ఆకట్టుకొనే డిజైన్, గూగుల్ టీవీ OS, డాల్బీ సపోర్టుతో 43 అంగుళాల ఫుల్ HD స్మార్ట్‌టీవీపై డిస్కౌంట్!
Xiaomi A Series 43 inch Smart Google TV : స్మార్ట్ టీవీలకు భారత్ అతి పెద్ద మార్కెట్ గా ఉంది. ప్రస్తుతం అనేక సంస్థలు బడ్జెట్ నుంచి ప్రీమియం ధర సెగ్మెంట్ వరకు వివిధ మోడల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం షియోమీ 43 అంగుళాల స్మార్ట్ టీవీ రూ.20 వేల కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉంది. షియోమీ A సిరీస్ 43 అంగుళాల ఫుల్ HD స్మార్ట్ గూగుల్ TV అనేక ఆకట్టుకొనే ఫీచర్లను కలిగి ఉంది.
బెజెల్ లెస్ డిజైన్ :
ఈ స్మార్ట్ టీవీ మెటల్ బెజెల్ లెస్ డిజైన్ ను కలిగి ఉంది. దీంతోపాటు Vivid పిక్చర్ ఇంజిన్ కారణంగా రంగులు చాలా నేచురల్‌గా కనిపిస్తాయి. డాల్బీ ఆడియో, HDR సపోర్టు వంటి ఫీచర్లు ఉన్నాయి. వాయిస్ కమాండ్ తో కూడిన స్మార్ట్ రిమోట్ ను కూడా కలిగి ఉంటుంది.

ధర, సేల్ వివరాలు :
షియోమీ A సిరీస్ 43 అంగుళాల స్మార్ట్ గూగుల్ టీవీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో రూ.19999 గా ఉంది. అయితే ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్టంగా రూ.1500 వరకు డిస్కౌంట్ ను పొందవచ్చు. EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
ఈ షియోమీ స్మార్ట్ టీవీ ఫుల్ HD LED (1920 x 1080 పిక్సల్స్) డిస్‌ప్లే ను కలిగి ఉంది. 60Hz రీఫ్రెష్ రేట్, 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్, HDR 10 సపోర్టును కలిగి ఉంది. 2025 స్మార్ట్‌టీవీ మోడల్ మెరుగైన విజువల్ అనుభూతిని అందిస్తుందని సంస్థ చెబుతోంది.
ఈ స్మార్ట్‌టీవీ A53 క్వాడ్ కోర్ ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌టీవీ 1GB ర్యామ్, 8GB వరకు స్టోరేజీని కలిగి ఉంది. గూగుల్ టీవీ OS పైన పనిచేస్తుంది. ఈ టీవీ ఇంటర్‌ఫేస్ చాలా సులభంగా ఉంటుంది. గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఎంతో ఉపయోగపడుతుంది.
ఇన్‌బిల్ట్ ఓటీటీ యాప్స్ :
ఈ స్మార్ట్ టీవీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ వంటి అనేక OTT యాప్స్‌ను సపోర్టు చేస్తుంది. ఈ యాప్స్ అన్నీ కూడా ఇన్‌బిల్ట్‌గా ఉంటాయి. దీంతోపాటు అనేక టీవీ ఛానళ్లను ఉచితంగా వీక్షించేందుకు అవకాశం ఉంటుంది.
20W స్పీకర్లు :
షియోమీ 43 అంగుళాల స్మార్ట్ టీవీ 2025 డాల్బీ ఆడియో, DTS X, DTS వర్చువల్ X సౌండ్ సపోర్టుతో 20W స్పీకర్లు ఉన్నాయి. ఈ కారణంగా స్పష్టమైన ఆడియో అనుభూతిని పొందుతారని సంస్థ చెబుతోంది.
కనెక్టివిటీ పరంగా ఈ షియోమీ 43 అంగుళాల ఫుల్ HD స్మార్ట్ గూగుల్ టీవీలో రెండు HDMI పోర్టులు, రెండు USB పోర్టులు సహా హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది. వైఫై, బ్లూటూత్ 5.0 ఫీచర్లను కలిగి ఉంది. గూగుల్ అసిస్టెంట్ బటన్‌తో కూడిన స్మార్ట్ రిమోట్ ఉంది. వాయిస్ కమాండ్‌తోనూ రిమోట్ పనిచేస్తుంది.


Click it and Unblock the Notifications








