Just In
- 12 hrs ago
ధర రూ.15000 ల లోపు మార్కెట్‌లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- 14 hrs ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- 17 hrs ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- 1 day ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Don't Miss
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- News
అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Movies
Pathaan Day 4 Collections: పఠాన్ రికార్డుల సునామీ.. రూ. 400 కోట్ల దిశగా షారుక్ సినిమా!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
షియోమి బ్లాక్ బాస్టర్ డీల్స్, కళ్లు చెదిరే డిస్కౌంట్లు
దేశీయ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల మార్కెట్‌లో దిగ్గజాలకు సవాల్ విసురుతున్న చైనా దిగ్గజం షియోమి ఇండియాలో మరో సంచలనానికి తెరలేపింది. Xiaomi 4th Mi Anniversary Sale పేరిట బ్లాక్ బాస్టర్ డీల్స్ కు తెరలేపింది. ఇప్పటికే ఈ కంపెనీ బడ్జెట్ ధరల్లో స్మార్ట్‌ఫోన్లు, టెలివిజన్లను లాంచ్ చేస్తూ భారతీయ వినియోగదారులను తెగ ఆకట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. నేటికి షియోమి ఇండియాలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి అయిన సంధర్భంగా దాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు షియోమి అభిమానుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.

నాలుగు రూపాయలకే..
ఎంఐ.కామ్‌లో నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ వార్షికోత్సవ సేల్ 12 వరకూ కొనసాగనుంది. ఎంఐ నాలుగో వార్షికోత్సవం ప్రత్యేక ఆఫర్‌లో 55 అంగుళాల ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీని, రెడ్‌మి వై2 (3జీబీ+32జీబీ)ను, రెడ్‌మి నోట్ 5 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం నాలుగు రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చు.

10, 11, 12వ తేదీల్లో..
10, 11, 12వ తేదీల్లో సాయంత్రం 4 గంటలకు లక్కీ కస్టమర్లకు కేవలం నాలుగు రూపాయలకే ఈ ఉత్పత్తులు లభిస్తాయి.

ఫ్లాష్ సేల్స్ అవకాశం చేజారిపోతే..
సాయంత్రం నాలుగు గంటలకు ఫ్లాష్ సేల్స్ అవకాశం చేజారిపోతే, కోంబోలో సాయంత్రం ఆరు గంటలకు రెడ్‌మి నోట్ 5ను, ఎంఐ వీఆర్ ప్లే 2ను కేవలం రూ.9,999కే అందించనున్నట్టు షియోమి తెలిపింది. కాగా వీటి అసలు ధర రూ.11,298గా ఉంది.

రెడ్‌మి వై1
రెడ్‌మి వై1, ఎంఐ బ్లూటూత్ హెడ్‌సెట్‌లను కూడా 8,999 రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చని, ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ను 8,999 రూపాయలకే అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపింది.

మధ్యాహ్నం 12 గంటలకు..
మధ్యాహ్నం 12 గంటలకు బ్లాక్‌బస్టర్ ఆఫర్ కింద ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్‌టీవీని రూ.13,999కు, రెడ్‌మి నోట్ 5 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను రూ.14,999కు విక్రయించనున్నట్టు షియోమి తెలిపింది.

మొబిక్విక్ ద్వారా..
ఎంఐ మిక్స్2, ఎం మ్యాక్స్2లపై కూడా రాయితీని అందిస్తోంది. ఎస్‌బీఐ, పేటీఎం, మొబిక్విక్‌ల ద్వారా చెల్లింపులు చేసేవారు అదనంగా ఇంకొంత రాయితీని పొందవచ్చు. మొబిక్విక్ ద్వారా చెల్లింపు చేసేవారు 25శాతం వరకూ(రూ.2,500 సూపర్ క్యాష్) డిస్కౌంట్ లభిస్తుంది.

మరిన్ని ఆఫర్లు
ఎస్‌బీఐ కార్డు ద్వారా కనీసం రూ.7,500 లావీదేవీపై రూ.500 రాయితీ అందించనుండగా, రూ.8,999 కొనుగోలుపై పేటీఎం ద్వారా చెల్లింపు చేసిన వారికి రూ.500 క్యాష్‌బ్యాక్, విమాన టికెట్ల బుకింగ్‌పై రూ.1,000, సినిమా టికెట్లపై రూ.200 రాయితీని షియోమి అందిస్తుంది.

ఎంఐ మిక్స్2
ఎంఐ మిక్స్2ని ఈ సేల్ లో మీరు రూ.27,999 కే సొంతం చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.29,999గా ఉంది.
ఎంఐ మిక్స్2 ఫీచర్లు
5.99 అంగుళాల డిస్‌ప్లే
2.4 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్
6జీబీ/8జీబీ ర్యామ్
64జీబీ/128జీబీ, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
12 ఎంపీ రియర్ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
ఫింగర్ ప్రింట్ సెన్సార్
3400 ఎంఏహెచ్ బ్యాటరీ
4జీ, వాయిస్‌ఓవర్ ఎల్టీఈ

ఎంఐ మ్యాక్స్2
ఎంఐ మ్యాక్స్2 ని ఈ సేల్ లో భాగంగా రూ.14,999 కే సొంతం చేసుకోవచ్చు. కాగా దీని అసలు ధర రూ.15,999గా ఉంది.
ఎంఐ మ్యాక్స్ 2 ఫీచర్లు..
6.44 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే
1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 625 ఎస్‌ఓసీ
4 జీబీ ర్యామ్
డ్యుయల్ సిమ్
ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ ఆపరేటింగ్ సిస్టమ్
12 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్
5300 ఎంఏహెచ్ బ్యాటరీ

ట్రావెల్ బ్యాక్‌ప్యాక్
ట్రావెల్ బ్యాక్‌ప్యాక్ రూ.1,899(ఎంఆర్‌పీ రూ.1,999), ఎంఐ ఇయర్‌ఫోన్స్ రూ.649(అసలు ధర రూ.699) ఎంఐ బ్యాండ్ 2 రూ.1,599(ఎంఆర్‌పీ రూ.1,799) అందిస్తోంది.

ఎంఐ బ్యాండ్ హెచ్‌ఆర్‌ఎక్స్ ఎడిషన్
ఎంఐ ట్రావెల్ బ్యాక్‌ప్యాక్(రూ.1,999)కు, ఎంఐ బ్యాండ్ హెచ్‌ఆర్‌ఎక్స్ ఎడిషన్(రూ.1,299) ఎంఐ బ్యాండ్ స్ట్రిప్ బ్లూ(రూ.199) రెండింటినీ రూ.1,398 అందించనున్నట్టు షియోమి తెలిపింది.

మరిన్ని వివరాలకు..
వీటితో పాటు ఇతర గ్యాడ్జెట్స్‌పై కూడా రాయితీని, కూపన్లను ఆఫర్ చేస్తుంది. మరిన్ని వివరాలకు షియోమి అఫిషియల్ వెబ్‌సైటు https://event.mi.com/in/mi4anniversary2018/mi-4-you లో సంప్రదించగలరు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470