Home
News

ఈ పవర్‌ బ్యాంకు వినియోగిస్తుంటే వెంటనే వెనక్కి ఇచ్చేయండి.. ప్రమాదాలు జరగవచ్చు..!

Xiaomi 33W 20000mAh power bank : ప్రముఖ సంస్థ షియోమీ కీలక ప్రకటన చేసింది. సంస్థ ఇటీవల విక్రయించిన పవర్‌ బ్యాంక్‌ ను వెనక్కి తీసుకున్నట్లు తెలిపింది. చైనాలో ఇటీవలే ఈ మోడల్‌ ను రికాల్‌ చేసిన సంస్థ.. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఈ మోడల్‌ ను వెనక్కి తీసుకున్నట్లు తెలిపింది. ఇందుకు కారణాలను కూడా వెల్లడించింది. భద్రతాపరమైన కారణాలతో రికాల్‌ చేస్తున్నట్లు తెలిపింది. రిఫండ్‌ ఇస్తున్నట్లు తెలిపింది.

ఈ మోడల్‌ నంబర్‌ కలిగిన పవర్‌ బ్యాంకు వినియోగిస్తుంటే :
షియోమీ ఇటీవల 33W 20000mAH పవర్‌ బ్యాంక్‌ ను విడుదల చేసింది. గత సంవత్సరం ఆగస్టు నుంచి సెప్టెంబర్‌ నెలల్లో ఉత్పత్తి చేసిన PB2030MI మోడల్ ను వెనక్కి తీసుకున్నట్లు తెలిపింది. ఈ బ్యాచ్ పవర్‌ బ్యాంక్స్‌లో 126280 వెర్షన్‌ 2.0 బ్యాటరీ సెల్‌ ను ఉపయోగించినట్లు షియోమీ తెలిపింది.

Xiaomi decided to recall 33W 20000mAh power bank

ఇలాంటి ప్రమాదాలు జరగవచ్చు :
ఈ బ్యాచ్‌ పవర్‌ బ్యాంక్‌లు కొన్ని పరిస్థితుల్లో వేడెక్కడం, కాలిపోవడం వంటి ప్రమాదాలకు అవకాశం ఉన్నట్లు గుర్తించామని సంస్థ తెలిపింది. వీటి వల్ల భవిష్యత్‌ లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రీకాల్‌ చేస్తున్నట్లు తెలిపింది.

సుమారుగా లక్షా 46 వేల పవర్‌ బ్యాంక్‌లు వెనక్కి :
ఈ పవర్‌ బ్యాంక్స్‌ పై కొన్ని కేసులు మాత్రమే నమోదయ్యాయని, అయితే ఈ బ్యాంక్‌ కు సంబంధించిన 1,46,897 యూనిట్స్‌ ను రీకాల్‌ చేస్తున్నట్లు తెలిపింది. వీటికి సంబంధించి రీఫండ్‌ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ పవర్‌ బ్యాంక్స్‌ ను కొనుగోలు చేసిన వారు సీరియల్‌ నంబర్‌ ఆధారంగా గుర్తించి వెనక్కి ఇవ్వాలని స్పష్టం చేసింది.

ఆన్‌లైన్‌ వెరిఫికేషన్‌ టూల్‌ :
ఈ సీరియల్‌ నంబర్‌ ను గుర్తించేందుకు వీలుగా ఆన్‌లైన్‌ వెరిఫికేషన్‌ టూల్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. పవర్‌ బ్యాంక్‌ పై సీరియల్‌ నంబర్‌ లేకుంటే మాత్రం రీఫండ్‌ కు అర్హులు కాదని స్పష్టం చేసింది. అర్హులైన వారు రూ.1940 రీఫండ్‌ ను పొందవచ్చని తెలిపింది.

రెండు విధాలుగా రీఫండ్‌ను పొందవచ్చు :
33W 20000mAh పవర్‌ బ్యాంకు యూజర్లు, రీఫండ్‌ కోసం షియోమీ స్టోర్‌లను సందర్శించాల్సి ఉంటుందని తెలిపింది. అక్కడ పూర్తి వివరాలను తెలుసుకోవచ్చని పేర్కొంది. దీంతోపాటు యూజర్లే నేరుగా పవర్‌ బ్యాంక్‌ ను డిస్పోజల్‌ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.

ఇందుకోసం షియోమీ వెబ్‌సైట్‌ లో డిస్పోజల్‌ ఫ్రూఫ్‌ ను అప్‌లోడ్‌ చేసి, రీఫండ్‌ను పొందవచ్చని చెప్పింది. ఈ బ్యాచ్‌ లోనే లోపాలను గుర్తించామని, ఇతర బ్యాచ్‌లలో ఎటువంటి లోపాలను లేవని షియోమీ స్పష్టం చేసింది. యూజర్లు సహకరించాలని కోరింది.

అందుకే రీకాల్‌ నిర్ణయం :
ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఈ రీకాల్‌ నిర్ణయం తీసుకున్నామని షియోమీ తెలిపింది. యూజర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. PB2030MI మోడల్‌ నంబర్ కలిగిన షియోమీ పవర్‌ బ్యాంక్‌ యూజర్లు త్వరగా స్పందించి, రీఫండ్‌ ను పొందాలని కోరింది.

Best Mobiles in India

English summary
Xiaomi decided to recall 33W 20000mAh power bank with PB2030MI model here is the reason
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X