Home
News

షియోమీ 9వ వార్షికోత్సవ సేల్! ఫోన్లు, టీవీలు, గాడ్జెట్ లపై భారీ ఆఫర్లు

By Maheswara

షియోమీ సంస్థ భారతదేశంలో తన తొమ్మిదవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ వేడుకల్లో భాగంగా, 'Xiaomi టర్న్స్ 9' వార్షికోత్సవ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ యొక్క ఆరు రోజుల వ్యవధి జూలై 5 అంటే ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. మరియు జూలై 10 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో ఫోన్‌లు, టీవీలు మరియు స్మార్ట్ హోమ్ పరికరాలతో సహా ఎంపిక చేసిన ఉత్పత్తులపై 75% వరకు తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

షియోమీ యొక్క 'Xiaomi టర్న్స్ 9' సేల్ కొనుగోలుదారులకు కొన్ని యాడ్-ఆన్ బోనస్‌ ఆఫర్లను కూడా అందిస్తుంది. ఈ సేల్ లో 'లక్కీ 9 షాపర్స్ కాంటెస్ట్' కూడా ఉంది, ఇందులో తొమ్మిది మంది వినియోగదారులు తమ ఆర్డర్ విలువలో 100% తిరిగి పొందుతారు అంటే వీరు వారు ఆర్డర్ చేసిన వస్తువులు ఉచితంగా పొందవచ్చు.

Xiaomi Anniversary Sale Offers: Huge Discount Offers Upto 75% On Smartphones, Tvs And Other Gadgets

ఇంకా, 'రోజువారీ రూ. 9 స్టోర్' కూడా ఒక గంట పాటు మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది, ఇందులో వినియోగదారులు ఎంపిక చేసిన పరికరాలపై ఆఫర్‌లను పొందగలరు. సేల్ లో భాగంగా, Xiaomi Mi ఎక్స్‌టెండెడ్ వారంటీ, Mi స్క్రీన్ ప్రొటెక్ట్ మరియు Mi కంప్లీట్ ప్రొటెక్ట్ వంటి అన్ని డివైస్ కేర్ ప్లాన్‌లపై ఫ్లాట్ 25% తగ్గింపును కూడా అందిస్తోంది. అదనంగా, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు మరియు క్రెడిట్ EMI కూడా రూ. 8000 వరకు అదనపు తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఆఫర్ల వివరాలు.

షియోమీ 13 ప్రో ఫోన్ పై రూ. 20,000 తగ్గింపు ఆఫర్
షియోమీ భారతదేశంలో తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ షియోమీ 13 ప్రో ని రూ. 89,999కి విడుదల చేసింది. అయితే, ప్రస్తుతం ఈ ఫోన్ పై రూ. 20,000 ఫ్లాట్ తగ్గింపు తర్వాత స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు రూ. 69,999 కి అందుబాటులో ఉంది.

షియోమీ 12 ప్రో ఫోన్ పై రూ. 39,999 తగ్గింపు ఆఫర్
షియోమీ 12 ప్రో అనేది కంపెనీ యొక్క 2022 ఫ్లాగ్‌షిప్ ఫోన్, ఇది రూ. 39,999 తగ్గింపు తర్వాత రూ. 40,000 కి అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.79,999 ధరకు ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది.

రెడ్ మీ నోట్ 12 ప్రో 5G ఫోన్ పై రూ. 7,500 తగ్గింపు ఆఫర్
రెడ్ మీ నోట్ 12 ప్రో 5G ఈ ఏడాది ప్రారంభంలో రూ. 27,999కి లాంచ్ చేయబడింది. ప్రస్తుతం ఈ సేల్ సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 20,499కి అందుబాటులో ఉంది.

షియోమీ స్మార్ట్ టీవీ X ప్రో 43 టీవీ పై రూ. 18,500 తగ్గింపు ఆఫర్
షియోమీ స్మార్ట్ టీవీ X ప్రో 43 టీవీ రూ. 49,999 వద్ద లాంచ్ చేయబడింది. అయితే, ప్రస్తుతం ఇప్పుడు ఈ టీవీ పై రూ. 18,500 ఫ్లాట్ తగ్గింపు తర్వాత రూ. 31,499 వద్ద కొనుగోలు చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Xiaomi Anniversary Sale Offers: Huge Discount Offers Upto 75% On Smartphones, Tvs And Other Gadgets
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X