వాట్సప్ సమస్య నిజమేనంటున్న Xiaomi, ఎర్రర్‌ సమస్యను ఇలా ఫిక్స్ చేసుకోమంటోంది !

Written By:

ఈ మధ్య వాట్సప్ షియోమి ఫోన్లలో పనిచేయడం లేదనే కథనాలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సమస్య ఎందుకు వచ్చిందో తెలియక చాలామంది అటు షియోమికి ఇటు వాట్సప్ సంస్థకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై వాట్సప్ వివరణ ఇస్తూ అది మా సమస్య కాదని షియోమి ఫోన్లలోనే ఆ సమస్య ఉందని తేల్చి చెప్పింది. దీంతో షియోమి రంగంలోకి దిగి ఆ సమస్య మీద స్పందించింది. ఎర్రర్ ఫిక్స్ చేశామని చెబుతోంది.

ఐఫోన్ యూజర్లకు వాట్సప్‌ సరికొత్త అప్‌డేట్, ఆండ్రాయిడ్ యూజర్లకు ఎప్పుడంటే ?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాట్సప్ ఎర్రర్ మెసేజ్‌ను తామే ఫిక్స్ చేశామని

తమ స్మార్ట్‌ఫోన్లలో వస్తున్న వాట్సప్ ఎర్రర్ మెసేజ్‌ను తామే ఫిక్స్ చేశామని షియోమీ తాజాగా వెల్లడించింది. షియోమీకి చెందిన పలువురు ఇంజినీర్లు ఎంఐ యాప్ స్టోర్‌లో వాట్సాప్ బీటా వెర్షన్ యాప్‌ను అప్‌లోడ్ చేశారని, అందువల్లే సమస్య వచ్చిందని షియోమీ తెలియజేసింది.

కొత్తగా వాట్సప్‌ను ఇన్‌స్టాల్ ..

అయితే ఇప్పటికే ఈ సమస్యను ఫిక్స్ చేశామని, దీంతో షియోమీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ఇకపై ఆ ఎర్రర్ మెసేజ్ రాదని, కాకపోతే వారు కొత్తగా వాట్సప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందని షియోమీ ప్రతినిధి ఒకరు చెప్పారు.

మీ ఫోన్లలో ఈ సమస్య ఉంటే..

మీ ఫోన్లలో ఈ సమస్య ఉంటే మీరు వెంటనే మీ ఫోన్లో ఉన్న వాట్సప్ తీసివేసి మళ్లీ ఫ్రెష్ గా డౌన్లోడ్ చేసుకోవాలని షియోమి చెబుతోంది. ఇందుకోసం Settings > enable automatic date and time > automatic time zone > kill all apps > relaunch WhatsApp ఉపయోగించమని చెబుతోంది.

7 నిమిషాల తరువాత వాట్సప్ మెసెజ్‌లను డిలీట్

ట్రిక్ ద్వారా 7 నిమిషాల తరువాత కూడా అవతలి వ్యక్తికి పంపిన వాట్సప్ మెసెజ్‌లను డిలీట్ చేసుకునే వీలుంటుంది. ఆ ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

స్టెప్ 1 :

ముందుగా మీ ఫోన్‌కు సంబంధించిన ఇంటర్నెట్ కనెక్షన్‌ను పూర్తిగా టర్నాఫ్ చేసుకోండి. ఆ తరువాత సెట్టింగ్స్ ప్యానల్‌లోకి వెళ్లండి.

స్టెప్ 2 :

సెట్టింగ్స్‌లోని యాప్స్ సెక్షన్‌లోకి వెళ్లి వాట్సప్‌ను సెలక్ట్ చేసుకుని Force Stop ఆప్షన్ పై టాప్ చేయండి.

స్టెప్ 3 :

పైన పేర్కొన్న ప్రాసెస్ విజయవంతంగా పూర్తి అయిన తరువాత మరొకసారి సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'ఆటోమెటిక్ డేట్ అండ్ టైమ్' అప్‌డేట్ ఆప్షన్‌ను డిసేబుల్ చేసుకోండి. 

Delete For Me', 'Delete For Everyone'

స్టెప్ 4 :
తదుపరి స్టెప్‌లో భాగంగా ఫోన్‌లోని టైమ్ అలానే డేట్‌ను వాట్సాప్ చాట్‌లో మెసేజ్‌ పంపిన సమయం అలానే తేదీకి మార్చుకోండి.
స్టెప్ 5 :
తేదీ అలానే సమాయాన్ని అడ్జస్ట్ చేసుకున్న తరువాత డిలీట్ చేయలనుకుంటోన్న మెసేజ్ పై కొద్ది సెకన్ల పాటు హోల్డ్ చేసిన ఉంచినట్లయితే డిలీట్ ఆప్షన్ డస్ట్‌బిన్ ఐకాన్‌లో మీకు కనిపిస్తుంది.
ఈ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే 'Delete For Me', 'Delete For Everyone' పేర్లతో రెండు ఆప్షన్‌లు మీకు కనిపిస్తాయి. అందులో 'Delete For Everyone' ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే మెసేజ్ పూర్తిగా డిలీట్ కాబడుతుంది. ఈ ప్రాసెస్ పూర్తయిన తరువాత ఫోన్ డేట్ అలానే టైమ్ సెట్టింగ్‌ను సాధారణ స్థితికి తీసుకువచ్చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi accepts WhatsApp obsolete error, issues fix More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot