Home
News

షియోమీ కొత్త ఫోన్ డిజైన్ లీక్ అయింది! ఇది ఫోనా ...లేక DSLR కెమెరా నా ..?

By Maheswara

షియోమీ సంస్థ త్వరలో లాంచ్ చేయనున్న షియోమీ 13 అల్ట్రా యొక్క డిజైన్ టీజర్ లాంచ్ కు ముందే లీక్ అయింది. లాంచ్‌కు ముందు, చైనీస్ తయారీదారు ఫోన్ యొక్క అనేక అంశాలను టీజ్ చేయడం ప్రారంభించింది. తాజాగా, కంపెనీ స్మార్ట్‌ఫోన్‌లో ఉపయోగించే కెమెరా సెన్సార్ల గురించి కొన్ని వివరాలను వెల్లడించింది.

ఈ ఫోన్ ఏప్రిల్ 18 చైనా లో లాంచ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు, కంపెనీ షియోమీ 13 అల్ట్రా డిజైన్ పై మొదటి అధికారిక డిజైన్ ను అందించింది. మరియు ఇది చూడటానికి స్మార్ట్‌ఫోన్ లాగా కంటే DSLR కెమెరా లాంటి డిజైన్ కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది. త్వరలో రాబోయే ఈ ఫ్లాగ్‌షిప్ షియోమీ 12S అల్ట్రా ఫోన్ కు కొనసాగింపుగా వస్తుంది. మరియు లైకా కెమెరాలను కలిగి ఉంటుంది.

Xiaomi 13 Ultra Design Teaser Leaked Ahead Of The April 18 Launch. Expected Specifications Details Here.

ఇటీవలి Weibo పోస్ట్‌లో, షియోమీ CEO లీ జున్ షియోమీ 13 అల్ట్రా యొక్క రెండు ప్రచార చిత్రాలను పంచుకున్నారు, ఇది రాబోయే హ్యాండ్‌సెట్ యొక్క డిజైన్ ను వెల్లడిస్తుంది. ఇది కెమెరా లాంటి డిజైన్‌తో వస్తుందని తెలుస్తోంది. జూన్ పోస్ట్‌లో ఇలా వ్రాశాడు, "ఈ సూట్ యొక్క ఆశీర్వాదంతో, మీ ఫోన్ కెమెరాగా మారుతుంది! Mi 13 అల్ట్రా పూర్తి స్థాయి ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీని కలిగి ఉంది. ఈ సెట్‌లో చాలా ఆహ్లాదకరమైన విషయాలు ఉన్నాయి, "మరియు మరింత సమాచారం విలేకరుల సమావేశంలో వెల్లడి చేయబడుతుంది మరియు చర్చించబడుతుంది, అని వివరించారు.

ఇది చాలా స్పష్టంగా లేనప్పటికీ, ఈ పోస్ట్ నుండి, ప్రచార చిత్రంలో కనిపించే కెమెరా వంటి బంప్ మరియు గ్రిప్ తో షియోమీ 13 అల్ట్రా కు తగిలించగల మరియు తీసివేయగల కేస్ ఉంటుందని భావించవచ్చు. షియోమీ 12S అల్ట్రా కాన్సెప్ట్ ను గమనిస్తే దాని శరీరానికి Leica M-సిరీస్ లెన్స్ మాడ్యూల్‌ను జోడించడానికి వినియోగదారులను అనుమతించిందని గమనించవచ్చు.

షియోమీ 13 అల్ట్రా "ఒక ప్రొఫెషనల్ ఇమేజింగ్ పరికరం, కెమెరా ఫోన్ కాదు" అని కంపెనీ చెప్పింది. అధికారికంగా ఏప్రిల్ 18 లాంచ్ అయ్యే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఫోన్ యొక్క ప్రత్యేకమైన మోడల్ విడుదల కోసం ఇవ్వబడుతుంది.

ఈ ఫోన్ ప్రత్యేక Summicron లెన్స్‌లు మరియు సోనీ IMX989 మరియు సోనీ IMX858 సెన్సార్‌లతో లైకా కెమెరాలను కలిగి ఉన్నట్లు నిర్ధారించబడింది. ఇంకా, ఈ ఫోన్ క్వాడ్ కెమెరా సెటప్‌లో 50 మెగాపిక్సెల్ సోనీ IMX989 సెన్సార్ మరియు మూడు 50 మెగాపిక్సెల్ సోనీ IMX858 సెన్సార్‌లు ఉంటాయి, ఇవి మెరుగైన నాయిస్ రిడక్షన్ టెక్నాలజీలు మరియు HDR ఫీచర్‌లను అందిస్తాయని చెప్పబడింది.

ఇంతకు ముందు వచ్చిన నివేదికల ప్రకారం, షియోమీ 13 అల్ట్రా ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 SoC ద్వారా 16GB వరకు RAM మరియు 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజీ శక్తిని పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల WQHD+ అమోలెడ్ LTPO డిస్‌ప్లే ఉంటుంది.

ఇంకా, ఈ స్మార్ట్‌ఫోన్ 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో కూడా వస్తుందని అంచనావేయబడింది. షియోమీ 13 అల్ట్రా ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పని చేసే MIUI 14తో వస్తుందని భావిస్తున్నారు. లీకైన నివేదికల ప్రకారం, ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్ తో 4,900mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Xiaomi 13 Ultra Design Teaser Leaked Ahead Of The April 18 Launch. Expected Specifications Details Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X