Home
News

షియోమీ బడ్స్ 5 ప్రో లాంచ్.. డ్యూయల్ యాంప్లిఫైయర్, ట్రిపుల్ డ్రైవర్లతో సౌండ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్..

Xiaomi Buds 5 Pro: షియోమీ తమ సరికొత్త ప్రీమియం వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ షియోమీ బడ్స్ 5 ప్రోని మార్కెట్లోకి దించేసింది. అది కూడా షియోమీ 15 అల్ట్రా ఫోన్‌తో పాటే రావడం విశేషం. ఈ బడ్స్‌లో మొదటిసారి వై-ఫై ఆడియో ట్రాన్స్‌మిషన్ ఫీచర్ ఇచ్చారు. దీంతో 4.2Mbps స్పీడ్‌తో పాటలు వినొచ్చు. అంతేకాదు, 2.1Mbps ట్రాన్స్‌మిషన్ రేటుతో aptX లాస్‌లెస్ టెక్నాలజీ సపోర్ట్ కూడా ఉంది. అంటే సౌండ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది.

AI ఫీచర్లు, హై-రిజల్యూషన్ ఆడియో, అడ్వాన్స్‌డ్ నాయిస్ క్యాన్సిలేషన్ వంటి ఫీచర్లతో ఈ ఇయర్‌బడ్స్ ఆడియోఫైల్స్‌నే కాదు, రెగ్యులర్ యూజర్స్‌ను కూడా ఫిదా చేస్తాయి. షియోమీ బడ్స్ 5 ప్రోలో డ్యూయల్ యాంప్లిఫైయర్ సిస్టమ్‌తో పాటు మూడు డ్రైవర్లు ఉన్నాయి. దీంతో మీరు పాటలు వింటుంటే వేరే లోకంలోకి వెళ్లిపోతారు.

Xiaomi Buds 5 Pro Announced with Dual-Amplifier  Triple Drivers  amp amp  55dB ANC

* డీప్ బాస్ కోసం..

11mm టైటానియం-ప్లేటెడ్ వూఫర్‌ను, క్రిస్టల్ క్లియర్ హై నోట్స్ కోసం 10mm సెరామిక్ ట్వీటర్‌ను వాడారు. షియోమీ ఈ ఇయర్‌బడ్స్‌ను హార్మన్ గోల్డెన్ ఇయర్ టీమ్ సహాయంతో ట్యూన్ చేసింది. ఇందులో \"మాస్టర్ హార్మన్\" సౌండ్ మోడ్‌తో పాటు నాలుగు ప్రీసెట్ EQ మోడ్లు కూడా ఉన్నాయి. టేస్ట్‌కు తగ్గట్టు సౌండ్ మార్చుకోవచ్చు.

* అడ్వాన్స్‌డ్ నాయిస్ క్యాన్సిలేషన్ & AI ఫీచర్లు

షియోమీ బడ్స్ 5 ప్రోలో 55dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఉంది. రద్దీ ప్రదేశాల్లో ఉన్నా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్‌గా మ్యూజిక్ వినొచ్చు. ఇందులో మూడు మైక్రోఫోన్ల సిస్టమ్ ఉంది. ఇది గంటకు 15 మీటర్ల వేగంతో వీచే గాలి శబ్దాన్ని కూడా తగ్గిస్తుంది.

కాల్స్ మాట్లాడుతున్నప్పుడు 100dB అల్ట్రా-క్లియర్ నాయిస్ రిడక్షన్‌తో అవతలి వ్యక్తికి మీ వాయిస్ చాలా క్లియర్‌గా వినిపిస్తుంది. AI ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో రియల్-టైమ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ ఉంది. దీంతో మీరు వేరే భాషలు మాట్లాడేవాళ్లతో కూడా ఈజీగా మాట్లాడేయొచ్చు. వాయిస్-టు-టెక్స్ట్ సమ్మరీ ఫంక్షన్ కూడా ఉంది.

* ముఖ్యమైన ఫీచర్లు

షియోమీ బడ్స్ 5 ప్రో బ్లూటూత్ 5.4 కనెక్టివిటీతో వస్తుంది. ఇందులో 11mm టైటానియం-ప్లేటెడ్ వూఫర్, 10mm సెరామిక్ ట్వీటర్‌తో కూడిన ఆడియో సెటప్‌ ఉంది. ఆడియో కోడెక్‌ల విషయానికి వస్తే, AAC, SBC, aptX లాస్‌లెస్, aptX అడాప్టివ్ LC3, aptX అడాప్టివ్ 4.2M (వై-ఫై వెర్షన్) వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది.

అలాగే, ఈ ఇయర్‌బడ్స్ హై-రిజల్యూషన్ సర్టిఫైడ్, 48kHz/24bit హై-క్వాలిటీ మ్యూజిక్‌కు సపోర్ట్ చేస్తాయి. ఇండిపెండెంట్ హెడ్-ట్రాకింగ్ స్పేషియల్ ఆడియో ఫీచర్ కూడా ఉంది. ఇవి IP54 రేటింగ్ కలిగి ఉన్నాయి. కంట్రోల్స్ కోసం టచ్ కంట్రోల్స్, ఆన్-ఇయర్ డిటెక్షన్ ఉన్నాయి. ఒక్కో ఇయర్‌బడ్ 5.6 గ్రాముల బరువు ఉంటుంది, ఛార్జింగ్ కేస్ 53 గ్రాములు.

* బ్యాటరీ..

బ్లూటూత్ వెర్షన్ 53mAh ఇయర్‌బడ్స్, 570mAh కేస్‌తో వస్తుంది, ఇది 8 గంటల ప్లేబ్యాక్, కేస్‌తో కలిపి 40 గంటల వరకు అందిస్తుంది. వై-ఫై వెర్షన్ 64mAh ఇయర్‌బడ్స్, 570mAh కేస్‌తో 10 గంటల ప్లేబ్యాక్, కేస్‌తో కలిపి 40 గంటల వరకు ప్లేబ్యాక్ టైమ్ ఇస్తుంది. ఛార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్ ఉంటుంది.

* ధర, అందుబాటు

షియోమీ బడ్స్ 5 ప్రో మూడు కలర్స్‌లో వస్తున్నాయి. స్నో మౌంటెన్ వైట్, టైటానియం గోల్డ్, ఇంకా మిరాజ్ బ్లాక్ (వై-ఫై వెర్షన్). చైనాలో వీటి ధరలు ఇలా ఉన్నాయి. వై-ఫై వెర్షన్ 1499 యువాన్లు (దాదాపు రూ.17,990), బ్లూటూత్ వెర్షన్ 1299 యువాన్లు (దాదాపు రూ.15,590) ఈ ఇయర్‌బడ్స్ చైనాలో mi.com ద్వారా అమ్మకానికి కూడా వచ్చేసాయి. గ్లోబల్ మార్కెట్‌లో ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Xiaomi Buds 5 Pro: premium wireless earbuds with dual-amplifier, triple drivers, 55dB ANC, Hi-Res audio, spatial sound, and optional Wi-Fi. Launched in China, global availability pending.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X