Xiaomi బ్రాండ్ నుంచి కొత్తగా ఫ్లాగ్‌షిప్‌ ఫోన్ రానున్నది!! ఐఫోన్ 13 సిరీస్ లకు పోటీగా

|

ఇండియాలో స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో చైనా యొక్క స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షియోమి టాప్ స్థానంలో కొనసాగుతున్నది. ప్రస్తుతం భారతదేశంలో షియోమి బ్రాండ్ యొక్క టాప్-ఆఫ్-ది-లైన్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌గా షియోమి12 ప్రో అందుబాటులో ఉంది. దీని యొక్క ధర రూ.60,000 కంటే అధికంగా ఉండడంతో చాలా మందికి ఇది ఖరీదైన ఫోన్‌గా అనిపిస్తుంది. కానీ షియోమి కంపెనీ మరో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ సంవత్సరం షియోమి కంపెనీ నుండి రాబోయే అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌గా కొత్త దానిని డిజైన్ చేయనున్నది.

షియోమి

ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇప్పటికే కలిగి ఉన్న షియోమి Mi 11 అల్ట్రా యొక్క అప్ డేట్ గా షియోమి 12 అల్ట్రా పేరుతో రానున్నది. ఇది మొదటగా చైనా మార్కెట్లో లాంచ్ కానున్నది. ఇది ఇప్పటికే చైనా యొక్క 3C అథారిటీ నుండి ధృవీకరణను పొందింది. ఇది డివైస్ కి సంబందించిన కొన్ని బహుళ ఫీచర్లను నిర్ధారించింది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మారుమూల ప్రాంతాలలో కూడా ఫుల్ సిగ్నల్!! 4G నెట్‌వర్క్‌తో జియో వినూత్న ప్రయత్నం...మారుమూల ప్రాంతాలలో కూడా ఫుల్ సిగ్నల్!! 4G నెట్‌వర్క్‌తో జియో వినూత్న ప్రయత్నం...

షియోమి 12 అల్ట్రా ఫోన్‌లో క్వాల్‌కామ్ తాజా ఫ్లాగ్‌షిప్ చిప్

షియోమి 12 అల్ట్రా ఫోన్‌లో క్వాల్‌కామ్ తాజా ఫ్లాగ్‌షిప్ చిప్

షియోమి కంపెనీ నుంచి రాబోయే షియోమి 12 అల్ట్రా కొత్త ఫోన్ క్వాల్‌కామ్ సంస్థ యొక్క తాజా ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్ - క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen1తో రాబోతోంది. అలాగే షియోమి Mi 11 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ లో గల 67W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో రానున్నట్లు ధృవీకరించింది. షియోమి కంపెనీ ద్వారా ఈ వివరాలు ఏవీ ఇంకా ధృవీకరించబడలేదని గమనించండి. కానీ మోడల్ నంబర్ 2203121Cతో ఉన్న 3C లిస్టింగ్ షియోమి 12 అల్ట్రా తప్ప మరొకటి కాదని గుర్తుంచుకోండి. ఈ ఫోన్ ఖచ్చితంగా శక్తివంతమైన పెద్ద డిస్ప్లేని కలిగి ఉంటుంది. మార్కెట్లోని ఇతర ఫ్లాగ్‌షిప్‌లతో పోటీ పడటానికి రాబోతున్న కారణంగా కెమెరా విభాగంలో కూడా ఇది వినియోగదారులకు ప్రత్యేకమైన అనుభవాన్ని అందించడానికి రోపొందించనున్నది.

iQOO 10 సిరీస్ ఫోన్ లాంచ్ వివరాలు లీక్ ! 200W ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తోంది.iQOO 10 సిరీస్ ఫోన్ లాంచ్ వివరాలు లీక్ ! 200W ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తోంది.

గ్లోబల్ మార్కెట్‌

షియోమి చాలా పరిమిత సంఖ్యలో షియోమి Mi 11 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లను భారతదేశంలో అలాగే గ్లోబల్ మార్కెట్‌లో నిలిపివేయడానికి ముందు విక్రయించింది. షియోమి యొక్క అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లకు గల అధిక డిమాండ్ దృష్ట్యా వాటిని అధిక సంఖ్యలో విడుదల చేసే అవకాశం ఉంది. కంపెనీ షియోమి 12 అల్ట్రాతో పరిమిత సంఖ్యల తయారీ విధానాన్ని మార్చవచ్చు. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఐఫోన్ 13, వివో X80 మరియు శామ్‌సంగ్ గెలాక్సీ S22 వంటి ఫోన్ లను కొనుగోలు చేయడానికి ఇష్టపడే వినియోగదారులకు ఇది ప్రత్యామ్నాయంగా మారే జోన్‌లో లభించే అవకాశం ఉంది. దీని యొక్క ధర కూడా వాటి యొక్క బడ్జెట్ పరిధిలోనే లభించే అవకాశం ఉంది. ప్రీమియం సెగ్మెంట్ పరికరాలను విక్రయించే విషయానికి వస్తే ఆపిల్ మరియు శామ్‌సంగ్ సులభంగా అధిక బ్రాండ్ రీకాల్‌ను కలిగి ఉంటాయి.

Best Mobiles in India

English summary
Xiaomi Brand Plan to Launch New Flagship Smartphone to Compete With iPhone 13

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X