Home
News

దుమ్మురేపుతున్న షియోమి ఫోల్డబుల్ ఫోన్ కొత్త టీజర్

స్మార్ట్‌ఫోన్లలో భారీస్క్రీన్‌, భారీ కెమెరా, భారీ స్టోరేజ్‌, డబుల్‌, ట్రిపుల్‌ కెమెరా ఫీచర్ల హవాతో పాటు మడతపెట్టే ఫోన్లపై భారీ క్రేజ్‌ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో దిగ్గజ కంపెనీలన్నీ ఆ వైపుగా అడుగులు వేస్

స్మార్ట్‌ఫోన్లలో భారీస్క్రీన్‌, భారీ కెమెరా, భారీ స్టోరేజ్‌, డబుల్‌, ట్రిపుల్‌ కెమెరా ఫీచర్ల హవాతో పాటు మడతపెట్టే ఫోన్లపై భారీ క్రేజ్‌ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో దిగ్గజ కంపెనీలన్నీ ఆ వైపుగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమి సరికొత్త ప్రయోగానికి ఇదివరకే శ్రీకారం చుట్టింది. ప్రోటోటైప్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తానని చెప్పింది.

దుమ్మురేపుతున్న షియోమి ఫోల్డబుల్ ఫోన్ కొత్త టీజర్

అయితే ఆ దిశగా అడుగులు వేగంగానే పడుతున్నాయి. ఇది వరకే ఓ వీడియోని రిలీజ్ చేసి సంచలనం సృష్టించిన షియోమి ప్రోటోటైప్ టు-వే ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించి మరో వీడియోని షేర్ చేసింది. ఫోల్డబుల్ ప్రోటోటైప్ డబుల్ ఫోల్డింగ్ డిజైన్‌తో వస్తోంది. అయితే ఈ ఫోన్‌ ఫీచర్లు, తదితర వివరాలను వెల్లడించలేదు.

10 సెకన్ల నిడివిగల మరో వీడియో టీజర్‌

10 సెకన్ల నిడివిగల మరో వీడియో టీజర్‌

తాజాగా 10 సెకన్ల నిడివిగల మరో వీడియో టీజర్‌ను కంపెనీ షేర్‌ చేసింది. ఫీచర్లు, ధర వివరాలపై అధికారికంగా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ సినిమా లెవల్లో టీజర్లు, రిలీజ్‌ డేట్‌ అంటూ భారీ హైప్‌ మాత్రం క్రియేట్‌ చేస్తోంది.

2019 రెండవ త్రైమాసికంలో

2019 రెండవ త్రైమాసికంలో

కాగా ఈ ఫోన్‌కు సంబంధించి షియోమి వైస్‌ ప్రెసిడెంట్‌ వాంగ్‌ చాంగ్‌ ఈ ఏడాది జనవరిలో ఒక వీడియోను రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. 2019 రెండవ త్రైమాసికంలో దీన్ని లాంచ్‌ చేయనుందని తెలుస్తోంది.

లక్షా 37వేల రూపాయల వరకు

లక్షా 37వేల రూపాయల వరకు

ఇక ధర విషయానికి వస్తే.. లక్షా 37వేల రూపాయల వరకు ధర నిర్ణయించవచ్చని అంచనా. ఫ్లాట్‌, డబుల్‌ ఫోల్డబుల్‌ డిజైన్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ రానుంది. అంతేకాదు ఇప్పటి వరకు వచ్చిన ఇతర ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లకు ఇది పూర్తిగా విభిన్నంగా ఉండనుందని సమాచారం.

వీబో అకౌంట్ లో షేర్

వీబో అకౌంట్ లో షేర్

వీడియోని మొదట షియోమీ అధికారిక వీబో అకౌంట్ లో షేర్ చేశారు. ఈ వీడియోలో కంపెనీ ఫోల్డబుల్ ఫోన్ ప్రోటోటైప్ కనిపిస్తోంది. వీడియోలో ఒక వ్యక్తి ఫోన్ ని అన్ ఫోల్డెడ్ స్టేట్ లో పోర్ట్రేట్ మోడ్ లో ఉపయోగిస్తూ కనిపిస్తున్నారు.

స్క్రీన్ ఓరియంటేషన్

స్క్రీన్ ఓరియంటేషన్

ఆ తర్వాత అతను ఫోన్ ఓరియంటేషన్ మారుస్తాడు. ఫోన్ ను రెండు వైపుల నుంచి మడిచి నూడుల్స్ బాక్స్ లో పెడుతున్నాడు. స్క్రీన్ ఓరియంటేషన్ మార్చడం, ఫోన్ యుఏఐని ట్యాబ్లెట్ మోడ్ నుంచి ఫోన్ మోడ్ లోకి మార్చగానే సాఫ్ట్ వేర్ ల్యాగ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ లోపాన్ని సరిదిద్దాకే మార్కెట్ లోకి విడుదల చెయ్యాలని షియోమి భావిస్తున్నట్లు సమాచారం

Best Mobiles in India

English summary
Xiaomi’s foldable phone shows up in new video teaser
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X