Home
News

Xiaomi ఫోల్డబుల్ ఫోన్ రాక త్వరలోనే!! గెలాక్సీ ఫోల్డబుల్ ‌ఫోన్‌కు పోటీగా....

ఇండియాలోని ప్రతి నెల విడుదల అవుతున్న స్మార్ట్‌ఫోన్‌లలో షియోమి సంస్థకు చెందిన ఫోన్‌లకు ప్రత్యేక డిమాండ్ ఉంది. ఈ సంస్థ కొత్త తరం ఫోన్లను విడుదల చేయడంలో మిగిలిన వారితో పోలిస్తే కొద్దిగా వెనుకబడి ఉంది అని చెప్పవచ్చు. బడ్జెట్ ధరలో ఫోన్‌లను విడుదల చేసే ఈ సంస్థ ఇప్పుడు కొత్తగా మిగిలిన బ్రాండ్ ఫోన్‌లకు పోటీగా తన ఫోల్డబుల్ ఫోన్‌ మీద పనిచేస్తోంది. 108 మెగాపిక్సెల్ కెమెరా ఫీచర్లతో రాబోయే షియోమి ఫోల్డబుల్ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

షియోమి ఫోల్డబుల్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ ఫీచర్స్

షియోమి ఫోల్డబుల్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ ఫీచర్స్

షియోమి యొక్క ఫోల్డబుల్ ఫోన్ వచ్చే ఏడాది ప్రారంభంలోనే విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. లీక్ అయిన ఈ ఫోన్ యొక్క వివరాల విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 11-ఆధారిత MIUI వెర్షన్‌లో రానున్నట్లు సమాచారం. MIUI యొక్క పబ్లిక్ రోల్ అవుట్ ఇప్పటికీ ఆండ్రాయిడ్10 సంస్కరణకు పరిమితం అయినందున పరికరాన్ని త్వరలో ప్రకటించవచ్చు. ఇది స్నాప్‌డ్రాగన్ 800 చిప్‌సెట్‌లలో 865+ ప్రాసెసర్ కలిగి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఇది 5G కనెక్టివిటీ మద్దతుతో రావచ్చు అని తెలుస్తున్నది. రాబోయే వారాల్లో దీని గురించి మరిన్ని వివరాలు విడుదల చేసే అవకాశం ఉంది.

షియోమి ఫోల్డబుల్ ఫోన్ 865+ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్

షియోమి ఫోల్డబుల్ ఫోన్ 865+ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్

షియోమి యొక్క ఫోల్డబుల్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 800 చిప్‌సెట్‌లలో 865+ ప్రాసెసర్ కలిగి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఇది 5G కనెక్టివిటీ మద్దతుతో రావచ్చు అని తెలుస్తున్నది. రాబోయే వారాల్లో దీని గురించి మరిన్ని వివరాలు విడుదల చేసే అవకాశం ఉంది.

షియోమి ఫోల్డబుల్ ఫోన్ 108MP కెమెరా ఫీచర్స్

షియోమి ఫోల్డబుల్ ఫోన్ 108MP కెమెరా ఫీచర్స్

షియోమి యొక్క స్మార్ట్‌ఫోన్‌లలో ఇప్పటికే 108 మెగాపిక్సెల్ కెమెరా ఫీచర్లను ఉపయోగించడం జరిగింది. అయితే ఈ కొత్త ఫోన్ యొక్క మెయిన్ కెమెరా యొక్క నిర్ధారణ మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. కంపెనీ ఇప్పటికే అదే సెన్సార్‌ను Mi10 సిరీస్‌లో ఉపయోగించింది. కాబట్టి వారు దాన్ని మరోసారి ఎంచుకోవడం నిజంగా ఆశ్చర్యం కలిగించదు. ఫోల్డబుల్ అరేనాలో షియోమి ఎటువంటి కొత్త ఫీచర్లను అందిస్తుందో చూడడానికి మరికొంత సమయం వేచిఉండాలి. అలాగే ఇది గెలాక్సీ ఫోల్డబుల్ సిరీస్ ఫోన్ల కంటే తక్కువ ధరను కలిగి ఉండే అవకాశం అధికంగా ఉంటుంది అని సమాచారం.

Best Mobiles in India

English summary
Xiaomi Company Finally Working on Foldable Phone With Gorgeous Features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X