Home
News

Xiaomi 14T సిరీస్ లాంచ్ ఎప్పుడో, తేదీ వచ్చేసింది! లైవ్ ఫోన్ వీడియో లీక్ అయింది

షియోమీ నుంచి Xiaomi 14T సిరీస్ ఈ నెలాఖరులో ప్రారంభించబడుతుంది అని సంస్థ ప్రకటించింది. Xiaomi గురువారం ఒక ట్వీట్‌లో లాంచ్ తేదీని ధృవీకరించింది. కంపెనీ Xiaomi 14T సిరీస్‌ను మాత్రమే పేర్కొన్నప్పటికీ, గత సంవత్సరం షియోమీ 13T మరియు షియోమీ 13T ప్రోల లాగానే వరుసగా వనిల్లా షియోమీ 14T మరియు షియోమీ 14T ప్రోలను కూడా మనము ఆశించవచ్చు.

ఒకవైపు ఇప్పుడు, ఈ ఫోన్‌ల యొక్క హ్యాండ్-ఆన్ వీడియోలు ఆన్‌లైన్‌లో కొత్త ఫ్లాగ్‌షిప్‌ డిజైన్ లను వివరంగా చూపుతున్నాయి. షియోమీ 14T మరియు షియోమీ 14T ప్రో రెండూ స్క్వేర్ ఆకారపు కెమెరా ద్వీపాలలో ఉంచబడిన లైకా-బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరాలతో కనిపిస్తాయి. షియోమీ 14T మీడియా టెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా చిప్‌సెట్‌తో వస్తుందని భావిస్తున్నారు.

Xiaomi 14T Series Global Launch Date Set For September 26

షియోమీ 14T సిరీస్ సెప్టెంబర్ 26న లాంచ్ కాబోతున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ గ్లోబల్ లాంచ్ ఈవెంట్ జర్మనీలోని బెర్లిన్‌లో GMT మధ్యాహ్నం 2:00 గంటలకు (సాయంత్రం 7:30 గంటలకు IST) జరగనుంది. షియోమీ లాంచ్ కోసం ప్రత్యేక ల్యాండింగ్ పేజీలో కౌంట్‌డౌన్-టైమర్ సెటప్ చేయబడింది. రాబోయే మోడల్‌లలో లైకా-ట్యూన్డ్ కెమెరాలు ఉంటాయని ల్యాండింగ్ పేజీ తెలియచేస్తుంది.

ఒక సారి గుర్తుకు చేసుకుంటే, షియోమీ 13T మరియు షియోమీ 13T Pro కూడా గత సంవత్సరం ఇదే తేదీన లాంచ్ చేయబడ్డాయి.

అదనంగా, XiaomiTime ప్రకటన నివేదిక ప్రకారం, ఒక టిక్ టాక్ వినియోగదారు షియోమీ 14T మరియు షియోమీ 14T ప్రో యొక్క వీడియోను పోస్ట్ చేసారు. తర్వాత ఈ వీడియో తీసివేయబడింది కానీ డిజైన్‌ను చూపించడానికి ప్రచురణ వీడియో స్క్రీన్‌షాట్‌లను పోస్ట్ చేయగలిగింది. వెనిలా మోడల్ బ్లాక్ కలర్‌లో కనిపిస్తుంది, ఈ ప్రో మోడల్ సిల్వర్ ఫినిషింగ్‌లో చూపబడింది.

షియోమీ 14T మరియు షియోమీ 14T ప్రో రెండూ వాటి పూర్వీకుల మాదిరిగానే డిజైన్ లాంగ్వేజ్‌ను కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే కెమెరా ఏర్పాట్లలో కొంచెం ట్వీక్‌లు ఉన్నాయి. ఇవి స్క్వేర్-ఆకారపు మాడ్యూల్స్‌ డిజైన్ లో ఉంచబడిన లైకా-బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది.

గత లీక్‌ల ప్రకారం, షియోమీ 14T ప్రో యొక్క కెమెరా సెటప్‌లో లైట్ ఫ్యూజన్ 900 సెన్సార్‌తో కూడిన 1/1.31-అంగుళాల ప్రధాన కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 50-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటాయి.

షియోమీ 14T సిరీస్ 6.67-అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేతో 4,000నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. వనిల్లా మోడల్ హుడ్ కింద మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా చిప్‌సెట్‌ను పొందగలదు. అయితే ప్రో మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ SoC లో పనిచేసే అయ్యే అవకాశం ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియా ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Xiaomi 14T Series Global Launch Date Set For September 26. Leaked Live Handset Video Reveals Design
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X