Home
News

షియోమీ యొక్క కొత్త ఫోన్ Xiaomi 14 Civi ధర లీక్ అయింది! స్పెసిఫికేషన్ల వివరాలు.

షియోమీ సంస్థ నుంచి Xiaomi 14 Civi స్మార్ట్‌ఫోన్ జూన్ 12న భారతదేశంలో లాంచ్ కానుంది. కంపెనీ ఇంతకు ముందే రాబోయే ఈ హ్యాండ్‌సెట్ యొక్క అనేక ముఖ్యమైన స్పెసిఫికేషన్లను టీజ్ చేసింది. ఈ ఫోన్ యొక్క డిజైన్ మరియు రంగుల ఎంపికలు కూడా వెల్లడయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది మార్చిలో చైనాలో లాంచ్ చేయబడిన Xiaomi Civi 4 ప్రో యొక్క రీబ్యాడ్జ్డ్ వెర్షన్‌గా రాబోతోందని సూచించబడింది.ఇప్పుడు, లాంచ్‌కు ముందే, టిప్‌స్టర్ Xiaomi 14 Civi యొక్క సాధ్యమయ్యే ధరతో పాటు ఊహించిన RAM మరియు స్టోరేజ్ వేరియంట్‌ల వివరాలను లీక్ చేసారు.

భారతదేశంలో Xiaomi 14 Civi అంచనా ధర
భారతదేశంలో షియోమీ 14 సివి ధర 8GB + 128GB ఎంపిక కోసం రూ. 43,000, టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ (@yabhishekhd) X పోస్ట్‌లో క్లెయిమ్ చేసారు. ఇక రెండవ వేరియంట్ 12GB + 512GB వేరియంట్ కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ, ఈ వివరాల గురించి "ఈసారి ఖచ్చితంగా తెలియదు" అని టిప్‌స్టర్ పేర్కొన్నాడు. కాబట్టి, పాఠకులు ఈ సమాచారాన్ని అంచనా గా మాత్రమే తీసుకోవాలి.

Xiaomi 14 Civi Price Revealed In India Ahead Of June 12 Launch

షియోమీ సంస్థ యొక్క ఇండియా CMO అనూజ్ శర్మ గతంలో మీడియా ద్వారా కంపెనీ Xiaomi 14 Civi ని భారత దేశంలో సుమారు రూ.50,000 ధరలో లాంచ్ చేయనున్నట్లు వెల్లడించారు.

Xiaomi 14 Civi స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు
షియోమీ 14 సివి స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఫ్లాట్ 1.5K అమోలెడ్ స్క్రీన్‌ను కలిగి ఉన్నట్లు నిర్ధారించబడింది. ఇది క్వాల్కమ్ యొక్క స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది మరియు ఆండ్రాయిడ్ 14-ఆధారిత HyperOS తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో లైకా బ్రాండ్ యొక్క ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ అలాగే డ్యూయల్ 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలు కలిగి ఉంటాయి.

షియోమీ 14 సివి 67W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,700mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఈ బ్యాటరీ 1,600 వరకు ఛార్జ్ సైకిల్స్‌కు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మెటల్ ఫ్రేమ్‌తో వస్తుంది మరియు 7.4 మిమీ మందంతో ఉంటుంది. ఇది భారతదేశంలో మూడు రంగుల ఎంపికలలో అందుబాటులో ఉంటుంది అవి క్రూజ్ బ్లూ, మ్యాచా గ్రీన్ మరియు షాడో బ్లాక్ రంగులు.

Xiaomi 14 Civiలో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IR బ్లాస్టర్ సెన్సార్, హై-రెస్ ఆడియో, స్టీరియో స్పీకర్లు మరియు డాల్బీ అట్మోస్ సపోర్ట్ వంటి కొన్ని ఇతర అంచనా ఫీచర్లు ఉన్నాయి.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Xiaomi 14 Civi Price Revealed In India Ahead Of June 12 Launch. Specifications And Sale Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X