షియోమి దివాళీ సంబరాలు ఈ రోజు నుండే మొదలు, ఈ ఫోన్ల పైనే తగ్గింపు.

By Gizbot Bureau
|

పండుగల సీజన్ నేపథ్యంలో ఫెస్టివల్ షాపింగ్ ఊపందుకుంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు ఇప్పటికే తమ పండుగ సేల్‌ను ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో షియోమి కూడా పండుగ సేల్‌ను ప్రారంభిస్తోంది.దీపావళిని పురస్కరించుకుని సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు భారీ ఆఫర్లతో దివాళీ సేల్‌ను నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది. ఈ సేల్‌‍లో భాగంగా షియోమీ తన అన్ని స్మార్ట్‌ఫోన్‌లతో పాటు టీవల పై భారీ రాయితీల పై విక్రయించనుంది.అయితే ఇదే సమయంలో ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ కూడా ప్రారంభం కాబోతోంది. కాగా షియోమి సేల్ ఎంఐ.కామ్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ లో భాగంగా డెబిట్, క్రెడిట్ కార్డులపై డిస్కౌంట్లు అలాగే బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్లు ఉండనున్నాయి. ఆఫర్లను ఓ సారి పరిశీలిస్తే....

Redmi Note 7 Pro
 

Redmi Note 7 Pro

దీని లాంచింగ్ ధర రూ. 13, 999. కాగా ఈ ఫోన్ ఈ సేల్ లో భాగంగా రూ. 2 వేల తగ్గింపును అందుకోనుంది. కేవలం రూ.11,999కే అందుబాటులోకి రానుంది. దీంతో పాటుగా అదనంగా పాల ఫోన్ల ఎక్సేంజ్ ఆఫర్ కింద వేయి రూపాయిలు తగ్గింపు కూడా అందుకోనుంది. అయితే ఫ్లిప్ కార్ట్ లో కూడా ధర రూ. 2 వేలు తగ్గింది.

Redmi 7A

Redmi 7A

దీని లాంచింగ్ ధర రూ. 5,880. కాగా ఈ ఫోన్ ఈ సేల్ లో భాగంగా వేయి రూపాయలు తగ్గింపును అందుకోనుంది. కేవలం రూ.4,999కే అందుబాటులోకి రానుంది.అయితే ఫ్లిప్ కార్ట్ లో కూడా ఇదే ధరకు అందుబాటులో ఉంది. అమెజాన్ ఇంకా తన డిస్కౌంట్ ధరలను రీవిల్ చేయలేదు. ఇదే ధరకు అందుబాటులోకి రావచ్చు.

Redmi Y3

Redmi Y3

ఈ ఫోన్ కూడా తగ్గింపును అందుకోనుంది. 3జిబి, 4జిబి ర్యామ్ ఫోన్లు తగ్గింపును అందుకోనున్నాయి. రెడ్ మి కె 20 ప్రో కూడా ఈ సేల్ లో భారీ తగ్గింపును అందుకోనుంది. ఈ ఫోన్ లాంచింగ్ ధర రూ.27,280 ఉండగా ఇప్పుడు 24,999కి దిగి వచ్చింది. రెడ్ మి నోట్ 7ఎస్ కూడా రూ.8999కే అందుబాటులో ఉంది.

ఎంఐ టీవీలపై తగ్గింపు
 

ఎంఐ టీవీలపై తగ్గింపు

షియోమి దివాళి సేల్ లో భాగంగా ఎంఐ టీవీలు భారీ తగ్గింపు ధరలో అందుబాటులోకి రానున్నాయి.Mi LED TV 4A Pro 32-inch, Mi LED TV 4C Pro 32-inch, MI LED TV 4A Pro 43-inch, and Mi LED TV 4X Pro 55-inch ఈ స్మార్ట్ టీవీలు అన్ని తగ్గింపు ధరలకే అందుబాటులోకి రానున్నాయి. ఎంఐ ఇయర్ ఫోన్స్ 50 శాతం తగ్గింపును అందుకోన్నాయి. వీటితో పాటుగా గోల్డ్ రష్ గేమ్ ూడా యూజర్లకు అందుబాటులో ఉంచింది. ఈ ఆఫర్లతో పాటు గూడ్స్ మీద కూడా ప్రత్యేక ఆఫర్లన ప్రకటించింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Xiaomi Announces Diwali With Mi Sale: Redmi K20 for Re.1; Price Cuts on Redmi Note 7 Pro, Mi TVs, Mi Band 3

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X