సెటప్ వివరాలు
ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ప్రధాన కెమెరాలో 50-మెగాపిక్సెల్ సోనీ IMX707 సెన్సార్, రెండవ కెమెరాలో 50-మెగాపిక్సెల్ సెన్సార్ పోర్ట్రెయిట్ లెన్స్ మరియు 50-మెగాపిక్సెల్ సెన్సార్ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి.అలాగే,ఇది 32 మెగాపిక్సెల్ సెన్సార్‌తో కూడిన సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంది.

షియోమీ 12 ప్రో 5G బ్యాటరీ మరియు ఇతర ఫీచర్ల వివరాలు
ఈ స్మార్ట్‌ఫోన్ 4,600 mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది 120W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇందులో 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇతర కనెక్టివిటీ ఎంపికలలో 5G, Wi-Fi 6E, బ్లూటూత్ v5.2, NFC మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫోన్ బ్లూ, బ్లాక్ మరియు ఒపెరా మావ్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Xiaomi 12 Pro 5G Phone Receives Huge Price Cut Of Rs.10000. New Price And Offers Details In Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X