షియోమీ 14 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ధర వివరాలు లీక్.. 5180mAh బ్యాటరీ సహా కీలక ఫీచర్లు..!!
షియోమీ నుంచి భారత్ మార్కెట్‌లోకి త్వరలో షియోమీ 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు (Xiaomi 14 Ultra) లాంచ్ కానున్నాయి. ఈ ఫోన్లతోపాటు షియోమీ 14 అల్ట్రా హ్యాండ్‌సెట్ కూడా లాంచ్ కానుంది. ఈ ఫోన్లు ఫిబ్రవరి 25న విడుదల కానున్నాయి. విడుదలకు ముందే ఈ అల్ట్రా మోడల్ ధర లీకైంది. ఈ ఫోన్‌కు సంబంధించిన డిజైన్, స్పెసిఫికేషన్లు ఇప్పటికే లీక్ అయ్యాయి.
మైస్మార్ట్‌ప్రైస్ రిపోర్టు ఆధారంగా షియోమీ 14 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ఎడ్జ్‌లో కర్వడ్ తరహా డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 2.5D క్వాడ్ మైక్రో కర్వడ్ స్క్రీన్ సహా డిస్‌ప్లేపైన సెంటర్ పంచ్ హోల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇక్కడ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీంతోపాటు కొన్ని నివేదికల ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ 5G సహా శాటిలైట్ కనెక్టివిటీ సామర్థ్యం ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

షియోమీ 14 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్‌లో మోడల్ నంబర్ 24030PN60G తో నమోదు అయింది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 SoC చిప్ అడెన్నో 750 GPU తో జతచేయబడుతుందని భావిస్తున్నారు. మరియు ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 HyperOS పైన పనిచేయనుంది.
దీంతోపాటు షియోమీ 14 అల్ట్రా హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల 2k అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అల్ట్రాసోనిక్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. వెనుకవైపు క్వాడ్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 50MP సోనీ LYT-900 ప్రధాన కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 90W వైరడ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5180mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని సమాచారం.

షియోమీ 14 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ధరను Dealabs అంచనా వేసింది. ఈ హ్యాండ్‌సెట్ 16GB ర్యామ్ + 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర EUR 1499 (భారత కరెన్సీలో రూ.1,33,900) గా ఉంటుందని అంచనా వేసింది. అయితే ఈ ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ మరియు 16GB ర్యామ్ + 1TB స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.
* ఫిబ్రవరి 25న షియోమీ 14 మరియు షియోమీ 14 ప్రో హ్యాండ్‌సెట్లు (Xiaomi 14 Series) విడుదల కానున్నాయి. ప్రో మోడల్ 6.73 అంగుళాల 2k LTPO స్క్రీన్‌తో వస్తుంది. మరియు స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ 16GB LPDDR5X ర్యామ్ మరియు 1TB UFS 4.0 స్టోరేజీతో జతచేయబడుతుంది. మరియు 120W వైరడ్, 50W వైర్‌లెస్, 10W వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 4,880mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
అదే షియోమీ 14 స్మార్ట్‌ఫోన్ కూడా OS మరియు చిప్‌సెట్‌లో ప్రో మోడల్ తరహా స్పెసిఫికేషన్లను కలిగి ఉంటుంది. అయితే 6.36 అంగుళాల LTPO అమోలెడ్ 1.5k డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 90W వైరడ్, 50W వైర్‌లెస్, 10W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 4,610mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
కెమెరా విభాగం విషయానికి వస్తే బేస్, ప్రో మోడళ్లు.. Leica బ్రాండెడ్ వెనుక కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. OIS సపోర్టుతో 50MP ప్రధాన కెమెరా, 50MP టెలీఫోటో షూటర్, 50MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ముందువైపు 32MP అమర్చినట్లు తెలుస్తోంది.
చైనాలో ఈ షియోమీ 14 మరియు 14 ప్రో స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్+ 256GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 3999 అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.50000 గా ఉంటుంది. అదే ప్రో మోడల్ 12GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ CNY 4999 అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.56,500 గా ఉంది.


Click it and Unblock the Notifications








