30% ఆఫ్‌లైన్ అమ్మకాల పై Xiaomi గురి

Posted By: BOMMU SIVANJANEYULU

ఈ ఏడాది చివరినాటికి ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా 30% అమ్మకాలను ఆశిస్తున్నట్లు చైనా స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ షోవోమి తెలిపింది.

30% ఆఫ్‌లైన్ అమ్మకాల పై Xiaomi గురి

ఆఫ్‌లైన్ మార్కెట్లో తమ బ్రాండ్ శరవేగంగా విస్తరిస్తోందని, 2017 జూలై -ఆగష్లు మాసాలకు గాను తమకు లభించిన మొత్తం సేల్‌లో 20 శాతం సేల్ ఆఫ్‌లైన్ ఛానల్స్ ద్వారా వచ్చినదేనని, ఈ ఏడాది చివరి నాటికి తమ ఆఫ్‌లైన్ సేల్ 30 శాతానికి చేరుకోవాలని ఆసిస్తున్నామని షావోమి ఇండియా హెడ్ మను కుమార్ జైన్ తెలిపారు.

ఆఫ్‌లైన్ మార్కెట్‌ను మరింతగా విస్తరించుకునే క్రమంలో షావోమి ఇప్పటికే రిలయన్స్ డిజిటల్‌తో ఒప్పందం కుదర్చుకుంది. అంతేకాకుండా, వివిధ ఆఫ్‌లైన్ ఛానల్స్ ద్వారా తన పాపులర్ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయిస్తోంది.

తమకు దేశవ్యాప్తంగా వేలాది రిటైల్ పాయింట్లు ఉన్నాయని, ఇవే కాకుండా 100 వరకు Mi Home స్టోర్‌లను దేశవ్యాప్తంగా నెలకొల్పాలని భావిస్తున్నట్లు మను కుమార్ జెయిన్ తెలిపారు.

నూతనంగా లాంచ్ చేసిన Redmi Y సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల గురించి షోవోమి స్పందిస్తూ తమ 'వై’ సిరీస్
స్మార్ట్‌ఫోన్‌లు రోజువారి కార్యకలాపాలను మరింతగా మెరుగుపరుస్తాయని, ఈ ఫోన్‌లలోని పెద్దదైన డిస్‌ప్లే, హైక్వాలిటీ కెమెరా, సాలిడ్ బ్యాటరీ లైఫ్ వంటి అంశాలు స్మార్ట్ మొబైలింగ్‌ను మరింత సుఖమయం చేస్తాయని తెలిపింది.

భారీ అంచనాలతో వన్‌ప్లస్ '5టీ'

షావోమి తన 'వై’ సిరీస్ ఫోన్‌లతో పాటు గ్లోబల్ వర్షన్ MIUI 9 యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కూడా మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఇంటర్‌ఫేస్‌ మరిన్ని కొత్త సదుపాయాలను షావోమి ఫోన్‌లలోకి తీసుకురాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా MIUI యూజర్ ఇంటర్‌ఫేస్‌‌ను 280 మిలియన్ యూజర్లు వినియోగించుకుంటున్నారు.

పంచాంగ్ క్యాలండర్, ఫెస్టివల్ కార్డ్స్, హారోస్కోప్, న్యూస్, క్రికెట్ న్యూస్, క్రికెట్ షెడ్యూల్, హెల్త్ అండ్ ఫిట్నెస్, 'ఆన్ దిస్ డే’ ఇన్ఫర్మేషన్ వంటి స్పెషల్ అప్‌డేట్స్‌ను ఎంఐయూఐ యూజర్ ఇంటర్‌ఫేస్‌‌ ఇండియన్ యూజర్లకు అందిస్తోంది.

Read more about:
English summary
Xiaomi announced the launch of a new smartphone series designed around people’s lifestyles with Redmi Y1 and Redmi Y1 Lite.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot