Just In
- 2 hrs ago
Vu కొత్త టీవీల ఫీచర్ల మీద ఓ లుక్ వేయండి!! ధర కూడా అందుబాటులోనే...
- 5 hrs ago
OnePlus రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లు: వన్‌ప్లస్ 8T, నార్డ్ & టీవీలను కొనడానికి సరైన సమయం...
- 7 hrs ago
Flipkart Big Saving Days saleలో రియల్‌మి C12 4GB ర్యామ్ కొత్త వెర్షన్ మొదటి సేల్!! సూపర్ ఆఫర్స్..
- 9 hrs ago
Signal యాప్ ను ల్యాప్‌టాప్ లేదా PCలో యాక్సిస్ చేయడం ఎలా??
Don't Miss
- Movies
త్రివిక్రమ్-రామ్ సినిమా.. అది అతడినే అడగాలి.. స్రవంతి రవికిశోర్ కామెంట్స్ వైరల్
- Sports
టీమిండియా విజయం వెనుక అలుపెరగని యోధుడు.!
- News
ఎంపీలకు ఫుడ్ సబ్సిడీ ఎత్తివేత -29నుంచి పార్లమెంట్ బడ్జెట్ భేటీ -క్వశ్చన్ అవర్‌కు ఓకే: స్పీకర్
- Lifestyle
ఆర్థిక, రాహు-కేతు సమస్యలా? కర్పూరంలో లవంగాలు వేసి కాల్చండి .. అప్పుడు జరిగే అద్భుతాలను చూడండి .. ఆశ్చర్యపోతారు
- Finance
FY26 నాటికి 4 శాతం కేంద్ర ప్రభుత్వం జీడీపీ లక్ష్యం!
- Automobiles
మారుతి సుజుకి కస్టమర్లకు షాక్.. రూ.34,000 మేర పెరిగిన ధరలు..
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
2020 Q3 స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలలో సత్తా చాటిన షియోమి కంపెనీ...
COVID-19 మహమ్మారి తరువాత ఇండియా యొక్క స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మళ్ళి పూర్వ వైభవాన్ని పొందనున్నది. ప్రముఖ షియోమి సంస్థ ప్రస్తుతం భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నది అని మార్కెట్ పరిశోధకులు కెనాలిస్ నివేదికలో తెలిపారు. శామ్సంగ్ సంస్థ కూడా బడ్జెట్ మరియు ప్రీమియం హ్యాండ్‌సెట్‌ల అమ్మకాలలో బలమైన లాభాలను చవిచూసింది.

ఇండియాలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వృద్ధి శాతం
COVID-19 మహమ్మారి కారణంగా ఉత్పత్తి అంతరాయాలు మరియు దిగుమతి జాప్యాలలో 2020 సంవత్సరం రెండవ త్రైమాసికంలో పెద్ద తిరోగమనానికి కారణమయ్యాయి. అయితే మొబైల్ ఎగుమతులు మూడవ త్రైమాసికంలో సంవత్సరానికి 8 శాతం వృద్ధిని నమోదు చేశాయి. భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ప్రస్తుతం వేగంగా కోలుకునే దిశగా పయనిస్తున్నట్లు విశ్లేషకులు తన నివేదికలో పేర్కొన్నారు. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో మొబైల్ ఉత్పత్తులు 5 కోట్ల యూనిట్లుకు పైగా రవాణా చేయబడ్డాయి. ఇది భారతదేశంలో ఒకే త్రైమాసికంలో స్మార్ట్ఫోన్ రవాణాకు కొత్త రికార్డు అని నివేదిక పేర్కొంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.
Also Read: Netflix ను 48 గంటల పాటు ఉచితంగా యాక్సిస్ చేసే గొప్ప అవకాశం...

షియోమి స్మార్ట్‌ఫోన్ అమ్మకాల వృద్ధి శాతం
2020 సంవత్సరం మూడవ త్రైమాసికంలో 1.3 కోట్ల యూనిట్లు రవాణా చేయబడి ఈ సంవత్సరంలో 9 శాతం వృద్ధి చెంది షియోమి సంస్థ ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతున్నది. అలాగే శామ్సంగ్ సంస్థ 1.2 కోట్ల యూనిట్ల అమ్మకాలతో 7 శాతం వృద్ధితో రెండవ స్థానంలో కొనసాగుతున్నది. శామ్సంగ్ తన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను రెట్టింపు చేసుకోవడంలో బడ్జెట్ విభాగంలో ఇతరులతో పోటీపడి తక్కువ ధరల వద్ద తమ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది అని నివేదిక పేర్కొంది.

వివో, ఒప్పో స్మార్ట్‌ఫోన్ అమ్మకాల వృద్ధి శాతం
ఈ సంవత్సరంలో ఇప్పుడు వివో సంస్థ 88 లక్షల యూనిట్లతో మూడవ స్థానానికి పడిపోయింది. కానీ BBK ఎలక్ట్రానిక్స్ సబ్-బ్రాండ్ రెండవ త్రైమాసికంతో పోలిస్తే 19 శాతం వృద్ధిని నమోదు చేసింది. షియోమి సబ్ బ్రాండ్ అయిన రియల్‌మి ఈ కాలంలో 87 లక్షల స్మార్ట్‌ఫోన్‌ల రవాణాతో తరువాతి స్థానంలో ఉంది. దీని తరువాత ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఒప్పో సంస్థ క్యూ 3 లో 61 లక్షల స్మార్ట్‌ఫోన్‌ల రవాణాతో మొదటి ఐదు స్థానాలలో ఉంది.

ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనా విక్రేతల స్థానం
భారతదేశంలో విక్రయించే మొత్తం స్మార్ట్‌ఫోన్‌లలో 76 శాతం వాటా షియోమి, BBKతో సహా చైనా విక్రేతలు కలిగి ఉన్నారు. గత కొన్ని నెలలుగా భారతదేశం మరియు చైనా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత చర్చనీయాంశంగా ఉంది. కాని సామూహిక-మార్కెట్ వినియోగదారుల కొనుగోలు నిర్ణయాలపై దీని యొక్క గణనీయమైన ప్రభావం ఇంకా పడలేదు అని కెనాలిస్ రీసెర్చ్ అనలిస్ట్ వరుణ్ కన్నన్ తెలిపారు.

భారతదేశంలో ఆపిల్ ఐఫోన్ అమ్మకాల వృద్ధి రేటు
ఆపిల్ సంస్థ తన చిన్న మరియు ప్రీమియం ఫోన్లతో తన యొక్క పోర్ట్‌ఫోలియోను మూడవ త్రైమాసికంలో రెండంకెల వృద్ధిని సాధించింది. ఆపిల్ పోర్ట్‌ఫోలియోలో తక్కువ ధర వద్ద ఎంట్రీ పాయింట్‌గా విడుదల అయిన ఐఫోన్ SE ఈ త్రైమాసికంలో దూకుడుగా ఇండియా యొక్క మార్కెట్ లో 8 లక్షల యూనిట్లను విక్రయించింది. అయితే ఆపిల్ యొక్క కొత్త ఐఫోన్ 12 మరియు 12 ప్రో యొక్క అమ్మకాలు భారతదేశంలో కఠినంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే నెట్‌వర్క్ ఆపరేటర్లకు మాస్-మార్కెట్ 5G విస్తరణకు ఇంకా మౌలిక సదుపాయాలు అందుబాటులో లేవు. భారతదేశంలో కొత్త ఐఫోన్‌ల కోసం ఆపిల్ ధరల వ్యూహాన్ని తీవ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఐఫోన్ 12 మరియు 12 ప్రో యొక్క ప్రీ-ఆర్డర్ ఈ రోజు నుండి ప్రారంభంకానున్నాయి.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190