ఇండియాలో మే 27 న రిలీజ్ అవుతున్న Xiaomi బ్లాక్ షార్క్2 గేమింగ్ ఫోన్
బ్లాక్ షార్క్2 చివరకు ఇండియాలో ప్రారంభమవుతుంది. బ్లాక్ షార్క్ ను గేమింగ్ స్మార్ట్ ఫోన్లను దృష్టిలో పెట్టుకొని Xiaomi తయారుచేసింది.
బ్లాక్ షార్క్2 చివరకు ఇండియాలో ప్రారంభమవుతుంది. బ్లాక్ షార్క్ ను గేమింగ్ స్మార్ట్ ఫోన్లను దృష్టిలో పెట్టుకొని Xiaomi తయారుచేసింది. ఇది చైనాలో గత ఏడాది మొదటి డివైస్ ని మరియు ఈ సంవత్సరం బ్లాక్ షార్క్ 2 ను ప్రారంభించింది. ఈ సంస్థ ఇటీవలే ఇండియాలో తన ప్రధాన కార్యాలయాన్ని నిర్మించనున్నట్లు తెలిపింది.కొత్త బ్లాక్ షార్క్ 2 ఇండియాలో మే 27 న ప్రారంభించనున్నట్లు తెలిపింది.

స్పెసిఫికేషన్స్ :
బ్లాక్ షార్క్ 2 మొబైల్ 6.39-inch OLED డిస్ప్లేను కలిగి ఉండడంతో పాటు ఫింగర్ ప్రింట్ స్కానర్ ను కూడా పొందుపరచి ఉంటుంది. ఇది ఆకుపచ్చ మరియు నింటెండో స్విచ్ మాదిరిగా రెండు కంట్రోలర్లు అటాచ్ చేయడానికి అనుమతించే ఒక ప్రత్యేక అద్భుతమైన డిజైన్ తో వస్తుంది.ఇది 12GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజీ తో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 855 చిప్సెట్ హ్యాండ్సెట్ తో నడుస్తుంది. వెనుకవైపు 48-మెగాపిక్సెల్ మరియు 12-మెగాపిక్సెల్ కెమెరా జతగా మరియు సెల్ఫీస్ కోసం ముందు వైపు 20-మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది 27W వేగవంతమైన ఛార్జింగ్ మద్దతుతో 4,000 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

ధరలు :
చైనాలో 6GB RAM + 128GB వేరియంట్ కోసం CNY 3,200 (సుమారు రూ .33,000)లు మరియు 12GB RAM + 256GB మోడల్ ధర CNY 4,200 (రూ 42,500)లుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








