Home
News

Xiaomi 12 ప్రో స్మార్ట్‌ఫోన్ & షియోమి ప్యాడ్ 5 లాంచ్ అయింది!! ఫీచర్స్ బ్రహ్మాండం...

షియోమి స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ నేడు భారతదేశంలో జరిగిన షియోమి నెక్స్ట్ ఈవెంట్‌లో కొత్త పరికరాలను విడుదల చేసింది. అందులో భాగంగా ఇండియాలో మొబైల్ రంగంలోని OnePlus 10 ప్రో మరియు సామ్ సంగ్ గెలాక్సీ S22 వంటి వాటికి పోటీగా షియోమి 12 ప్రో ఫ్లాగ్‌షిప్ ఫోన్ ను విడుదల చేసింది. ఇది 120Hz E5 AMOLED డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. అదనంగా ఇది 120W ఫాస్ట్ వైర్డ్ మరియు 50W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటుగా స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 SoC ద్వారా రన్ అవుతూ గరిష్టంగా 12GB RAMతో జతచేయబడి వస్తుంది. షియోమి12 ప్రో తో పాటు చైనీస్ కంపెనీ షియోమి ప్యాడ్ 5ని కూడా భారతదేశంలో లాంచ్ చేసింది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

షియోమి 12 ప్రో ధరల వివరాలు

షియోమి 12 ప్రో ధరల వివరాలు

షియోమి 12 ప్రో స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో రెండు వేరియంట్‌లలో లాంచ్ అయింది. ఇందులో 8GB RAM మోడల్ యొక్క ధర రూ.62,999 కాగా 12GB RAM వేరియంట్‌ మోడల్ యొక్క ధర రూ.66,999. ఇది కోచర్ బ్లూ, నోయిర్ బ్లాక్ మరియు ఒపేరా మౌవే వంటి కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఇది మే 2 మధ్యాహ్నం 12 గంటల నుండి Amazon, Mi.com, Mi హోమ్ స్టోర్‌లు మరియు దేశంలోని ఇతర కీలక రిటైల్ ఛానెల్‌ల ద్వారా మొదటి సేల్స్ ప్రారంభం కానున్నాయి. మొదటి సేల్స్ లో పరిచయ ఆఫర్‌లో భాగంగా రూ.4,000 తగ్గింపుతో పొందవచ్చు. ICICI బ్యాంక్ కార్డ్ యొక్క EMI ఎంపికలను ఉపయోగించి ఫోన్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లు అదనంగా రూ.6,000 వరకు తగ్గింపును పొందవచ్చు.

షియోమి ప్యాడ్ 5 ధరల వివరాలు

షియోమి ప్యాడ్ 5 ధరల వివరాలు

షియోమి ప్యాడ్ 5 ను కూడా కంపెనీ భారతదేశంలో రెండు వేరియంట్‌లలో లాంచ్ చేసింది. ఇందులో 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.26,999 కాగా 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.28,999. మే 3 మధ్యాహ్నం 12 గంటల నుండి Amazon, Mi.com, Mi Home స్టోర్‌లలో మరియు ఆఫ్‌లైన్ రిటైలర్‌ల ద్వారా మొదలయ్యే సేల్స్ లో పరిచయ ఆఫర్‌గా 128GB మోడల్ ను రూ.24,999 మరియు 256GB వేరియంట్‌ను రూ.26,999 తగ్గింపు ధర వద్ద అందిస్తున్నది. ఈ తగ్గింపు ఆఫర్ మే 7 వరకు ఉంటుంది.

షియోమి 12 ప్రో స్పెసిఫికేషన్స్

షియోమి 12 ప్రో స్పెసిఫికేషన్స్

షియోమి 12 ప్రో యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి MIUI 13 మరియు ఆండ్రాయిడ్12 పై రన్ అవుతుంది. ఇది డైనమిక్ రిఫ్రెష్‌ను అందించడానికి రెండవ తరం LTPO టెక్నాలజీపై ఆధారపడిన 6.72-అంగుళాల WQHD+ E5 AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే గరిష్టంగా 1,500 నిట్స్ బ్రైట్‌నెస్‌, డాల్బీ విజన్ & HDR10+ సపోర్ట్‌, మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ను కలిగి ఉంది. హుడ్ కింద ఇది ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 SoC మరియు అడ్రినో 730 GPU తో రన్ అవుతూ 12GB వరకు LPDDR5 RAMతో ప్యాక్ చేయబడి వస్తుంది.

ఆప్టిక్స్

షియోమి 12 ప్రో యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది సోనీ IMX707 ప్రైమరీ సెన్సార్‌తో 50-మెగాపిక్సెల్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మద్దతుతో పాటుగా f/1.8 లెన్స్‌తో ఉంటుంది. కెమెరా సెటప్‌లో 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్ మరియు 50-మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్ కూడా ఉన్నాయి. ఇవి 24fps ఫ్రేమ్ రేట్ వద్ద గరిష్టంగా 8K వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది. అదనంగా ఇది పోర్ట్రెయిట్ నైట్ మోడ్, పోర్ట్రెయిట్ HDR మరియు ఫోటో క్లోన్స్ వంటి ఫీచర్‌లను కూడా కలిగి ఉంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ఫోన్ ముందు భాగంలో f/2.45 లెన్స్‌తో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

కనెక్టివిటీ

Xiaomi 12 ప్రోలోని కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS/ NavIC, ఇన్‌ఫ్రారెడ్ (IR) బ్లాస్టర్, NFC మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. బోర్డులోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్, బేరోమీటర్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. 120W Xiaomi హైపర్‌ఛార్జ్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4,600mAh Li-Polymer బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Xiaomi 12 Pro Smartphone Launched in India With Snapdragon 8 Gen 1 SoC: Price, Specs, Sale Date, Sale Offers and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X