Home
News

జనవరి 28న మార్కెట్లోకి షియోమీ ఎంఐ 4

జనవరి 28న మార్కెట్లోకి  షియోమీ ఎంఐ 4

గతేడాది ఎంఐ 3 స్మార్ట్‌ఫోన్‌‍తో భారత్‌లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన చైనా ఫోన్‌ల కంపెనీ షియోమీ ఈ ఏడాదికిగాను ఎంఐ 4 ఫోన్‌తో పాటు ఎంఐ నోట్, ఎంఐ నోట్ ప్రో ఫోన్‌లను అంతర్జాతీయ మార్కెట్లో ప్రదర్శించింది. ఎంఐ 3 మోడల్‌కు సక్సెసర్ వర్షన్‌గా విడుదలైన ‘ఎంఐ 4' ను ఈ నెలాఖరు నాటికి భారత్‌లో విడుదల చేస్తామని, ఫిబ్రవరి నుంచి మార్కెట్లో లభ్యమవుతుందని షియోమీ ఇండియా హెడ్ మను జెయిన్ ఇటీవల వెల్లడించారు. తాజాగా వెల్లడవుతోన్న వివరాల మేరకు షియోమీ ఎంఐ4 ఈ నెల 28న మార్కెట్లో విడుదలవుతుంది. ఫిబ్రవరి 3 నుంచి మార్కెట్లో లభ్యమవుతుంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

షియోమీ ఎంఐ 4 కీలక స్పెసిఫికేషన్‌లు:

5 అంగుళాల డిస్‌ప్లే,
2.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
మెమరీ వేరియంట్స్ 16జీబి, 32జీబి,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3080 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

షియోమీ ఎంఐ 4 ఫోన్‌లను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది. ఫోన్ ధర అంచనా రూ.17,000 నుంచి రూ.20,000 మధ్య ఉండొచ్చు..

Best Mobiles in India

English summary
Xiaomi announces India launch date of Mi 4. Read more in Telugu Gizbot.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X