ట్రిపుల్ కెమెరా, HyperOS, అమోలెడ్ డిస్‌ప్లేతో షియోమీ స్మార్ట్‌ఫోన్లు.. లాంచ్ తేదీ, ధర వివరాలు..!
షియోమీ 14 సిరీస్ (Xiaomi 14 Series) స్మార్ట్‌ఫోన్లను 2023 అక్టోబర్‌లో చైనాలో ఆవిష్కరించారు. ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్లలో అల్ట్రా మోడల్ టాప్ ఎండ్ వేరియంట్‌గా తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌లు తొలిసారిగా HyperOS తో లాంచ్ అవుతున్నాయి. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్లు గ్లోబల్ లాంచ్ వివరాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నెలలో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ MWC (2024) లో విడుదల కానున్నాయి.
షియోమీ సీఈవో Lei Jun తన X పోస్టు ద్వారా షియోమీ 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల తేదీలను వెల్లడించారు. ఫిబ్రవరి 25న ఈ స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నాయి. షియోమీ 14 మరియు షియోమీ 14 ప్రో తోపాటు షియోమీ 14 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే అల్ట్రా మోడల్ లాంచ్‌పై సంస్థ ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.

అయితే ఇప్పటికే షియోమీ 14 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్‌లో మోడల్ నంబర్ 24030PN60G తో నమోదు అయింది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 SoC చిప్ అడెన్నో 750 GPUతో జతచేయబడుతుందని భావిస్తున్నారు. మరియు ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 HyperOS పైన పనిచేయనుంది.
షియోమీ 14 అల్ట్రా హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల 2k అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అల్ట్రాసోనిక్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. వెనుకవైపు క్వాడ్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 50MP సోనీ LYT-900 ప్రధాన కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 90W వైరడ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5180mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని సమాచారం.

షియోమీ 14 మరియు షియోమీ 14 ప్రో స్మార్ట్ ఫోన్లు చైనాలో లాంచ్ అయిన హ్యాండ్‌సెట్ల తరహా ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది. చైనాలో లాంచ్ అయిన హ్యాండ్‌సెట్ ప్రో మోడల్ 6.73 అంగుళాల 2k LTPO స్క్రీన్‌తో వస్తుంది.
మరియు స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ 16GB LPDDR5X ర్యామ్ మరియు 1TB UFS 4.0 స్టోరేజీతో జతచేయబడుతుంది. మరియు 120W వైరడ్, 50W వైర్‌లెస్, 10W వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 4880mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

అదే షియోమీ 14 స్మార్ట్‌ఫోన్ కూడా OS మరియు చిప్‌సెట్‌లో ప్రో మోడల్ తరహా స్పెసిఫికేషన్లను కలిగి ఉంటుంది. అయితే 6.36 అంగుళాల LTPO అమోలెడ్ 1.5k డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 90W వైరడ్, 50W వైర్‌లెస్, 10W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 4,610mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
కెమెరా విభాగం విషయానికి వస్తే బేస్, ప్రో మోడళ్లు.. Leica బ్రాండెడ్ వెనుక కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. OIS సపోర్టుతో 50MP ప్రధాన కెమెరా, 50MP టెలీఫోటో షూటర్, 50MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ముందువైపు 32MP అమర్చినట్లు తెలుస్తోంది.
చైనాలో ఈ షియోమీ 14 మరియు 14 ప్రో స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్+ 256GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 3999 అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.50000 గా ఉంటుంది. అదే ప్రో మోడల్ 12GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ CNY 4999 అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.56,500 గా ఉంది.


Click it and Unblock the Notifications