ఇండియాలో 3 తయారీ యూనిట్లను ఏర్పాటు చేయనున్న షియోమీ

Posted By: M KRISHNA ADITHYA

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమి భారత్ లో మరో 3 తయారీ యూనిట్లను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. మొదటి సారిగా సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ ప్లాంట్, అలాగే పీసీబీఏ ( ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ ) యూనిట్లను తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో ఏర్పాటు చేయనున్నారు. ఫాక్స్ కాన్ ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్నారు. అంతర్జాతీయంగా షియోమీ బ్రాండ్ నాణ్యమైన, సమర్థవంతమైన ఉత్పత్తులకు అడ్రస్ గా నిలిచింది. ముఖ్యంగా డిజైనింగ్ విషయంలో ఉన్నత నాణ్యతా ప్రమాణాలు పాటిస్తోంది. ఇండియన్ స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో షియోమీ ఇప్పటికే ఒక సంచలనంగా మారింది. 2015 నుంచి భారత్ లో తన కార్యకలాపాలు ప్రారంభించిన షియోమీ, ప్రస్తుతం మేకిన్ ఇండియాలో భాగంగా పలు తయారీ యూనిట్లను స్థాపనకు నడుం బిగించినట్లు షియోమీ గ్లోబల్, వైస్ ప్రెసిడెంట్ మను జైన్ తెలిపారు.

ఇండియాలో 3 తయారీ యూనిట్లను ఏర్పాటు చేయనున్న షియోమీ

"ఈ రోజు మేము ఎంతో నమ్మకంతో మూడు స్మార్ట్ ఫోన్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం. అందులో మొదటి సారిగా ఎస్ఎంటీ ప్లాంట్‌తో పాటు పీసీబీఏ యూనిట్లు ఉన్నాయి. పీసీబీఏ లోకల్ అసెంబ్లీని చేపట్టిన తొలి సంస్థగా ఇండియాలో షియోమీ పేరు గాంచింది" అని జైన్ తెలిపారు. ఇండియాలో తయారీ రంగం వాతావరణంపై షియోమీ ఏర్పాటు చేసిన సప్లయిర్ ఇన్వెస్ట్ మెంట్ సదస్సులో ఈ కొత్త తయారీ యూనిట్ల స్థాపనను ప్రకటించింది. ఈ సదస్సులో పాల్గొనేందుకు 50 గ్లోబల్ స్మార్ట్ ఫోన్ కాంపోనెంట్ సప్లయింగ్ కంపెనీలు వచ్చాయి. స్థానికంగా తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నట్లు సదస్సులో తెలిపారు. ఇండియాలో సప్లయర్స్ తమ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఏర్పడనున్నాయి.

164 జిబి డేటాతో ఎయిర్‌టెల్ మరో సరికొత్త ప్లాన్

అంతేకాదు సుమారు 15000 కోట్ల రూపాయల పెట్టుబడితో పాటు, సుమారు 50 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉన్నట్లు షియోమీ ఇండియా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సదస్సులో నితి ఆయోగ్ సీఈవో అబితాబ్ కాంత్, డీఐపీపీ సెక్రటరీ రమేష్ అభిషేక్, ఇన్వెస్ట్ ఇండియా సీఈవో దీపక్ బగ్లా పాల్గొన్నారు.

ఈ మూడు నూతన తయారీ యూనిట్లను ఫాక్స్‌కాన్ భాగస్వామ్యంతో నిర్మించనున్నారు. ఏపీలోని శ్రీ సిటీ క్యాంపస్ లోనూ, అలాగే తమిళనాడు శ్రీ పెరుంబుదూరు క్యాంపస్ లో ఈ తయారీ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. తమిళనాడు లోని యూనిట్ మొత్తం 180 ఎకరాల్లో విస్తరించి ఉండగా, ఇక్కడ ఫాక్స్‌కాన్ ద్వారా 10 వేల మందికి ఉపాధి లభించనుంది. అయితే ఉపాధి అందుకునే వారిలో 95 శాతం మంది మహిళలకు ప్రాతినిధ్యం ఇచ్చేందుకు కంపెనీ తీర్మానించడం గమనార్హం. కొత్త యూనిట్లతో అటు ప్రతీ ఒక సెకనుకి రెండు స్మార్ట్ ఫోన్లు తయారీ చేయగల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నారు. ఎస్ఎంటీ ప్లాంట్ ఏర్పాటుతో షియోమీ దేశంలోనే తొలి పీసీబీఏ అసెంబ్లీ యూనిట్ ను స్థాపించిన సంస్థగా పేరుగాంచింది. పీసీబీఏ అంటే మొత్తం ఫోన్ లో 50 శాతం విలువ కలిగి ఉంటుంది. అంతటి ప్రాముఖ్యత కలిగిన తయారీ యూనిట్లను షియోమీ ఏర్పాటు చేయనుంది.

English summary
Xiaomi announces 3 smartphone plants in India More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot