Home
News

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, Mi సేల్‌.. Xiaomi, Redmi ఉత్పత్తులపై భారీ ఆఫర్లు..!

పండుగ సీజన్‌ కోసం Xiaomi తన ఉత్పత్తులను సిద్ధం చేస్తోంది. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు సహా ఇతర ఉత్పత్తులపై ఉత్తమ ఆఫర్లను ప్రకటించింది. Diwali With Mi సేల్‌, అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌, ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్‌ డేస్‌ సేల్‌ మరియు Mi వెబ్‌సైట్‌లో నడవనుంది. అక్టోబర్‌ 8 నుంచి ఈ సేల్‌లు ప్రారంభం కానుండగా.. ప్రైమ్‌, ఫ్లస్‌ మెంబర్లు ముందుగానే సేల్‌లో పాల్గొనవచ్చు.

ఈ సేల్‌లో భాగంగా షియోమీ, రెడ్‌మీ (Redmi) స్మార్ట్‌ఫోన్లపై 45 శాతం వరకు తగ్గింపును అందించనుంది. దీంతోపాటు మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. స్మార్ట్‌హోం పరికరాలపై 65 శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు ప్రకటన చేసింది. షియోమీ, రెడ్‌మీ స్మార్ట్‌టీవీలపై 60 శాతం వరకు డిస్కౌంట్‌ పొందవచ్చని పేర్కొంది.

Xiaomi and Redmi offers great deals on his products

Redmi Note 12 5G : ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈ సంవత్సరం జనవరిలో విడుదల చేసింది. ఈ ఫోన్‌ 6.67 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. విడుదల సమయంలో ఈ ఫోన్‌ 6GB ర్యామ్‌, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ రూ.19,999గా ఉంది.

అయితే ఈ ఫోన్‌పై షియోమీ భారీ డిస్కౌంట్ ప్రకటన చేసింది. ఫలితంగా త్వరలో ప్రారంభం కానున్న సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ను కేవలం రూ.13,749కే సొంతం చేసుకోవచ్చు. రెడ్‌మీ నోట్‌ 12 5G స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది.

ఇందులో 48MP ప్రధాన కెమెరా, 8MP ఆల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరాలతో వస్తుంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ ఫోన్‌ 13MP కెమెరా ఉంటుంది. ఈ ఫోన్‌ క్కాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 1 SoC ‌ప్రాసెసర్‌ను కలిగి ఉంది. దీంతోపాటు 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని ప్యాక్‌ను కలిగి ఉంటుంది.

Redmi Note 12 Pro 5G త్వరలో ప్రారంభం కానున్న అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ సేల్‌లో ఈ ఫోన్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ సంవత్సరం జనవరిలోనే ఈ ఫోన్ విడుదల అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.17999కే కొనుగోలు చేయవచ్చు.

ఈ ఫోన్‌ ఆక్టా కోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 1080 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. మరియు 6.67 అంగుళాల పుల్‌ HD అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్‌ వెనుకవైపు 50MP ప్రైమరీ కెమెరా, 8MP ఆల్ట్రావైడ్‌ యాంగిల్‌ సెన్సార్‌, 2MP మాక్రో సెన్సార్‌ను కలిగి ఉంటుంది. 16MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.

Redmi Buds 4 Active TWS ఈ సంవత్సరం జూన్‌లో విడుదల అయ్యాయి. విడుదల సమయంలో ఈ రెడ్‌మీ బడ్స్ 4 యాక్టివ్‌ బడ్స్‌ ధర రూ.2999గా ఉండేది. ఈ సేల్‌లో భాగంగా కేవలం రూ.899కే సొంతం చేసుకోవచ్చు. ఈ బడ్స్‌ ENC - ఎన్విరాన్‌మెంటల్ నాయిస్‌ క్యాన్సిలేషన్ ఫీచర్‌ను కలిగి ఉంటాయి. బ్లాక్‌, వైట్‌ రంగుల్లో లభిస్తాయి. సింగిల్ ఛార్జింగ్‌పై 30 గంటల ప్లేబ్యాక్‌ టైంను కలిగి ఉంటాయి.

Redmi Smart Fire TV : రెడ్‌మీ 43 అంగుళాల స్మార్ట్‌ ఫైర్‌ టీవీ ఈ సేల్‌లో భాగంగా భారీ తగ్గింపును పొందుతుంది. 60Hz రీఫ్రెష్‌ రేట్‌తో 4K డిస్‌ప్లేను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ టీవీ Mali G52 MC1 GPUతోపాటు క్వాడ్‌ కోర్‌ A55 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

ఈ టీవీ డాల్బీ ఆడియో DTS వర్చువల్ X, DTS HD టెక్నాలజీతో 24W స్పీకర్లను కలిగి ఉంటుంది. ఈ టీవీ విడుదల సమయంలో ధర రూ.42,999గా ఉంది. సేల్‌లో భాగంగా కేవలం రూ.19.999కే సొంతం చేసుకోవచ్చు. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, MI సేల్‌లో కొనుగోలు చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Great deals on Xiaomi Redmi and Mi Products amazon Flipkart and MI sale 2023 October
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X