Home
News

Huawei P30 Pro అవసరమా,దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చిన షియోమి

చైనా మొబైల్ మేకర్ షియోమి మరో చైనా కంపెనీ హువాయికి అదిరిపోయే ఝలక్ ఇచ్చింది. ఫేస్ బుక్ వేదికగా ఆ కంపెనీకి దిమ్మతిరిగే షాకిచ్చింది. సోషల్ మీడియా అయిన ఫేస్ బుక్ లో షియోమి హువాయి లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ల

చైనా మొబైల్ మేకర్ షియోమి మరో చైనా కంపెనీ హువాయికి అదిరిపోయే ఝలక్ ఇచ్చింది. ఫేస్ బుక్ వేదికగా ఆ కంపెనీకి దిమ్మతిరిగే షాకిచ్చింది. సోషల్ మీడియా అయిన ఫేస్ బుక్ లో షియోమి హువాయి లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్లు అయిన హువాయి పి 30 సీరిస్ ఫోన్ల మీద ఓ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ లో షియోమి హువాయి ఫోన్లను పోస్టు ఈ ఫోన్లు మనకు నిజంగా అవసరమా అంటూ క్వశ్చన్ మార్క్ తో కూడిన కంటెంట్ పెట్టింది.

 Huawei P30 Pro అవసరమా,దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చిన షియోమి

కాగా లైవ్ ఈవెంట్ జరుగుతున్న సమయంలో కంపెనీ ఈ పోస్టు చేయడంతో దాన్నివినియోగదారులు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు.అయితే షియోమి కంపెనీకి ఇవేమి కొత్త కాదు గతంలో కూడా ఆపిల్ శాంసంగ్ ఫోన్లపై ఇదే రకంగా పోస్టులు పెట్టింది.

Is this really necessary?

Is this really necessary?

షియోమి తన అధికారిక ఫేస్ బుక్ పేజీలో హువాయి ఫోన్లను పెట్టి Is this really necessary? అంటూ టెక్ట్ప్ ఉంచింది. దాని తర్వాత ఈ ఫోన్లకు ధీటుగా షియోమి ఎంఐ9ను మీరు అత్యంత తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చంటూ పోస్ట్ పెట్టింది.

హువాయి పి30, పి30 ప్రొ ఫీచ‌ర్లు

హువాయి పి30, పి30 ప్రొ ఫీచ‌ర్లు

హువాయి కంపెనీ తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్లు హువాయి పి30, పి30 ప్రొలను మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఫోన్ల ఫీచర్లను ఓ సారి పరిశీలిస్తే..

హువావే పీ30 ఫీచ‌ర్లు

6.1 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఓలెడ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూషన్‌, హువావే కైరిన్ 980 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 40, 16, 8 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ సిమ్‌, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐపీ 53 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3650 ఎంఏహెచ్ బ్యాట‌రీ, సూప‌ర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్‌.

స్మార్ట్‌ఫోన్ పీ30 ప్రొ ను రూ.77,820 ప్రారంభ ధ‌ర‌కు కొనుగోలు చేయవచ్చు.

హువావే పీ30 ప్రొ ఫీచ‌ర్లు

హువావే పీ30 ప్రొ ఫీచ‌ర్లు

6.47 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఓలెడ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, హువావే కైరిన్ 980 ప్రాసెస‌ర్‌, 8 జీబీ ర్యామ్‌, 128/256/512 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 40, 20, 8 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ సిమ్‌, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4200 ఎంఏహెచ్ బ్యాట‌రీ, సూప‌ర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్‌.

పీ30 ఫోన్ రూ.62,240 ధరకు కొనుగోలు చేయవచ్చు.

 

షియోమి ఎంఐ9

షియోమి ఎంఐ9

గత నెలలో షియోమి కంపెనీ ఎంఐ9ని స్పెయిన్‌లోని బార్సిలోనాలో జ‌రుగుతున్న మొబైల్ వ‌ర‌ల్డ్ కాంగ్రెస్ (ఎండ‌బ్ల్యూసీ) 2019 ప్ర‌దర్శ‌న‌లో ప్ర‌ద‌ర్శించింది

షియోమీ ఎంఐ9 ఫీచ‌ర్లు

6.39 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 × 2280 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 16, 12 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌.

 

  షియోమి ఎంఐ9 ధ‌ర‌

షియోమి ఎంఐ9 ధ‌ర‌

షియోమీ ఎంఐ 9 స్మార్ట్‌ఫోన్ ఓషియ‌ల్ బ్లూ, లావెండ‌ర్ వ‌యొలెట్‌, పియానో బ్లాక్ క‌లర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల కాగా ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.36,170 గా ఉంది. అలాగే 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.40,200గా నిర్ణ‌యించారు.

Best Mobiles in India

English summary
Xiaomi back to 'trolling', this time it’s Huawei P30 Pro
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X